15, డిసెంబర్ 2010, బుధవారం

బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?


బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు "భూసురుడు" అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.

ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.

ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.

౧. స్నానము
౨.సంధ్యోపాసనము
౩.జపాదికము
౪.ఔపాసనము
౫. పంచాయతన దేవతార్చనము
౬.బ్రహ్మయఙ్ఞము
౭. వైశ్వదేవము
౮. పంచాయతనమునకు పునః పూజ
౯. అతిథిపూజ( భోజనము)
౧౦.భోజనము
౧౧.సత్సంగము
౧౨. సాయం సంధ్యావందనము
౧౩. సాయమౌపాసనము
౧౪. రాత్రి వైశ్వదేవము
౧౫. రాత్రి దేవతార్చనము

ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికము
లు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి.

అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా
దానంప్రతిగ్రహణం చైవ బ్రాహ్మణానామకల్పతె


మరింత వివరంగా త్వరలో రాసేప్రయత్నం చేస్తాను.

19 వ్యాఖ్యలు:

 1. మర్చి పోయిన మంచి విషయాలు రాసారు. ధన్య వాదములు.
  నేను బ్రహ్మచారిగా వున్నప్పుడు మూడు పూటలా చక్కగా సంధ్యావందనము చేసుకునే వాడిని,
  మళ్ళి ఆ రోజులు రావాలని నా కొరకు మీరు ప్రార్ధన చెయ్యమని కోరుతున్నాను. ఎందుకంటే నా అంతట నేను మొదలెట్ట లేక పోతున్నాను.
  కనీసం నాకు ప్రోత్సాహం వచ్చేలా కొన్ని విషయాలు చెప్పండి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరుడు మీకు తప్పక ఆశ్రద్ధని ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. మనసుకు ఒక రుచిని అలవాటు చేస్తే అది ఎన్నటికీ మరిచిపోదు. మామిడి పండును ఒకసారి తిన్న పిల్లవాడు మరోసారి దానిని చూసిన ప్రతీసారీ తినాలని కుతూహలపడినట్లు. కనుక భగవత్సన్నిధిలో కలిగే ఆనందాన్ని మనసుకు మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేయండి. అంటే ఒక నియమం పెట్టుకుని ఇన్నిరోజులు నేను ఖచ్చితంగ సరిఅయిన సమాయానికి చేసి తీరుతాను అనుకోండి. కనీసం సంవత్సరానికి ఒకసారయినా ఈ దీక్షపూని ఓ నలభైరోజులు చేస్తూ ఉటే. ఈ నలభై రోజుల అనుభవం మిగతా సంవత్సరం అంతా మీ మనసు భగవంతుని పట్టుకునేటట్లు దోహదపడుతుంది. :)

   తొలగించు
 2. Namaskaram Vijay garu,

  very nice article written by you.

  i am a brahmin, but never did the dutise of a brahmin. working as an engineer. I was fortunate to realise the importance and glory of our Sanathana Dhramam through the Divine pravachanams of Brahma Sri Chaganti Koteswara Rao garu.
  Now i started doing Sandhyavandanam. But I have lot of doubts in the procedure of doing the Sandhyavanadanam. I dont know how to show the Mudras before Gayatri japam. Can you please help in this regard.
  Thanks again for posting this blog on our Dharma.
  Jai Sri Ram.
  Mohan

