20, అక్టోబర్ 2011, గురువారం

గాయత్రీ హృదయమ్



 
నారద ఉవాచ:

భగవన్ దేవ దేవేశ భూత భవ్య జగత్ప్రభో |
కవచంతు శ్రుతం దివ్యం గాయత్రీ మంత్ర విగ్రహమ్ ||

అధునా శ్రోతు మిచ్ఛామి గాయత్రీ హృదయం పరమ్ |
యద్ధారణాద్భవేత్పుణ్యం గాయత్రీ జపతో2ఖిలం ||

నారాయణ ఉవాచ:

దేవ్యాశ్చ హృదయం ప్రోక్తం నారదాథర్వణేస్ఫుటమ్ |
తదేవాహం ప్రవక్ష్యామి రహస్యాతి రహస్యకమ్ ||

విరాడ్రూపాం మహాదేవీం గాయత్రీ వేదమాతరమ్ |
ధ్యాత్వా తస్యాస్త్వథాంగేషు ధ్యాయే దేవతాశ్చదేవతాః ||

పిండ బ్రహ్మాండయో రైక్యా ద్భావయే త్స్వతనౌ తథా |
దేవీ రూపే నిజే దేహే తన్మయత్వాయ సాధకః ||

నా దేవో 2 భ్యర్చయే ద్దేవమితి వేద విదో విదుః |
తతో భేదాయ కాయేస్వే భావయే ద్దేవతా ఇమాః ||

అథ తత్సం ప్రవక్ష్యామి తన్మయత్వ మధో భవేత్|
గాయత్రీ హృదయస్యాస్యా ప్యహమేవ ఋషి స్మృతః ||

గాయత్రీ చ్ఛంద ఉద్దిష్టం దేవతా పరమేశ్వరీ |
పూర్వోక్తేన ప్రకారేణ కుర్యా దంగాని షట్క్రమాత్ ||

ఆసనే విజనే దేశే ధ్యాయే దేకాగ్ర మానసః |

అధార్థన్యాసః| ద్యౌర్మూర్ధ్ని దైవతమ్| దంతపంక్తావశ్వినౌ| ఉభే సంధ్యే చోష్ఠౌ| ముఖ మగ్నిః| జిహ్వా సరస్వతీ|గ్రీవాయాంతు బృహస్పతిః| స్తనయోర్వసవోష్టౌ| బాహ్వోర్మరుతః| హృదయే పర్జన్యః| ఆకాశ ముదరమ్| నాభా వంతరిక్షమ్| కట్యో రింద్రాగ్ని| జఘనే విఙ్ఞానఘనః ప్రజాపతిః| కైలాస మలయా ఊరూ|విశ్వేదేవా జాన్వోః| జంఘాయాం కౌశికః| గుహ్యమయనే| ఊరూ పితరః పాదౌ పృథివీ| వనస్పతయోంగులీషు| ఋషయో రోమాణి| నఖాని ముహూర్తాని| అస్థిషు గ్రహాః| అసృఙ్ఞ్మాంసం ఋతవః| సంవత్సరావై నిమిషమ్| అహోరాత్రావాదిత్యశ్చంద్రమాః| ప్రవరాం దివ్యాం గాయత్రీం శరణ మహం ప్రపద్యే||

ఓంతత్సవితుర్వరేణ్యాయనమః| ఓం తత్పూర్వజాయాయ నమః| తత్ప్రాతరాదిత్యాయ నమః| తత్ప్రాతరాదిత్య ప్రతిష్ఠాయై నమః ||  

ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి |
సాయమధీయానో దివస కృతం పాపం నాశయతి ||

సాయంప్రాతరధీయానో అపాపో భవతి | సర్వ తీర్థేషు స్నాతో భవతి | సర్వైర్దేవైర్ఙాతో భవతి | అవాచ్య వచనాత్పూతో భవతి | అభక్ష్య భక్షణాత్పూతో భవతి | అభోజ్య భోజనాత్పూతో భవతి | అచోష్య చోషణాత్పూతో భవతి | అసాధ్య సాధనాత్పూతో భవతి | దుష్ప్రతిగ్రహ శత సహస్రా త్పూతో భవతి |సర్వ ప్రతిగ్రహా త్పూతోభవతి | పంక్తి దూషణాత్పూతో భవతి | అనృత వచనాత్పూతో భవతి | అథా బ్రహ్మచారీ బ్రహ్మచారీ భవతి | అనేన హృదయే నాధీతేన క్రతుసహస్రేణేష్టం భవతి | షష్టి శత సహస్ర గాయత్య్రా జప్యాని ఫలాని భవంతి | అష్టౌ బ్రాహ్మణాన్సమ్యగ్రాహయేత్ తస్య సిద్ధిర్భవతి |

