31, అక్టోబర్ 2009, శనివారం

నేటి సినిమాలు - నా దృష్టిలో

నాకున్న చిన్ని చిన్ని అలవాట్లలో సినిమా ఒకటి. కాకపోతే ఇది కాస్త పెద్ద అలవాటు. అలా అని వ్యసనం కాదండోయ్! :)

కానీ సినిమా అంటే చిరాకేస్తోంది ఈమధ్య.అస్సలు నచ్చడం లేదు. సైకో సినిమాలు ఎక్కువయ్యాయి. మామూలువి కూడా... ఏ సినిమా చూసినా హీరో ఓ రొడ్డు ప్రక్క కుర్రాడు. వాడొ జులాయి. వాడికె లక్ష్యాలూ ఉండవు. ఎవ్వరినీ లెక్క చెయ్యడు. అమ్మాయిలు వాడంటే పడి చస్తారు.

" ఇవేమీ సినిమాలయ్యా! " అని ఎవరైనా ఏదైనా అంటే " నేటివిటీ " అంటారు దర్శక, నిర్మాతలు. సమాజాన్ని ప్రతిబింబించాలని నడుం కట్టుకున్న పెద్ద మనుషులకి మంచి కనపనడదేమో....!? " నీ దృష్టి ఎలా ఉంటుందో ప్రపంచం నీకలా కనపడుతుంది " మనుషులు కనిపించడం లేదేమో నేటి మన దర్శకులకి...!?

అందరినీ అనట్లేదు.. కానీ చాలా మంది తీరు అలానే ఉంది. ఇది దర్శకుల తప్పు అని పూర్తిగా చెప్పలేము. చేతకాని తనం అని చెప్పొచ్చు. నిర్మాతలకు సమాజ హితం అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటె వారికంత ఙ్ఞానం ఉండదు. కానీ ఒక రచయతకీ, దర్శకుడికీ సమాజంగురించి చక్కని అవగాహన ఉంటుంది. మనసనేది ఒకింత చనిపోకుండానే ఉంటుంది. కానీ నిర్మాతలను తమ మంచి కథలతో ఒప్పించలేక, సమాజాన్ని చెడగొట్టే చవకబారు కథలతో నిర్మాతల్నీ, ప్రేక్షకులనీ ఆకట్టుకుని దర్శకులై పోతున్నారు. పూర్తిగా మనసు చంపుకుని డబ్బే లోకంగా బ్రతుకుతున్న నిర్మాతలను కూడా మంచి కథను చెప్పి ఒప్పించ గలిగే తెలివి ఉండాలి దర్శకులకి. ఒక మంచి కథను నిర్మాతకు చెప్పగానే ఒప్పుకుంటే సినిమా ఇంత చవకబారుగా ఎందుకు తయారవుతుంది..? మంచి కథలే రాయాలి, ఆ కథను తెరకెక్కించే చాకచక్యాన్ని అలవరుచుకోవాలి. ఓ మంచిపని చెయలంటే ఆటంకాలు అనేకం వస్తుంటాయి. వాటిని ఎదుర్కో గలిగే దమ్ము దర్శకులకు ఉంటే సమాజానికి హితం చేకూరుతుంది.

" కావ్యం కాంతా సమ్మితం " అని పెద్దలన్నారు. భార్య చెప్తే ఏ పనైనా ఎంత అందంగా కనిపిస్తుందో, సినిమాలో చూపించేవి కూడా అంత అందంగా కనిపిస్తాయి. ప్రేక్షకుడు ఆ కథలోని పాత్రలతో ఏకత్వం పొందుతాడు. ఆ కథ లోని పాత్రల లక్షణాలను తనలో ఉన్న లక్షణాలతో పోల్చి చూసుకుంటాడు. పోలిన కొన్నింటికి, ఆ పాత్రలకు ఉన్న మరికొన్ని లక్షణాలను ఆపాదించుకుని తానే ఆ పాత్రగా తన్మయత్వం చెందుతాడు. రసానందాన్ని పొందుతాడు. అందువల్లే సినిమా / కథ అంత బాగా నచ్చుతుంది మనకు.

