18, ఆగస్టు 2009, మంగళవారం

అందరికీ ఈ తెలుగు అంతర్జాల పేజీలు తెలుసో లేదో...!?

నేను బ్లాగు లోకం లోకి వచ్చి దాదాపు ఏడు నెలలు దాటింది. నాకు నా బ్లాగును , రచనలను నలుగురితో పంచుకోవడానికి నేటి వరకు తెలిసినవి కూడలి, జల్లెడ అనే బ్లాగు సముదాయ కేంద్రాలు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఎందుకో తెలుగు బ్లాగులు అని గూగుల్ లో వెతికితే అనేక ఆసక్తికర విషయాలు తెలిశాయి.

అవి నేను ఇప్పటి వరకూ చూడనివి. తెలుగు బ్లాగులు అన్నీ ఒకే చోట సమికృతమయ్యే ఆ వెబ్ పేజీల సమాచారాన్ని నాలాంటి కొత్తవారందరి కోసం ఈ క్రింద ఆయా లింకులు ఇస్తున్నాను.

ముందుగా కొత్త బ్లాగును ప్రారంభించాలి అనుకునే వారు బ్లాగర్.కామ్ ద్వారా కానీ వర్డ్ ప్రెస్.కామ్ ద్వారా కానీ మొదలు పెట్ట వచ్చు.

తెలుగులో బ్లాగు రచనలు చేయాలనుకుంటే...
ఆంగ్లం నుండి తెలుగుకు అనువదించడానికి ,తెలుగులో రాయడానికి

లేఖిని ( ఇప్పటి వరకు నాకు తెలిసినది లేఖిని మాత్రమే ... )

తెలుగు లిపి ( కొత్తగా చూసాను )

తెలుగు టైపింగ్ కొరకు ( కొత్తగా చూసాను ) అనే అంతర్జాల పేజీలు ఉపకరిస్తాయి.అందరికీ తెలిసిన తెలుగు బ్లాగు సముదాయ కేంద్రాలు ( ఇక్కడ మన రచనలు చేసిన బ్లాగులను ప్రచురించ వచ్చు. )
కూడలి
జల్లెడ

పొద్దు


క్రింది వాటిలో కూడా మన రచనలను ప్రచురించుకొనే వీలుంది .

తెలుగు బ్లాగుల ప్రపంచం
తెలుగురత్న
రచయుతలకు సూచనలు in తెలుగురత్న

తెలుగుబ్లాగు

తెలుగు జాతి మనది - తెలుగు సైట్లు ఇవి అనే బ్లాగులో కూడా కొత్త వారికీ పనికొచ్చే సమాచారం ఉంది.

వివేన్.కామ్ కూడా చూడండి.

మరికొన్ని కేంద్రాలను పరిచయం చేసే వెబ్ పేజి కోసం ఇక్కడ నొక్కండి.

ఇంకా మీకు తెలిసిన మరిన్ని వివరాలు వ్యాఖ్యలుగా రాయండి. అవన్నీ ఇదే పోస్టులో జత పరుస్తాను. కొత్తవారికి సహాయపడతాయి.

7 వ్యాఖ్యలు:

 1. http://telugu.blogkut.com/

  http://haaram.com/


  http://teluguwebmedia.net/planet/

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బిజెయ్!!
  నాకోసారి మెయిల్ చెయ్యగలరు!!
  admin.websphere@gmail.com
  ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అఙాత గారికి చాలా చాలా ధన్యవాదాలు. మంచి బ్లాగు సముదాయ లోగిళ్లను పరిచయంచేశారు. :)

  రామరాజుగారు మెయిల్ చేశాను చూడండి. మీ సలహాలేమైనా ఉంటే తప్పక తెలియజేయండి. :)

  ఇంకా కొత్త అంతర్జాల పేజీలు ఏమైనా ఉంటే మితృలు తెలిజేయ గలరు. అవ్న్నీ ఈ పోష్టుకు జత పరుస్తాను. నాకులాంటి కొత్తవరికి చాలా సహాయంగా ఉంటుంది. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. vijay garu meeke o prasna meela mee blog venakala sceneries nu ela pettukovaali?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పప్పీ గారు మీకు బ్లాగుల గురించిన ఏవైనా సందేహాలు ఉన్నట్లైతే తెలుగు బ్లాగు అనే గూగుల్ గ్రూప్ లో చర్చించ వచ్చు.

  http://groups.google.com/group/telugublog?pli=1

  ప్రత్యుత్తరంతొలగించు
 6. http://www.rrfoundationindia.org/samoohamu.aspx

  ఇక్కడ కూడా మన బ్లాగులను జత పరచ వచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.