17, జులై 2011, ఆదివారం

ముష్కరుల లక్ష్యాలు మారుతున్నాయి.

ముష్కరుల లక్ష్యాలు మారుతున్నాయి. ఆధునిక దేవాలయాలుగా... దేశ పురోభివృద్ధికి పట్టుగొమ్మలుగా భాసిల్లుతున్న భారీ డ్యాములకు పెను ముప్పు ముంచుకొస్తోంది. ఇన్నాళ్లుగా ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ వంటి కీలక నగరాల్లో భారీ విస్ఫోటాలతో భయాందోళనలు సృష్టిస్తున్న పాక్‌ ప్రేరిత ఉగ్రవాద ముఠాలు.. ఇప్పుడు మనదేశంలోని భారీ డ్యాములపై కన్నేసినట్టు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) పసిగట్టింది. ముఖ్యంగా స్వతంత్ర భారత తొలి మహా నిర్మాణంగా వెలుగొందుతున్న 'భాక్రా నంగల్‌' డ్యాంను పేల్చివేసేందుకు లష్కరేతోయిబా, జమాతుద్దౌలా ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నినట్టు వస్తున్న వార్తలు.. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఉగ్రవాదులు ఇప్పటికే భారత-పాకిస్థాన్‌ల మధ్య జల వివాదాలను రాజేస్తూ.. నీటి పంపకాల గురించి ఉద్రేకాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్నారు. పాకిస్థాన్లోకి ప్రవహిస్తున్న నదుల్లోని జలాలను భారత్‌ విచ్చలవిడిగా డ్యాములు కడుతూ అక్రమంగా వినియోగించేసుకుంటోందని ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదాలను బూచిగా చూపించి అమాయక యువతకు తీవ్రవాదాన్ని నూరిపోస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో చారిత్రాత్మకమైన, బహుళార్థసాధకమైన భాక్రా నంగల్‌ వంటి ప్రాజెక్టులను పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లతో రక్షించుకోవాల్సిన అవసరం మరింతగా పెరుగుతోంది.  - ఈనాడు    




   ఇటువంటి స్థితిలో మన బాధ్యత ఏమిటి?   మన దేశంలో మనల్ని మనం కాపాడుకోలేముఅనాలోచిత జీవనం ఇంకా ఎన్నాళ్లు. ఇన్ని జరుగుతున్నా ఇంకా పట్టనట్టు కళ్లుమూసుకు కూర్చుందామా? మన  ప్రభుత్వం వీటికి అడ్డుకట్టను వేయలేదా? ఎక్కడ విఫలత చెందుతున్నాయి మన భద్రతా చర్యలు? దొరికిన ఒకరిద్దరినీ అహింస పేరుతో వదిలేస్తారు. రాజు అహింస అంటూ దండన వేయక పోతే అది చేతకాని తనం అవుతుంది కానీ కీర్తిని కలిగించదు. మన ప్రాణాలకు రక్షణ లేని రాజ్యాంగ పాలనలో మనం ఎంతకాలం మనగలం?  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.