27, సెప్టెంబర్ 2011, మంగళవారం

హైదరాబాదు ప్రాంతం వారికి వనభోజనాలకు అనువైన స్థలం సూచించండి

నమస్కారం

కార్తీక మాసం వస్తోంది కదా! మరి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.  కానీ మంచి స్థలం దొరకడమే కష్టంగా ఉంది.

 వనభోజనాలు అంటే ఒక రోజులో ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేలాగ ఉండాలి. కాస్త ఆహ్లాదకరమైన చెట్లతో నిండిన ప్రదేశమై ఉండాలి. అది శైవ/వైష్ణవ సంబంధమైన దేవాలయ ప్రాంతమై ఉండాలి. కనీసం ఒక్క ఉసిరి చెట్టైనా ఉండాలి.  ఓ వందమందికైనా సరిపడ స్థలం ఉండాలి. మంచి నీటి సదుపాయం ఉండాలి.

ఇటువంటి ప్రాంతం భాగ్యనగరానికి అందుబాటులో ఉంటే తెలుపగలరు. భాగ్యనగరం శివార్లలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మీరేమైనా వెళ్లి వచ్చిన ప్రదేశాలు ఉంటే తెలియజేయగలరు.

--
ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ

5 కామెంట్‌లు:

  1. మేం అనంతగిరికి వెళ్ళాం. హైదరాబదుకు 80 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. కారువుంటే పొద్దున వెళ్ళి సాయంత్రం కళ్ళా తిరిగి రావచ్చు. అక్కడ అనంత పద్మనాభస్వామి దేవాలయం వుంది. చక్కటి ప్రకృతి సౌందర్యం వుంటుంది. ఎత్తైన కొండలమీద వెయ్యిమందికైనా సరిపడేంత విశాలమైన స్థలం వుంది. మేం నీరు తీసుకువెళ్ళాం కాబట్టి నీటి సంగతి తెలియదు.

    రిప్లయితొలగించండి
  2. అనంతగిరి.. వికారాబాద్.. అనంతపద్మనాభస్వామి వారి ఆలయం..

    రిప్లయితొలగించండి
  3. సంఘీ గుడి, గండిపేట, కర్మన్‌ఘాట్ గుడిప్రాంతం, కీసరగుట్ట...

    (లేదంటే రోడ్లమీద, పట్టాల మీద వుద్యమవనభోజనాలు ఈమధ్య జరుగుతున్నాయి కదండి, పంతులుగారు! :P :) )

    రిప్లయితొలగించండి
  4. అందరికి ధన్యవాదములు

    అనంతగిరి నేనూ చూశాను. చాలా బాగుంటుంది.


    @శంకర్ గారు : :)

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.