25, మార్చి 2009, బుధవారం

ఎవరైనా నా సందేహాలు తీర్చరూ...!?నాకు ఈ బ్లాగు లోకం కాస్త కొత్త. కానీ నా స్నేహితుల సహాయంతో చాలా తెలుసుకున్నాను. వాళ్లకు కూడా తెలియని కొన్ని సందేహాలను ఎవరినడిగి తెలుసుకోవాలో అర్ధం కాలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరికైనా తెలిస్తే నా సందేహాలు తీర్చరూ... :)

నా సందేహాలు:

1. బ్లాగును ఎన్నిసార్లు ఎంతమంది చూశారో తెలుసుకోవడం ఎలా? ప్రొఫైల్ విజిట్లు తెలిపినట్లే, బ్లాగు విజిట్లు కూడా తెలుసుకునే టట్లు కొన్ని బ్లాగుల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అది ఎలా చేసుకోవాలి?

2. బ్లాగు అనుచరుల జాబితా మొదట్లో నా బ్లాగులో కనపడేది. ఇప్పుడు కనపడటం లేదు. సెట్టింగుల్లో కెళ్లి చూస్తే ఏవో అంకెలు వస్తున్నాయి. ఎందువల్ల? అది పూర్వం లా కనపడాలంటే ఏమి చెయ్యాలి?

3. కొన్ని బ్లాగుల్లోకి ప్రవేశించాలంటే వారి అనుమతి లెనిదే కుదరటం లేదు. వారి అనుమతి తీసుకుందామంటే వాళ్ల మెయిల్ ఐడి నాకు తెలియదే... :( మరి వాళ్ల అనుమతి తీసుకునే మార్గం ఏమిటి?

ఈ అనుమతి విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పటి నుండో ఇష్టంగా ఒక బ్లాగు చూస్తున్నా మనుకోడి, వాళ్ల ప్రతీ పోస్టుకీ సమాధానం ఇచ్చినా ఇవ్వక పోయినా పోస్టులు మాత్రం క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాము. కొంతకాలం తరువాత వాళ్ళు బ్లాగును తాము అనుమతించిన వాళ్లే చూసేలా ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏమిటి చెప్పండి? మనమేమో ఎప్పుడూ బ్లాగులో అందుబాటులోనే ఉంటారుకదా.... అనే ఉద్దేశంతో ఐడీ కూడా తీసుకోలేదనుకోండీ... మీకు బాధ అనిపించదూ...? అంత పర్సనల్ గా బ్లాగు నడప దలుచుకుంటే మరి కూడలి, జల్లెడలలో బ్లాగు చేర్చడం ఎందుకు? ఇంత కాలం వాళ్ల బ్లాగు పాపులారిటీ పెంచుకోవడానికీ, నా బ్లాగును అనుసరించే వాళ్లు 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, నాకు 30 వ్యాఖ్యలు వచ్చాయ్, 40 వ్యాఖ్యలు వచ్చాయి అని చెప్పుకోడానికి కొత్త నేస్తాలు కావలసి వచ్చారూ....! తాము కూడా హీరోలమే, తాము రాసేది చదివేందుకు జనాలు ఎగబడుతున్నారు అని నలుగురికీ చాటుకున్న తరువాత, తమ ఈగో సంతృప్తి పొదాకా మనం అవసరం లేక పోయామా...!? ఇది ఎంతవరకూ న్యాయ మండీ? ఇక్కడ ఏ ఒక్కరినో తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఇది మీమీద ఇష్టంతో వచ్చిన కోపం. మీ ఇబ్బందులు మీకుంటాయి, కాదనను. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. మీ బ్లాగుకి అటువంటి కట్టడి పెట్టాలనుకున్నప్పుడు, ఓ వారం రోజుల ముందుగా బ్లాగు మిత్రులందరికీ తెలిసేటట్టు ఓ పోస్టు మీ బ్లాగులో పెట్టవచ్చు. అప్పడు మీ బ్లాగును అభిమానించే వారు మీ అనుమతి తీసుకునే వీలు ఉంటుంది కదా..? మిమ్మల్ని, మి రచనల్నీ అభిమానించే వారినికూడా దృష్టిలో ఉంచుకుని ఏ నిర్ణయమైనా తీసుకోండి అనే నేను చెప్పదలుచుకున్నది. ఒక్క సారి ఆలోచించండి.

