26, ఆగస్టు 2011, శుక్రవారం

నా గాయత్రీ జప దీక్ష పునః ప్రారంభం

నమస్కారం

ఆదివారం నుండి నా గాయత్రీ జపం ప్రారంభం. నలభైరోజులలో సాధ్యమైనంత ఎక్కువ జపం  చెయ్యాలని సంకల్పం. పోయిన సంవత్సరం సరిగ్గా ఇలాగే గణపతి నవరాత్రులలో ప్రారంభించి, ఆశ్వయుజ పూర్ణిమకు హోమంతో పూర్తి చేశాను. అప్పటి జపం నాలో చక్కటి మార్పును తీసుకువచ్చింది. ఇటు వృత్తిలోనూ మంచి స్థానాన్ని ప్రసాదించారు అమ్మవారు. చక్కటి అనుభూతులు సొంతం చేసుకున్నాను. అమ్మవారి అనుగ్రహంతో మరల ఈ సంవత్సరం కూడా చెయ్యడానికి సాహసిస్తున్నాను.

పెద్దలందరూ నా జపం చక్కగా కొనసాగి అమ్మదయ కలగాలని ఆశీర్వదించగలరు. జపం చేయాలంటే కేవలం శారీరక, మానసిక బలాలతో పాటు అమ్మదయ ఉండాలి. మనం ఊహించని అనేక శక్తులు  ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. అవన్నీ దాటుకుని నాజపం పూర్తిచేయాలంటే పెద్దల ఆశీర్వచనాలు, పిన్నల శుభకామనలు ఈ సమయంలో నాకు చాలా అవసరం.

ఒక్కసారి నాగురించి భగవంతుని ప్రార్థిస్తారు కదూ..! :)( జపం జరిగే రోజులలొ నెను మెయిల్స్ కి అందుబాటులో ఉండకపోవచ్చు. )

ధన్యవాదములు,
బుధజన విధేయుడు,
రాజశేఖరుని విజయ్ శర్మ.

13 వ్యాఖ్యలు:

 1. శారీరక, మానసిక బలాలతో పాటు అమ్మదయ మీకందాలని మనస్పూర్థిగా ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. విజయ్ శర్మ గారు


  మునుపటిలాగే మీ దీక్ష ఫలించి చక్కని ఆధ్యాత్మిక అనుభవాలు పొందగలరని ఆశిస్తున్నాను. బహుశా నేను ఈసారి ప్రారంభించవచ్చు. అమ్మ దయ.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అమ్మ అనుగ్రహం మీ పై సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీ ప్రయత్నం మీకు, మీ ద్వారా జగతికి సకల శుభాలనీ చేకూర్చాలని గాయత్రీ దేవిని ప్రార్థిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. విజయ్ శర్మ గారు - నమస్సులు. మహాలయ పక్షాలలో ఇలా దీక్షగా చేయవచ్చా?

  All the very best.
  W/R-Saikiran

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అమ్మ అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. గతేడాదిలానే ఈ సారి కూడా మీ జపం నిర్విఘ్నంగా కొనసాగాలని అమ్మని ప్రార్ధిస్థున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శుభం....అమ్మ దయ ఉంది కాబట్టే మీరు మళ్ళీ మొదలుపెట్టారు లెండి .....ఆవిడ పరీక్షకు నిలబడే ప్రయత్నం చెయ్యటమే మన చేతిలో ఉన్నది...అంతే! చేసెయ్యటమే!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శుభం. కానివ్వండి. తల్లి ఆశీస్సులతో అంతా నిరాటంకంగానే జరుగుతుంది. శుభమస్తు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. అమ్మదయ మీకందాలని మనస్పూర్థిగా ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ ఆశీస్సులను, శుభకామనలను తెలియజేసినందుకు ధన్యవాదములు. నా జపం బుధవారం నుండి ప్రారంభిస్తున్నాను.

  @ సాయి కిరణ్ గారు : మహాలయములు పితృదేవతల అర్చనలకే ప్రాధాన్యమివ్వాలి. నిత్య కర్మలలో ఒకటి కనుక గాయత్రీ జపదీక్షకు దోషంలేదు. దీక్షలు ఆశ్వయుజ,కార్తీకములలో స్వీకరించడం ఉత్తమం.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. వసతి సౌకర్యం ఆలస్యం అవడం వల్ల ఆదివారంనాడు ప్రారంభించ లేక పోయాను. నా జపం రేపటి నుండి ప్రారంభిస్త్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మన తెలివితేటలు సాధారణంగా తక్కువగానే ఉంటాయి
  కానీ మేధావుల్లాగా భావించుకోని అతి తెలివి చూపించి ఇబ్బందుల్లో పడతాం
  ముఖ్యంగా యవ్వనంలో హార్మోన్స్ ప్రభావం వలన మేధావిత్వం బాగా ప్రదర్శిస్తాం
  చిన్నవయస్సులోనే మనం తెలివి గలవాడిగా ప్రవర్తిస్తే ముందు ముందు
  ఫుల్లు మడతడుద్ది అందువల్ల సహజ ప్రవర్తన మంచిది.సోక్రటీసు చెప్పింది ఇదే.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. అతి తెలివిగా ప్రవర్తించినట్లు అనిపిస్తే తెలియజేయండి. తప్పకుండా సరిదిద్దుకుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.