25, ఏప్రిల్ 2011, సోమవారం

ఈ విద్యార్థులకు ఆర్థిక సహాయమందించండి

నమస్కారం.

మనలో చాలామంది చదువుకునే విద్యార్థులకు సహాయపడే వారుంటారు. అలాగే ఆసక్తి కలిగిన వారుంటే నా స్నేహితులైన శాస్త్ర విద్యార్థులకు సహాయమందించండి. వీరు "న్యాయశాస్త్రం" చదువుతున్నారు. అంటే లాయర్ లు చదివేది కాదు. భారతీయ సనాతన శాస్త్రం. వ్యాకరణం, జ్యోతీష్యము వలే న్యాయము కూడా ఒకటి.  వీరు విద్యకోసం మన రాష్ట్రం వదిలి, గురువుని వెతుక్కుంటూ వెళ్లి తమిళనాడులో నివశిస్తున్నారు.

  ప్రస్థుతం ఇటువంటి శాస్త్రాలను అభ్యసించేవారు చాలా అరుదు. వేదమును, శాస్త్రాలను బాగా తెలిసినవారుంటేనే మన భారతీయ హిందూ మతం నిలబడుతుంది. వేద పారాయణ చేస్తే చాలు వారికి పూర్వం రాజులు అనేకవిధాల సహాయపడేవారు. వారికి భూములు, గోవులు ఇచ్చి పోషించేవారు. నేడు అటువంటి పోషకులు లేక వేదమును చదివిన వారుకూడా బ్రతుకు తెరువు కోసం పురోహితులుగా మారిపోతున్నారు. పురోహితం కంటే వేదపారాయణ ఉత్తమమైనది. పురోహితులందరికీ వేదం పూర్తిగా రాదు. అందులో కొంత భాగం మాత్రమే వస్తుంది. దానిని "స్మార్తం" అంటారు. అంటే నిత్యం ఇళ్లలో జరిగే యఙ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి వీలైనంత వరకు మాత్రమే వస్తుంది. పురోహితులు వేదపండితులని ఆశ్రయించి, ఈ శాస్త్ర పండితులతో స్నేహం చేసి వారికి తెలియని విషయాలను తెలుసుకుని తమ యజమానులకు పంచుతూ ఉంటారు.

  శాస్త్ర పండితలు లేకపోతే ఆయా వేదమంత్రాలకు భాష్యాలను చెప్పేవారు ఉండరు. దాని ప్రాముఖ్యం ఏమిటో తేలుసుకొనలేము. వేదమార్గము ద్వారా నిత్య ఆనంద స్థితిని లేదా ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా పొందవచ్చో చెప్పేవారు ఉండరు. కనుక శాస్త్ర పండితుల అవసరం హిందూ సమాజానికి చాలా అవసరం. పూర్వం వేదమును, శాస్త్రాలను బ్రాహ్మణులందరూ నేర్చుకొనే వారు. కాల క్రమంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటున్నారు.  నేడు వేదపండితులకు, పురోహితులకు కూడా ఆదరణ కరువౌతున్నది. ఇక శాస్త్ర పండితుల అవసరమేమిటో కూడా నేడు ఎవరికీ తెలియదు. వారితొ ప్రత్యక్ష సంబంధాలు ప్రజలకు ఉండడం లేదు. ఆ పరిస్థుతులలో శాస్త్రాన్ని అభ్యసించడానికి ముందుకు రావడం నిజంగా చాలా ధైర్యముంటే గానీ చేయలేరు.  వారు పూర్తి విద్యనేర్చుకున్నాకూడా పోషకులు దొరకరు. అయినా వారు సాహసించి శాస్త్ర విద్య నేర్చుకొంటున్నారు.

కేవలం ఓ ఇంజనీరుకో, డాక్టరుకో ( విద్యనభ్యసించుటలో) సహాయ పడితే  వారు పెరిగిన తరువాత ఈ సమాజానికి మంచే చేస్తారన్న నమ్మకం లేదు. కానీ నేను చెప్పే ఈ శాస్త్ర విద్యార్థులవలన సమాజానికి చాలా మంచి జరుగుతుంది. మన శాస్త్రము మరొక తరం పాటు నిలిచి ఉంటుంది.

  కనుక వారికి రెండు సంవత్సరాలపాటు పోషకులు కావాలి. ప్రస్తుతం వారిద్దరకీ స్కాలర్ షిప్ వంటి ఆర్థిక సహాయం కావాలి. నేడు ఓ ఇంజనీరునో, డాక్టరు విద్యార్థినో ఎవరైనా ముందుకు వచ్చి చదివిస్తారు. కానీ ఇటువంటి శాస్త్ర విద్యార్థులను, వేద విద్యార్థులను పోషించాలంటే మన సనాతన విద్యపై అత్యంత నమ్మకముండాలి. ప్రేమ ఉండాలి. వీరిని చదివించడం కేవలం వరిఒక్కరికే సహాయ పడినట్లు కాదు. హిందూ సమాజానికే ఒక జ్యోతిని ప్రసాదించినట్లు. కనుక అటువంటి ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించ గలరు.  పూర్తి వివరాలు తెలియజేయగలను.cell no : 9000532563

ధన్యవాదములు

4 వ్యాఖ్యలు:

 1. If you don't mind can you give the amount details how much a person needs per his acedamic year..


  I can give little amount.. before that i just want to know the total amount per person..

  -- geeta

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నమస్కారం అమ్మా! మీ స్పందనకు ధన్యవాదములు. మీరు చేయగల సహాయం చిన్నదైనా ఫర్వాలేదండీ. ఇంకా వివరాలు కావాలంటే దయచేసి నాకు మెయిల్ చెయ్యగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహక పారితోషికమును అందజేయు దాతలు దొరికారు. వారి వివరాలు రెండురొజులలో తెలియజేస్తాను.

  నాకు మెయిల్ చేసి మేమున్నామని ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు.

  అందరికీ ఆ వేదమాత అనుగ్రహము లభించుగాక!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నమస్కారం

  సహాయమునకు ముందుకు వచ్చినవారి వివరములు :

  కొమ్మూరు వేంకట సుకుమార్ గారు - ( సత్సంగము గ్రూపు సభ్యులు - ఈ విషయంగా నాకు మెయిల్ ద్వారా పరిచయస్తులు- ఒకటిన్నర సంవత్సరం పాటు నెలకు Rs. 2,000 ఇస్తున్నారు )
  మోహన్ కిషోర్ & కళ్యాణి దంపతులు - ( తెలుగు బ్రాహ్మణ సమాజము గ్రూపు సభ్యులు - అంతర్జాలంద్వారా నాకు పరిచయస్తులు - రెండు సంవత్సరాల పాటు నెలకు Rs. 1,000 ఇస్తున్నారు )
  వారణాశి శివరామ శౌరి - లక్ష్మీసౌజన్య దంపతులు ( తెలుగు బ్రాహ్మణ సమాజము గ్రూపు సభ్యులు - వ్యక్తిగతంగా చాలా కాలం నుండి నా స్నేహితులు - రెండు సంవత్సరాల పాటు నెలకు Rs. 1,000 ఇస్తున్నారు )

  వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఆ విద్యార్థులు చదివే న్యాయశాస్త్రము మరొక తరం నిలిచి ఉండేందుకు వీరి ప్రోత్సాహం లభించడం చాలా సంతోషదాయకం.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.