20, మార్చి 2009, శుక్రవారం

మీరు కష్టంలో ఉన్నప్పుడు...

ఇదివరకటి తరంకంటే నేటి తరానికి స్మస్యలు, కష్టాలు ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. అందుకు కారణాలు అనేకం. సాధారణంగా కష్టంలో ఉన్నప్పుడే మనకు ఒక తోడు అవసరం. అది మనుషులు తీర్చగలిగే సమస్య కానప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. మనలో ఏమూలో దాక్కున్న భక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలో చించని వారు సైతం పరమ భక్తులు అవుతుంటారు.

కనీసం మనం కష్టంలో ఉన్నప్పుడైనా ఆ భగవంతుడిని శరణు వేడడం ఆనంద దాయకం. అప్పుడు కూడా ఆ భగవంతుడిని నమ్మక ఏదో ప్రయోగాలు చేస్తూ అష్ట కష్టాలు పడుతున్న వారూ ఉన్నారు. బయట పడుతున్న వారూ ఉన్నారు. కానీ అది చాలా తక్కువ శాతం.

మీరు నిజంగా కష్టంలో ఉంటే అనవసర ఆలోచనలు పెట్టుకోకుండా ఒక్కసారి... ఒకే ఒక్కసారి ఆ సర్వేస్వరుడిని ప్రార్దించండి. మనస్ఫూర్తిగా మీ కష్టాలనన్నింటినీ ఆయనకు నివేదించండి. ఆయన మీ సమస్యలు తీరుస్తాడని నమ్మండి. మీకు కనిపించే మార్గంలో ప్రయాణించండి. మీ గమ్యానికి తప్పక చేరుకుంటారు.

మీరు పూర్తి ఆనందంతో జీవిస్తుంటే ఏపూజా చేయనఖర్లేదు, ఏ శ్లోకాలూ చదవనఖర్లేదు. కానీ బాధలో ఉంటే... కష్టాలలో ఉంటే... ఆ సమస్య ఎంత పెద్దదైనా... చిన్న చిన్న పరిష్కార పద్ధతుల ద్వారా చక్కటి ఫలితాలు పొందవచ్చు.
అలాంటి పద్దతులలో అందరూ ఆచరించదగిన, సులభమైన పద్దతి శ్లోక పారాయణ ఒకటి. ఈ శ్లోకాలు ప్రతినిత్యం చదవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి.నేను నాపురోహితంలో చాలా మందిచేత వివిధ పద్దతులలో చదింవించి మంచి ఫలితాలు రాబట్టాను. బ్లాగు మిత్రులందరికీ కూడా ఈ శ్లోకాలు ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ రాస్తున్నాను.
అన్ని విఘ్నాలూ తొలగి, అనుకున్న పనులు సకాలంలో సిద్ధించుట కొరకు ఈ క్రింది శ్లోకాన్ని ప్రతినిత్యం మూడు సంధ్యలలో భక్తితో పఠించాలి. విద్య, ధనం, సంతానం, మోక్షం కోరుకున్నది ఏదయినా ఆరు నెలలలో ఫలితం లభిస్తుంది. సంవత్సరంలో మంత్ర సిద్ధి కలుగుతుంది. ఇందులో సంశయం లేదు. తరువాత ఈ శ్లోకాన్ని స్వయంగా రాసి ఎనిమిది మంది బ్రాహ్మలకు/ బ్రహ్మచారులకు/విద్యార్థులకు ఇచ్చినట్లైతే వారికి అఖండ విద్య లభిస్తుంది.

1. సంకటనాశన గణేశ స్తోత్రం:

నారద ఉవాచ

ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం,
భక్తా వాసం స్మరేన్నిత్యం, ఆయుహ్ కామార్ధ సిద్ధయే.

ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకం,
తృతీయం కృష్ణ పింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం.

లంబోదరం పంచమంచ, షష్ఠం వికటమేవచ,
సప్తమం విఘ్నరాజంచ, ధూమ్ర వర్ణం తథాష్టమం.

నవమం ఫాలచంద్రంచ, దశమంతు వినాయకం,
ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననం.

ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యహ్ పఠేన్నరహ్,
న చ విఘ్న భయం తస్య, సర్వ సిద్ధికరం ప్రభో!

విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిం.

జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైహ్ ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధించ, లభతే నాత్ర సంశయహ్.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యహ్ సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతహ్.

ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణం.


సర్వ గ్రహ బాధలు తొలగి, అన్నిటా విజయం లభించుట కొరకు

2. శ్రీదేవీ ధ్యానం:


ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.

ఓం సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతనే
గుణాశ్రయే గుణ మయే నారాయణి నమోస్తుతే.

ఓం శరణాగత దీనార్తా పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే.

ఓం ఓంకార పంజరశుకీం ఉపనిషమదుద్యాన కేళీ కలకంఠీం
ఆగమవిపిన మయూరీం ఆర్యామంతర్విభావయే గౌరీం.

ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ
దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే.


మరిన్ని శ్లోకాలు త్వరలో.... :)

10 వ్యాఖ్యలు:

 1. guruvu gAru
  mOkshaM in 6 months? I do not think so. kOTAnukOTla janmalettitEgAnI mOkShaM anEdi aMta sulaBaMgA dorikEdi kAdu ani nA bODi aBiprAyaM.

  I agree that Ganesh mantra is excellent but can it give mOkShaM in 6 months? s-i-x months? I do not think so. EmI anukOkaMDE?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మంచి ప్రశ్న.. అది నేను చెప్తున్నది కాదు... ఆ శ్లోకంలోనే ఉంది...


  ఏదైనా కోరిక తీవ్రతను బట్టి, దాని కోసం మనం చేసే ప్రత్నం మీద మనకున్న నమ్మకాన్ని బట్టీ అది తీరడం అనేది ఆధారపడుతుంది. కొన్ని మన ఆలోచనలకు అందవు... సద్గురువుల అనుగ్రహం వల్లనే గ్రహించగలం.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Pujya sarma garu

  Excellent andi. Previously i used to read this stotram but now stopped. Again i will start reading. Chaala manchi manchi vishayalu cheptunnaru andi. I am very lucky to come forward your blog. Rahu graham lo chaalaa badhalu padavalasi vastundi antaru. daaniki nivaranaga edanna meeru chepte nenu tappakunda cheddamani anukuntunnanu andi.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శెశిరేఖ గారు రాహు మహర్దశలో ఉన్న వారు దుర్గాదేవిని పూజిస్తే రాహు ప్రభావం తగ్గి వృద్ధిలోకి వస్తారు. రాహువు ఎంత ప్రతిభ ఉన్నా అది బయటకు రానివ్వడు. అతడు శాంతించాలంటే రాహువు శ్లోకంతో పాటు దుర్గాదేవి స్తోత్రములు పారాయణ చేయండి. అందుకు ఈ దేవీనవరాత్రులు చాలా మంచి రోజులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాలా మంచి ఉపయోగకరమైన విషయాలను అందిస్తున్నారు, మంచిది.

  // ఓం శరణాగత దీనార్తా పవిత్రాణ పరాయణే //
  ఓం శరణాగత దీనార్తా పరిత్రాణ పరాయణే
  అనుకుంటా!!

  అలాగే
  ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకేళీ* కలకణ్ఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతహ్విభావయేత్ గౌరీం.

  స్వరదోషం లేక వాక్దోషం ఎలాగో జరుగుతుంది కాబట్టి
  ఏ స్తోత్రం చదివినా ఆపై క్షమా ప్రార్తాన చేయటం ఉత్తమం

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అవును తప్పులు దిద్దాను. అలాగే పైన కూడా ఉన్న కొన్ని టైపాటులు దిద్దాను. ధన్యవాదములు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఏదో ఒక పుస్తకంలో ఒక్కసారి అచ్చు తప్పైనా ఇలా అందరివీ తప్పు అవుతుంటాయి
  అయితే ప్రతిపదార్థం అన్వయిన్చుకోవాలనుకుంటే ఆయా తప్పులు దిద్దుబాటవుతాయి
  ఉదాహరణకు పైన చెప్పిన ఓంకార పంజరశుకీం
  అన్న శ్లోకంలో అమ్మవారిని ఓంకారమనబడే పంజరంలో గల చిలుకగా
  ఉద్యానమె ఉపనిషత్తులుగా
  ఆగమమనే వనంలో మయూరంగా వర్ణించారు
  అలా అచ్చుతప్పులను సరిచేస్కోవచ్చు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అయ్యా! నమస్కారం. మొదటి సారి మీ బ్లాగు సందర్శించాను. చాల ఓపిగ్గా విషయాలను వివరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు మరియు అభినందనలు. మీ బ్లాగు కనపడినదే తడవుగా నిన్నటి నుండి మొత్తం పూర్తి చేసేటప్పటికి ఇప్పటికి అయినది. మంచి విషయాలు తెలిజేస్తున్నారు. నాదొక్క చిన్న సందేహము. ఒకవేళ జాతకంలో గురువు అశుభ స్థానంలో ఉంటే మరేంటి మార్గం. అనగా గురు గ్రహ దోషం ఉన్న వారు ఏమేం చేయాలో పరిహారం చెప్తారని ఆశిస్తున్నాను. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నమస్కారం క్రిస్ గారు. గురువు కనుక బాగోలేక పోతే గురు గ్రహమంత్రానుష్ఠానము , పెద్దలు, బ్రాహ్మణులు, గురువుల సేవ చేసినట్లైతే ఆయన శాంతించి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ధన్యవాదాలు. ఆలస్యానికి క్షంతవ్యుడ్ని. :-)

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.