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నమస్కారం కిషోర్ గారు. మీరు సంధ్యావందనం ప్రారంభించడం చాలా సంతోషదాయకం. మీరు నాకు మెయిల్ చెయ్యండి. మెయిలో తెలుపుతాను వివరాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వైశ్వదేవము గురించి.
  అన్నశుద్ధి కోసం గృహస్థుడైన ప్రతీ బ్రాహ్మణుడు నిత్యము వైశ్వదేవము చేయాలి. ఈ వైశ్వదేవము చేయుట వలన బ్రాహ్మణుడు పంచసూనములను ఐదు పాపములనుండి రక్షింపబడుతున్నాడు. అంటె అన్నము వండునపుడు ౧. కూరలు తరుగుట, ౨. నూఱుట, ౩. పొయ్యి యందు నిప్పురాజేయుట, ౪. నీటిని కడవలలో ఉంచుట, ౫. అలుకుట,చిమ్ముట అను క్రియలు చేయునపుడు ఎన్నియో క్రిమి కీటకముల నశించుచున్నవి. వాటివలన బ్రాహ్మణునికి పాపము కలుగుతున్నది. ఆయా పాపములను తొలగించుకొనని చో "జన్మ రాహిత్యమను" స్థితికి అతడు అర్హుడవడు. బ్రాహ్మణ జన్మమే చివరి జన్మమని వేదము పలుకుచున్నది. ( దానిని సక్రమముగా ఉపయోగించుకొనిన ఎడల ) అటువంటి ఉత్కృష్ట జన్మము పొంది నప్పటికీ పైన చెప్పినటువంటి పాపములను చెయక తప్పుటలేదు. వాటి పరిహారార్థము "దేవయఙ్ఞము, పితృ యఙ్ఞము, భూతయఙ్ఞము, మనుష్యయఙ్ఞము, బ్రహ్మయఙ్ఞము" అను పంచ యఙ్ఞములను ఈ వైశ్వదేవమునందు ఆచరించి బ్రాహ్మణుడు అన్నమునకు కలిగిన పాపమును తొలగించుకొనుటయే వైశ్వదేవమునందు చెప్పబడిన ప్రథాన క్రియ.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రాజశేఖరుని విజయశర్మ గారు, నమస్కారములు. నాకు ఉపనయనం అయ్యిన తర్వాత నుండి సంద్యావందనం చెయ్యడం లేదు. సంద్యావందనం నేర్చుకోవాలని ఉంది. భార్య గర్భం తో ఉన్నప్పుడు భర్త సంధ్య వందనం నేర్చు కోవచ్చా? నేర్చుకోకుడద? దయ చేసి వివరం ఇవ్వగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @Krishnamohan,

  You can learn sandhyavandanam any time. If the date is very close or just after delivery, wait until you cross the 11th day after delivery (Even this is not mandatory, but as you have to learn, it might be better to start after the cleansing rituals). You can learn Sandhyavandanam online. Just search the web for the text (in language of your choice), audio, with actions to be performed. Hope this helps

  Regards
  Seetharam

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శర్మ గారు మీ ద్వార జ్ఞానాన్ని పొందాలనేది నా తపన దయచేసి ఈ కార్యక్రమములు ఏ సమయం లో పాటించాలి ?  మరియు వాటిగురించి వివరించండి అలా చేయటం వలన జరిగే మర్పులుకుడా తెలుప ప్రార్ధన !

  నాకు * గుర్తుపెట్టిన వాటి గురించి తెలియవు మీరు నాకొరకు లోకకల్యాణం కొరకు తెలుపగలరు  ౧.స్నానము
  ౨.సంధ్యోపాసనము
  ౩.జపాదికము *

  ౪.ఔపాసనము *
  ౫. పంచాయతన దేవతార్చనము *
  ౬.బ్రహ్మయఙ్ఞము*
  ౭. వైశ్వదేవము*
  ౮. పంచాయతనమునకు పునః పూజ*
  ౯. అతిథిపూజ( భోజనము)*
  ౧౦.భోజనము
  ౧౧.సత్సంగము*
  ౧౨. సాయం సంధ్యావందనము*
  ౧౩. సాయమౌపాసనము*
  ౧౪. రాత్రి వైశ్వదేవము*
  ౧౫. రాత్రి దేవతార్చనము *

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వివరంగా తెలుపాలంటే ఒక్కొక్కదానికీ ఒక్కో టపా రాయాలి.ప్రస్తుతం క్లుప్తంగా చెప్తాను.
   జపాదికం ( జపం )
   బ్రహ్మయఙ్ఞము ( ఉపనయనమైన ప్రతీ వారూ దేవ ఋషి పితృ దేవతలకు నిత్యం తర్పణలు వదులుట )
   వైశ్వదేవం గురించి పైన తెలిపాను.

