22, జనవరి 2011, శనివారం

కళ్లముందే జరుగుతున్నా గుర్తించలేని గుడ్ది వాళ్లమై పోతున్నాము

నేడు మనం చాలా విషయాల్ని కొట్టి పడేస్తున్నాము. కానీ మన పూర్వులు ఎంత శ్రమించి మనకు ఈ సాంప్రదాయాల్ని, శాస్త్రాల్ని ప్రసాదించారో తెలుసుకోలేకున్నాము.

జనవరి - 11 వ తేదీ మాకు తెలిసిన ఒకరింట్లో ఒక పెద్ద వయసు స్త్రీ చనిపోయారు. ఆరోజు మంగళవారం, ఉత్తరాభాద్రా నక్షత్రం. మంగళ వారం చనిపోవడం, అందునా ధనిష్ఠా పంచకములలో చనిపోవడం చాలా కీడు. మళ్లీ వాళ్లింట్లో మరో వ్యక్తి చనిపోతారని పెద్దలు చెప్తారు. కనుక దహన సంస్కారమప్పుడు కొన్ని శాంతి క్రియలు చేయాలి. మరి వారు అవి చేశారో లేదో తెలియదు.

మళ్లీ నిన్న అంటే  పెద్దావిడ చనిపోయిన పదకొండవరోజు శుక్రవారము మరొకరు వారికి చలా దగ్గరి బంధువులు చనిపోయారు.

ఇలాంటి వెన్నో చూస్తూ కూడా మనం నమ్మలేకుండా ఉన్నాము. మన శాస్త్రాల ,  సాంప్రదాయ విలువల్ని గుర్తించ లేకున్నాము.

ధనిష్ఠ పంచకములు : ధనిష్ఠ, శతభిషం, పూర్వా భాద్ర, ఉత్తరా భాద్ర, రేవతి ఈ ఐదింటి యందు ఎవరైనా చనిపోతే ఆ ఇంటిని ఆరునెలలు వాడరాదని శాస్త్ర వచనం.

6 వ్యాఖ్యలు:

 1. "వైశ్వ దేవము" అంటే? (మీ పూర్వపు టపా లోనిది)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శర్మ గారు
  దయచేసి నా ధర్మ సందేహం తీర్చమని ప్రార్ధన. నేనెక్కెడా వినలేదు ఆ మాట, తెలుసుకుందామని కుతూహులంగా వుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నమస్కారం వోలేటి గారు.

  నేను ఊరిలో లేక పోవడం వలన మీ ప్రశ్నకు వెంటనే సమాధానమివ్వలేక పోయాను. ఇక వైశ్వదేవము గురించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది. కానీ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.

  అన్నశుద్ధి కోసం గృహస్థుడైన ప్రతీ బ్రాహ్మణుడు నిత్యము వైశ్వదేవము చేయాలి. ఈ వైశ్వదేవము చేయుట వలన బ్రాహ్మణుడు పంచసూనములను ఐదు పాపములనుండి రక్షింపబడుతున్నాడు. అంటె అన్నము వండునపుడు ౧. కూరలు తరుగుట, ౨. నూఱుట, ౩. పొయ్యి యందు నిప్పురాజేయుట, ౪. నీటిని కడవలలో ఉంచుట, ౫. అలుకుట,చిమ్ముట అను క్రియలు చేయునపుడు ఎన్నియో క్రిమి కీటకముల నశించుచున్నవి. వాటివలన బ్రాహ్మణునికి పాపము కలుగుతున్నది. ఆయా పాపములను తొలగించుకొనని చో "జన్మ రాహిత్యమను" స్థితికి అతడు అర్హుడవడు. బ్రాహ్మణ జన్మమే చివరి జన్మమని వేదము పలుకుచున్నది. ( దానిని సక్రమముగా ఉపయోగించుకొనిన ఎడల ) అటువంటి ఉత్కృష్ట జన్మము పొంది నప్పటికీ పైన చెప్పినటువంటి పాపములను చెయక తప్పుటలేదు. వాటి పరిహారార్థము "దేవయఙ్ఞము, పితృ యఙ్ఞము, భూతయఙ్ఞము, మనుష్యయఙ్ఞము, బ్రహ్మయఙ్ఞము" అను పంచ యఙ్ఞములను ఈ వైశ్వదేవమునందు ఆచరించి బ్రాహ్మణుడు అన్నమునకు కలిగిన పాపమును తొలగించుకొనుటయే వైశ్వదేవమునందు చెప్పబడిన ప్రథాన క్రియ.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నమస్కారం !!
  మా మావగారు చనిపోయి ఆరు నెలలు అయ్యింది.పంతులుగారు మేము ఒక ఏడాది వరకు గుడికి వెళ్ళినా హారతి,చతకోపురం తీసుకోకూడదు అని అన్నారు.అది ఎంత వరకు నిజం.అసలు ఎందుకల చేయాలి.దయచేసి చెప్పగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అవునండీ అది నిజమే. పన్నెండు నెలలలో చేయవలసిన క్రతువును కలియుగంలో అవి పాటింపలేరని ఋషులు పన్నెండు రోజులకు కుదించారు. అయినప్పటికీ సంవత్సరం పాటు సూతకము ఉంటుంది. కనుక ఈ సమయంలో మీరు ఏమి చేసినా చనిపోయిన వారి పేరు మీద చేయాలి. అందువల్ల వారికి పుణ్యగతులు కలుగుతాయి. సంవత్సరం వరకూ వారు మన చుట్టూనే ఉంటారు. వారికోసం ఏమిచేస్తామా అని ఎదురు చూస్తుంటారు. కనుక మనకు పన్నెండు రోజులలో మైల తీరినా, సంవత్సరం వరకు సూతకమును పాఠించాలి. ఏమిచేసినా మన కోసం కాక వారికోసమే చేయాలి. ప్రత్యేకపూజలూ, వ్రతాలు చేయకూడదు. కేవలం దాన ధర్మాలు అదీ చనిపోయిన వారికోసం చేయాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీరు నా సందేహానికి జవాబు ఇచ్చినందుకు చాల కృతజ్ఞత.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.