ఇక్కడే ఉంది చిక్కంతా. పోలిక చేసుకుని ఆపాదించుకునే లక్షణాలు మంచి వైతే ఫర్వాలేదు. కానీ చెడు వైతే కష్టం ఇంతింత కాదు. ఇప్పటి సినిమాలలో ప్రేక్షకుల పోలికకు చెడే ఎక్కువ అందుతోంది. మొన్న ఆమధ్య ఒక అబ్బాయిని చూశాను. వాడు విచిత్రంగా పరిగెడుతున్నాడు. అదేమిటిరా అలా పరిగెడుతున్నావేమిటిరా? అని అడిగితే, తెగ సిగ్గు పడి పోతూ " సైనికుడులో హీరో మహేష్ బాబు బ్రిడ్జ్ కూలిపోతుంటే అలాగే పరిగెడాతాడు. అది నాకు బాగా నచ్చింది. అందుకే అప్పటి నూడీ నేను అలా పరిగెట్టడం మొదలుపెట్టాను " అని చెప్పాడు. కనుక ఇంతగా తన్మయ పరిచే సినిమాను రూపొందించడంలో రచయతా, దర్శకుడూ ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంది.

మరిన్ని సంగతులు మరో టపాలో..

9 వ్యాఖ్యలు:

 1. చావకబారు అనే పదం కొంచెం ఎక్కువ గా వాడారేమో? సినిమాల్లో మంచీవి వున్నాయి.. మీరన్నట్టు చెడ్డవీ వున్నై..అయితే ప్రేక్షకునిగా మీకు సినిమాలు వినోదం కోసం కావాలి (మీకిప్పుడిదే తక్కువయి ఉండొచ్చు అందుకే పోస్ట్ రాసారు). కాని కోట్లు పోసే నిర్మాతలకు అది వ్యాపారమే గా ? అలాగే వినోదం మనిషి మనిషి కీ మారుతుంది.. మీకు ఆనంద్ లాంటి కాఫీ సినిమాలు ఇష్టం కావచ్చు .. మరొకరికి.. కత్తి పట్టుకుని కస కస నరికితే ఇష్టం..మరికొంతమందికి హీరోఇన్ల మీద ఆసక్తి... హ హహ .. ఇంక పోతే (నేను కాదు లెండి).. కొత్త దర్శకులు మరీ మంచి చిత్రాల కోసం ప్రయత్నించినప్పుడు అది వారి భవిష్యత్తుపై వారే ప్రయోగం చేసుకున్నటవుతుంది.. కనుక దర్శకులకు ... అందునా కొత్తవారికి ఇలాంటి అవకాశాలు తక్కువే అని చెప్పాలి.. అలాగే సినిమాలు చూసి నచ్చితే కాసేపు గుర్తుచేసుని.. లేకుంటే తిట్టుకుని (నలుగురినీ చూడద్దని చెప్పి) సంతృప్తి పడేవారే ఎక్కువ...కాని సినిమాల్లో పాత్రల్లా బయట ప్రవర్తిన్చేవారిని ఇంతవరకూ నేను చూడలేదు.. ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివ గారూ: మంచివి లెవని కాదు, తక్కువయ్యాయి అని నా ఉద్దేశం. అలాగే వినొదం కోసం అందరూ చూస్తారు. కావ్య ప్రయోజనం ఆనందమే. దానితో పాటు సమాజ హితం చేకూరితే అది ఎక్కువ కాలం నిలబడుతుంది.

  ఇప్పటి సినిమాల్లో వినోదం కాస్త శృతి మించుతున్నట్టుగా అనిపించలెదా మీకెప్పుడూ... అందరిలో ఆనందించ గలిగే వినొదం కావాలి. ఒక అమ్మాయినో, కులాన్నో, సంఘాన్నొ తక్కువ చెసి మట్లాడే వినొదం ఎక్కువ అవుతోంది. అలాంటిది మంచిది కాదు.

  దర్శకులలో కూడా ధైర్యమున్న, మంచిని ప్రేరేపించే సినిమాలు తీయాలన్న ఉద్దేశమున్న వారు ఎక్కువగా రావాలి.

  పూర్తిగా సినిమా పాత్రల్లాగా ప్రవర్తించే వారు కనపడరు. ఆ పాత్రల ప్రభవంతో పాడై పోతున్న సమాజాన్ని నేను చూస్తున్నాను.

  ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కానీ నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఫలానా కాంబినేషన్స్ తో సినిమా తీస్తున్నారు ఇది ఆడుతుందా అని రోడ్డు మీద పోయేవాణ్ణి అడిగినా దాదాపు 70% కరెక్ట్ చెబుతాడు. మరి నిర్మాతలు ఎలా కన్విన్స్ అయి దిక్కుమాలిన కథలతో సినిమాలు తీస్తారో అర్థం కాదు. సగానికి పైగా చెత్త సినిమాలు వస్తుంటాయి. డబ్బువున్నవాడి దురద వాడి ఇష్టం కానీ, అసలు ఏ ప్రాతిపదికన చెత్త సినిమాలు తీస్తారు ? నల్లడబ్బు తెలుపు చేయడానికా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? శర్మ గారూ మీరు చెప్పినట్లు సినిమాలు అలాగే ఉంటున్నాయి. శివ గారు చెప్పినట్లు చూసే వాళ్ళు చూస్తున్నారు. సినిమా వాళ్ళేమో చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అని, ప్రేక్షకులేమో తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అని... దీనికి అంతం లేదు. సినిమా కళ కాదు వ్యాపారం అనుకుంటే ఇక అక్కడ విచక్షణ ఉండదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జనాలమీదకు ఏది వదిలినా అది బాధ్యతాయుతంగా ఉండాలి. కవిత్వం, కథ, మరి ఏ కళా రూపం ఐనా సరే. బండబూతులు రాసి వాడి దగ్గరే పెట్టుకుంటే దానికి అభ్యంతరం లేదు. రాం గోపాల్ వరమ నా కోసం సినిమాలు తీసుకుంటాను అని చాలాసార్లు చెప్పారు. నేను ఆయన టెక్నికాలిటీకి వీరాబిమానిని. అయితే అరాచకంగా తీసి అది జనాలపై వదలడం మాత్రం సబబు కాదు. సినిమాలు తీసేవాళ్ళు వ్యాపారం కోసమే అయినా అంతో ఇంతో సామాజిక బాధ్యత అవసరం లేదా? వాళ్ళు సందేశాలు ఇవ్వనవసరం లేదు. పదోతరగతి చదివేవాడికి కడుపులు చేసే ప్రేమ అత్యంత అవసరం అని నిజజీవితంలో పిల్లలపై ప్రభావితం చేయకపోతే అదే ఆ మహానుభావులు చేసే దేశ, సమాజ ఇంకా ఇంకా చాలా రకాల సేవ.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శ్రుతి మించుతున్నై .. అలానే అందరి ఆమోదం పొందే సినిమాల సంఖ్య అతి తక్కువ కూడా..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @ జీవని సంతోష్ గరు: నిజమండీ..

  రాం గోపాల్ వర్మ గారి విషయంలో నాకూ అదే భావన. ఆయనకు అద్భుతమైన ప్రతిభ వుంది. కానీ అది చెడు ( వయొలెన్స్, దారితప్పిన వ్యక్తిత్వం ) చూపడానికే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఆయనది ఓ చెదరిన హౄదయం అని నా భావన.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @రచయతకీ, దర్శకుడికీ సమాజంగురించి చక్కని అవగాహన ఉంటుంది.

  వాళ్ళకి మాత్రం ఫ్యామిలీ ముఖ్యం కదా. నిర్మాత కన్నా డైరెక్టర్ దే పెద్ద బిజినెస్ ఇప్పుడు :)

  హీరో, హీరోయిన్ కి ఉన్న స్టార్ వేల్యూ డైరెక్టర్ కి కూడా వచ్చేసింది. జనం సినిమా చూద్దాం మానేసాక మీరు ఆశించే క్వాలిటీ మూవీస్ వస్తాయి. కాని కాని మనం అలా మానేయ్యకుండా ఉండటానికి వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం. చూస్తూ చూస్తూ మల్లి బలమే చేస్తున్నాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఫొటోగ్రఫీలోను, సంగీతం లోను, ఎడిటింగ్ లోను, శబ్దచిత్రాల విషయంలోను బాగా టెక్నికల్గా మన సినిమా అభివృద్ధి చెందితే, కధా కమామిషుల్లో , దుస్తుల్లో వెనకబడింది అనేది వాస్తవం ! "అతి" విషయంలో బాగా ముందున్నాం!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. చాలా బాగా చెపేరు శర్మ గారు
  నాకు నెతి సినిమాల్లొ నచ్చని విష్యమంటూ ఉంటె అది కథనాయికల బట్టల విష్యం అవి కర్చీపులొ రిబ్బన్లో అర్థం కావ్త్లెదు.......
  సినిమా అంతా ఆ అమ్మయికి బట్టలే ఉండవ్....పాపం కథ నాయికలంతా పేదవాల్లెమొ దుస్థులకు డబ్బులుండవెమో......

  ఈ దరిద్రం పొథే కాని ఈ ఎతెలుగు సినిమాలు బాగుపదవ్ సర్మ గారు..

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.