   పంచాయతనం అంటే ఇంట్లో ఉండే ఐదురకాల దేవతలు ( సాలగ్రామములు మొదలైనవి ). వాటికి పూజ చేయాలి. అతిథికి భోజనం పెట్టి మనం చేయాలి. మనవంటి ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారితో స్నేహము, చర్చ మొదలైనవే సత్సంగము.

   మిగతావి ఉదయం చేసినవే సాయంత్రం చేయాలి.

   ఏమీ అర్థం కాలేదా !? మీరు ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉంటే మీగతా మెట్లు అవే కనపడతాయి. :) అర్థమైతే పర్వాలేదు.

   తొలగించు
  2. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

   తొలగించు
  3. ఈ ఆత్మ కు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి

   తొలగించు
  4. మనస్సు,నిలిపి తానెవరో, తను ఇక్కడకు ఎందుకు వచ్చాడో , ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందోనన్న విషయన్ని తెలుసుకుంటాడు.మనస్సును లీనం చేయడంమనసులోకి ఏ ఇతర భావనలు రాకుండా అరికట్టాడం అర్ఘ్యం. అమృతవృత్తియే స్నానం. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం కర్మవాసనలకు దూరంగా ఉండటమే . మనసులో దోషాలేవీ లేకుండా మనస్సును అర్పించడమే పుష్పం. మనసులోనున్న చెడు ఆలోచనలను దూరంగా పోగొట్టు కోవడం వలన సాధ్యమవుతుంది. తనకు ఈ లోకంలో లభించినవన్నీగురువు లభించాయన్న ఉద్దేశ్యంతో నెవేద్యాన్ని మర్పిస్తుంటాం.నిశ్చలంగా మనసులో ఎటువంటి భావనలు లేకుండా ఉండటం ప్రదక్షిణం. ఆయనే నేనే అన్న భావాన్ని కలిగి ఉండటం నమస్కారం. అతీతమైన సూక్ష్మచైతన్య మౌనంగా ఉండటం అని చెప్పబడింది. బ్రహ్మపథంలో ఉన్న పరమాత్మను సేవించడమే ఈశ్వరసేవ అని చెప్పబడింది సూక్ష్మచైతన్యం ఓ సర్వాంతర్యామీ! నీవు నిరంతరం సర్వ ప్రాణూలలో నిండి ఉన్నావు. సమస్త ప్రాణులలో రాణంగా ఉన్నావు

   తొలగించు
  5. మానవునకు దేహ భావం ఉన్నంతవరకు అన్ని రకాల దుఃఖాలు తప్పవు. దేహ భావానికి కారణం మనస్సు. మనస్సును చంపితే వెంటనే దైవ భావం కలుగుతుంది. దుఃఖం నుంచి విముక్తులవుతారు. ఆనందంగా వుంటారు. దాని మార్గమే ” శ్వాస మీద ధ్యాస ” ధ్యానం. మానవుల మనసు బంధం అంటే దుఃఖానికి, మోక్షం అంటే ఆనందానికి మనసే కారణమని శ్రుతి వాక్యాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
   మనసు లేని నిద్రా స్థితి లో మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. మెలకువ లో మనస్సు వుంటుంది కాబట్టి మెలకువ రాగానే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అందుచేత మనస్సు వుంటే దుఃఖం. మనస్సు లేకపోతే ఆనందం. మరి దుఃఖం నుండి బయట పడాలంటే, వేమన చెప్పినట్లు మనస్సును మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా. అంటే మనస్సు యొక్క ప్రాముఖ్యాన్ని పూర్తిగా తొలగించాలి. ఆ మార్గమే ధ్యానం శాంతి, ఆనందం, జ్ఞానం అంతా అన్నీ తనలోనే వుంటే మానవులు, తనలో వెతకకుండా బయట వెతుకుతున్నారు. బరువు మోస్తున్న ఎద్దుల వలె ఈ జీవితాన్ని భారంగా తయారు చేసుకుంటున్న ఈ మానవుల ఆలోచనలు, ఎవరైనా చెప్పగలరా ? అని వేమన యోగీంద్రుల వారు చెపుతున్నారు.

