16, జులై 2009, గురువారం

అమ్మ మనస్సు


నాకు ఓ అమ్మ కనిపించింది. ఆమె ప్రతి పలుకులో ప్రేమ తొణికిసలాట నాకు వినిపించింది. ప్రతి ఒక్కరిలో తన పాపను చూసుకునే, కనుపాపను చేసుకునే తత్వం నాకు నచ్చింది. ఆ అమ్మ ఏతలే కాదు, రాతలూ నాకు అబ్బురమనిపించాయి. నా మనసును కరిగించాయి. ఆ ఆనందం నాతో పాటు నా తోటి బ్లాగరులకూ పంచాలనుకున్నాను. బ్లాగు ప్రారంభించమన్నాను. కానీ సున్నితంగా తిరస్కరించారు. నేనే అమ్మ పేరుతో బ్లాగులో రాయాలని అనుకున్నాను. ఆప్రయత్న రూపమే "అమ్మ మనస్సు".
ఈ శీర్షికలో నేను రాసేవన్నీ ఆ అమ్మ సీతమ్మ రాతలే. చదివి ఆనందిస్తారు కదూ.. :)

మొదటగా మన బ్లాగర్ "క్రియేటివ్ కుర్రోడు మాధవ్" ని గురించి అమ్మ రాసిన కవిత...

అమూల్యం
ప్రపంచపు సంపదనంతా ప్రోగుచేసినా
నీ గుప్పెడు గుండెలోని ఆత్మీయతకు సాటి రాదు
నీ కళ్లలో కరుణే కానీ కల్తీ లేనే లేదు
స్ఫటికపు రాళ్లపై ప్రవహించే నీటిలా
అద్దమంటి మనసుతో
గరళం మింగింనా అమృతం అందించే
ఆర్ద్రత నీ పలుకుల్లో
స్వచ్ఛతకు మారు పేరు నువ్వు
సుమ సమీరం లాంటి చల్లని
నీ చేతి స్పర్శలో అమ్మ లాలిత్యం
ఎప్పుడో చంటి పాపాయిని
గతజన్మలో దూరం చేసుకున్నానేమో
ప్రేమతో-అమ్మ

5 కామెంట్‌లు:

  1. మాటలు లేవు.. రెండు అద్భుతాలు ఒకే సారి చూసిన తరువాత..ఒకటి మీరు చేసిన పరిచయం.. రెండు.. అమ్మ కవిత..అమ్మ మనసు..

    రిప్లయితొలగించండి
  2. మీ గొప్ప మనసుకి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు, నా దెగ్గర మాటలు లేవు, నా గురించి మీ బ్లాగులొ పెట్టడం, అది కూడ మా అమ్మ సీతమ్మ కవిత, చాల ఆనందంగా ఉంది.....
    నా జీవితానికే 'అమూల్యమైన ' బహుమతి ఆ కవిత
    ( ఆ కుటుంబం కూడా).
    ధన్యవాదాలు రాజశేఖరుని విజయ్ శర్మ గారు :)

    రిప్లయితొలగించండి
  3. క్రియేటివ్ కుర్రోడు గారికి: కవిత చాలా బాగుంది అందుకే నా బ్లాగులో కాస్త చోటిచ్చాను. అంతేకదా!? దానికి అంత మాటలెందుకండీ.....

    ఆ అమ్మ నాకూ అమ్మే....

    మీకానందం కలిగింది అదే పదివేలు. ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
  4. నమస్కారమండీ
    నా పేరు సందీప్ కుమార్. . మీరు నిర్వహిచే ఈ బ్లాగ్ నా లాంటి ఆధ్యాత్మిక అభిలాష కలిగిన వారి తృష్ణ చాలా వరకు నెరవేరుస్తున్నయి

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.