య ఇదం నిత్య మధీయానో బ్రాహ్మణః ప్రాతశ్శుచిస్సర్వపాపైః ప్రముచ్యత ఇతి బ్రహ్మలోకే మహీయతే | ఇత్యాహ భగవాన్నారాయణః |



ఇతి దేవీభాగవతాంర్గత గాయత్రీ హృదయమ్ |

6 కామెంట్‌లు:

  1. శర్మగారూ, కామ్యసిద్ధికి విష్ణుసహస్రనామం చదవాలనుకుంటే నీళ్ళను ముట్టుకుని పూర్వన్యాసంనుంచి, ఫలశ్రుతిదాకా చదవాలని శ్రీయుతులు చాగంటి కోటేశ్వరరావుగారు తమ ఉపన్యాసంలో చెప్పారు. నీళ్ళను ముట్టుకోవడం అంటే స్పష్టంగా అర్థం కాలేదు. కాస్త మీరు వివరించి చెప్పగలరా!

    బాబు

    రిప్లయితొలగించండి
  2. ఏ ప్రవచనంలో ఎన్నో భాగంలో చెప్పారో చెప్పగలరా? కాస్త ఎన్నో నిముషం అనే విషయం కూడా వీలును బట్టి తెలుపగలరు. అంటే వారి ప్రవచనాలు చాలా ఉన్నాయి కదా! ఎందులో ఏమి చెప్పారో తెలుసుకోవడం కాస్త కష్టం.

    నీళ్లను ముట్టుకోవడం అంటే సాధారణంగా పూజా విధానంలో సంకల్పం చేసినప్పుడూ ‘కరిష్యే’ అంటూ నీటిని స్పృశిస్తాము.

    కానీ వారు ఏ సందర్భంలో చెప్పారో తెలిస్తే గానీ పూర్తిగా చెప్పలేము.

    రిప్లయితొలగించండి
  3. వారి వెబ్ సైట్ srichaganti.netలో విష్ణుసహస్రనామంపై ఉపన్యాసం(ఆడియో) ఉంది. దానిలో విన్నాను.

    రిప్లయితొలగించండి
  4. Hello Rajashekar gaaru,
    Sorry to write in in english , but i need one clarification.
    i am planning to buy vishnu moorthi and lakshmi devi idols ?

    i saw 2 types - 1) Sayana vishnu moorthi + lakshmi on snake
    2) standing Vishnu moorthi + lakshmi (like seetha, rama)

    which one is good for Home pooja especially in Kartheeka masam or through out the whole year ? let me know ASAP, i will wait for your response. THX.

    Geetha,
    http://viriboni.blogspot.com/

    రిప్లయితొలగించండి
  5. గురువుగారికి నమస్కారం,

    ఒకే ఇంట్లో రెండు సింహాసనాలతో పూజ చెయ్యవచ్చా, తెలియపరుచగలరు,

    ఇట్లు,

    మీ భవదీయుడు,

    భాస్కర భట్ల వెంకటరమణ.

    రిప్లయితొలగించండి
  6. నమస్కారమండీ

    ఇల్లనేది మన రాజ్యం అనుకుంటే! దానికి రాజు సింహాసనాశీనుడైన దైవం. ఆ దైవం ఎవరన్నది మన పూర్వుల నుండీ వచ్చిన సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. "ఇలవేల్పు" అంటాము. పూజా స్థలంలో మిగతా దేవతలు ఎందరున్నా సింహసనంలో ఉండే ఇలవేల్పు ఒక్కరే ఉండాలి. అలాగే సిహాసనము కూడా ఒకటే ఉండడం సమంజసం.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.