నా సందేహాలు తిరుస్తారు కదూ... ఉంటాను మరీ... :)

13 వ్యాఖ్యలు:

 1. మొత్తానికి భలేవారే , అడగడమెందుకు ,కామెంట్ రాయాలనిపిస్తే ఇలానే వారికి సంబోదిస్తూ తప రాసేస్తే సరి:)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. vijay gaaru
  http://superblogtutorials.blogspot.com chadivite mee doubts teeravacchu. try cheyandi

  Regards.,
  swathichakravarthy

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీ సందేహాల కంటే, మీరు వెళ్లగక్కుకున్న అక్కసు ఎక్కువైంది

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @ రాంబాబు గారు: అవునండీ... ఏమిచెయ్యను... మీతోనన్నా చెప్పుకుంటే రేపు మరో కొత్తవారు అలా చేసే ముందు కాస్త ఆలోచిస్తారు కదా అని.. అంతే... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. pls check the link below:

  http://www.bloggerbuster.com/2008/04/complete-list-of-blogger-tutorials.html#customize

  :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. blog general tutorials:
  http://www.bloggerbuster.com/2008/04/complete-list-of-blogger-tutorials.html

  for followers problem:
  http://help.blogger.com/bin/answer.py?hl=en&answer=141483

  for followers problem:
  http://buzz.blogger.com/2008/08/show-off-your-followers.html

  for background music in blog:
  http://www.bloggerbuster.com/2007/07/add-background-music-to-your-blog.html

  why followers not visible:
  http://www.eweek.com/c/a/Application-Development/Facebook-Gives-the-Finger-to-Googles-Friend-Connect/

  ప్రత్యుత్తరంతొలగించు
 7. follower problem links are, pls check them:
  http://googlesystem.blogspot.com/2008/09/blogger-followers-new-social.html

  http://www.bloggerbuster.com/2009/02/blogger-followers-now-integrated-with.html

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మీకు.. మీ కుటుంబానికి.. విరోధి నామ సంవత్సర ...శుభాకాంక్షలు.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. విరోధి నామ సంవత్సర ...శుభాకాంక్షలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ చక్కని సలహాలకు అందరికీ మనః పూర్వక ధన్యవాదాలు... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. విజయ్ గారూ!
  మీ సందేహాల్ని నేను ఇవాళే చూశాను.

  1. మన విజిట్ చేసిన వాళ్ళ సంఖ్యని తెలుసుకోవటం చాలా సులభం. ఉదా:కు నా బ్లాగు మాలతీ మాధవంలో అతిథి దేవో భవ అనే శీర్షిక కింద ఒక సంఖ్య వస్తూ ఉంటుంది కదా! దాని మీదక్లిక్ చెస్తే వాళ్ళ వెబ్ సైట్ కెళ్ళొచ్చు. వాళ్ళు చెప్పింది ఫాలో అవండి.

  2.బ్లాగు ఫాలోయర్స్ అనే గాడ్జెట్ నా బ్లాగులోనూ సడెన్ గా కనిపంచట్లెదు నేను మహిగ్రాఫిక్స్ వారి సహాయం తీసుకునే ప్రయత్నం చేసాను బహుశా నేనె వారికి నా సమస్య సరిగా చెప్పలేకపోయాననుకుంటా. నా సమస్య ఏంటంటే యాడ్ ఎ గాడ్జెట్ అనే చోటే ప్లస్ గుర్తు ఉండదు. ప్రాయోగికం అని ఉంటుంది. మిగతా గాడ్జెట్ లన్నీ ప్లస్ గుర్తు కలిగి ఉంటాయి. అందుకే మీ బ్లాగులో మన మిత్రులు ఇచ్చిన అన్ని అడ్రెస్ లకూ వెళ్ళి చూసినా సమాధానం దొరకలేదు.

  3. కొన్ని బ్లాగుల్లోకి వెళ్ళాలంటే అనుమతి అవసరమని వస్తోంది ఈ విషయమై నేను గతంలో నాబ్లాగులోనే ఒక స్నేహితురాలిని అడి
  గాను. ఆవిడ అలా జరిగిందని నా కే తెలీదు. తప్పుగా అనుకోవద్దని రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. విజయ్ గారూ,
  మీ కొత్త బ్లాగు-లే అవుట్ కూడా చాలా బాగుంది.
  మీలాగే నేను కూడా చాలా బాధపడుతున్నాను..ఎంతో కాలంగా చదువుతున్న బ్లాగుల్లోకి నాకు ప్రవేశం లేదంటే...అనుమతి ఎవరిని అడగాలి అన్న మీ సందేహమే నాదికూడా.మీ సందేహం తీరితే నాకూ తీరినట్టే...అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. nenu blog lokaniki kotha,naku yenno sandehalu cheppevalluleru,prathidi adagalemu katha ...anukokunda me post chusenu nakunna sandehalanu telusukovachhu.
  thanq

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.