18, ఆగస్టు 2010, బుధవారం

దయచేసి నా సందేహాలు తీర్చండి.

కొత్త పోష్ట్ ఎడిటర్ ని ఎంచుకుంటే , పాత దానిలో ఉన్నన్ని ఆప్షన్స్ కొత్త దానిలో లేవు ఎందువల్ల? పోటో ను జతపరచడం ఎలాగా? అలాగే మనం ముందు రాసిన పోష్ట్ ని సవరించాలని చూస్తే ఏమి కనిపించడం లేదు. ఎందుకని?

మీరెవరైనా చెప్పగలరు. త్వరలో పాత పోష్ట్ ఎడిటర్ మాయమవుతుమ్దట. నాకు పాతదే నచ్చింది. ఈ సమస్యలు లేకపోతె కొత్తదైనా ఫర్వాలేదు. దయచేసి నా సందేహాలు తీర్చండి.

6 వ్యాఖ్యలు:

 1. ఈ సమస్య నాకూ వచ్చింది. ఫొటోలు కాదు గానీ అసలు పోస్ట్ ప్రచురించబడలేదు. శీర్షిక మాత్రమే కనిపించేది. నేనూ ఇలాగే గోల పెట్టేశాను. మిత్రులంతా వచ్చి మంచి సలహాలూ ఇచ్చారు. ఏదీ పని చెయ్యలేదు.
  చివరాఖరికి నాకు బల్బ్ వెలిగి సెట్టింగ్స్ లో చూస్తే నేను కొత్త ఎడిటర్ కి మారిన విషయం కనపడింది. మళ్ళీ పాత ఎడిటర్ లోకి మారగానే సమస్య పరిష్కారమయ్యింది. ఇప్పుడూ నేను పాత ఎడిటర్నే వాడుతున్నా.

  మీరేమో పాత ఎడిటర్ ఇక మాయమవుతుంది అంటున్నారు. ఇంకేది దారి?
  ఒకసారి ఆ సలహాలన్నీ చూడాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

  http://seemavanta.blogspot.com/2010/02/blog-post.html

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇప్పటికి మీరు పాత ఎడిటర్ వాడండి.మారినప్పుడు చూడొచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కొత్త ఎడిటర్ వాడుతున్నారో పాతది వాడుతున్నారో చూసుకోండి.
  తర్వాత - పోస్టు రాసే విండో లో కంపోజ్ అని హెచ్ టిఎమ్ ఎల్ అని ఉంటాయి కదా దాన్లో కంపోజ్ నొక్కితే ఫోటో, వీడియో , వగైరా ఆప్షన్స్ కనిపిస్తాయి. ట్రై చెయ్యండి.
  ఇంకోటి,
  పోస్టు చేసేసిన వాటిని సవరించాలంటే అదే ఎడిట్ చెయ్యాలంటే,
  అకౌంట్ లో సైన్ ఇన్ అవడం
  బ్లాకు లే అవుట్ విండోలో ఎడిట్ పోస్టు ని సెలెక్ట్ చేసుకోవడం,
  తర్వాత వచ్చే విండోలో మనం రాసిన పోస్టుల టైటిల్స్ నుండి సవరించదలచిన పోస్టు ఉన్న బాక్స్ ని టిక్ చెయ్యడం, పక్కన రాసిఉన్న Edit దగ్గర చెయ్యి గుర్తు వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆ పోస్టు విండో ప్రత్యక్షమవుతుంది. చెయ్యవలసిన మార్పులు చేసేసి, పబ్లిష్ అంటే మార్పులు చేసిన పోస్టు రెడీ అయి view blog అనే డైలాగ్ వస్తుంది. మార్పులు ఇప్పుడు కనిపిస్తాయి.
  ఈ సమాచారం మీకు ఉపయోగపడితే నన్ను నేనే...బాగా మెచ్చుకుంటా...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పై వ్యాఖ్యలో బ్లాక్ అని పడింది,,బ్లాగు గా అర్థం చేసుకోగలరు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మందాకిని గారికి :
  "మీరేమో పాత ఎడిటర్ ఇక మాయమవుతుంది అంటున్నారు. ఇంకేది దారి?"

  నా బాధకూడా అదే.. నేనూ పాత ఎడిటర్ నే వాడుతున్నాను. కానీ మాళ్లీ సెట్టింగ్స్ కి వెళ్లి కొత్తదాన్ని వాడదామని ప్రయత్నిస్తే ఇలా ఇబ్బందుల పాలయ్యాను. గత్యంతరం లేక మళ్లీ పాత దానికే వచ్చాను. కానీ ఇది త్వరలో మారిపోతుందని సెట్టింగ్స్ లో రాసి ఉంది.

  జ్యోతి గారికి : అలాగే చేద్దామనుకున్నాను. కానీ కొత్తగా కనిపెట్టినదేమిటంటే మన డాష్ బోర్డ్ లో మన భాషను ఆంగ్లానికి మార్చుకుంటే కొత్త ఎడిటర్ లోని కొత్త హంగులన్నీ కనిపిస్తున్నాయి. అవి పాత దానికంటే బాగున్నాయి.

  సుధ గారికి: మీరు చెప్పినవన్నీ పాత దానికి ఉపయోగపడతాయి. అసలు కొత్తది ఎందుకు పనిచెయ్యడం లేదు అని నా బాధ.

  ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నేను డాష్ బోర్డ్ లో పైన "Make blogger in draft my default dashboard" ని మార్క్ పెడితే ఎడిటర్ పాతదయినా కొత్తదాని లాగా ఉన్నది. దానిలో తెలుగు కూడా పెట్టాను. బాగానే పనిచేస్తోంది.

  దీని తరువాత మీకు ఏది ప్రాబ్లామో వ్రాయండి. నేను చెక్ చేసి చెబుతాను.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.