   తొలగించు
  6. అయ్యా ఒక్కొక్కరిదీ ఒక్కో మార్గం. అన్నీ చేరేది ఒకే గమ్యాన్ని. ఒక మార్గం లో వెళ్లే వాడిని మరో మార్గానికి రమ్మని లాగనంతవరకూ అన్నీ మంచివే. అందరూ అన్నీ వదిలి స్వాసమీద ధ్యాసతో ఉడలేరు. ఎంతకాలం ఉంటారు. భోంచెయ్యాలి. కాఫీతాగాలి, ఆఫీసుకు వెల్ళాలి, కంప్యూటర్లో కబుర్లు చెప్పుకోవాలి, సంసారం గడపాలి ఇవ్వన్నిటిలో ఆధ్యాత్మిక చింతన ఆవగింజంత! మరి అటువంటివారికి యోగమార్గం ఎలా సరిపోతుంది? కర్మ మార్గమే సరైనది. ఈ కర్మని "ధర్మం" అనేదానిలో ఇముడ్చుకుని ఆచరించడం మొదలు పెడితే చివరికి వచ్చేది ధుఃఖాతీత స్థితికే! నిత్యానందం ఈ మార్గంలోనూ పొందవచ్చు. "యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి" అనే అన్ని స్థితులనూ నిత్య వైదిక క్రతువులను ఆచరిస్తూ సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవారు నిరంతరం సాధన చేస్తూనే ఉంటారు. కాకపోతే ప్రత్యేకం అవి అని కొందరికి తెలుసు కొందరికి తెలియదు.

   మీ ధ్యాన మార్గబోధనలు మీ బ్లాగులో చెయ్యండి. దానినీ ఇష్టపడేవారు ఉంటారు. ఆసక్తి ఉన్నవారికి మరింత ప్రోత్సాహం ఇవ్వండి. దయచేసి ఈ బ్లాగులో మాత్రం అన్నీ మానేసి ధ్యాన మార్గానికి రమ్మని పిలవకండి. కలగా పులగం అవుతుంది.

   తొలగించు
 8. రాజశేఖరుని విజయశర్మ గారు, నమస్కారములు మీ వ్యాఖ్యలు మెయిల్ ద్వారా తెలియజేయగలరు.
  భగవంతుడు అంటే ఎవరు, మనమిక్కడికి ఎందుకొచ్చాం, ఎలా కలిసాం, తరించాలి అన్న కోరికైతే అందరికి ఉంటుంది,కానీ ఎవరిని ఆశ్రయించాలో మనకి తెలియదు, ఎలా ఆశ్రయించాలో తెలియదు కోరిక ఉంటుంది కాని మనమెవరమో తెలియదు, మనమిక్కడినుంచి ఎట్లా బాగు పడాలో ఎట్లా బయటికి వెళ్ళాలో మనకి తెలియదు, కొంత మందికి బ్రతకడం ఇష్టం లేక, దానిలోంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు

  ప్రత్యుత్తరంతొలగించు
 9. అయ్యా! నమస్కారం . దయ చేసి శూద్రుల ధర్మాలు కూడా రాయగలరని ప్రార్దిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ధర్మోరక్షతి రక్షిత :చాల బాగుంది

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.