31, డిసెంబర్ 2011, శనివారం

దేవాలయ నిర్మాణానికి సహాయం అందించండి

      ఈశ్వరుని అనుగ్రహం వలన దేవాలయ నిర్మాణం కొరకు  చిలుకూరుకు వెళ్లే దారిలో స్వామినారాయణ గురుకుల్ దగ్గరలో కొంత స్థలాన్ని నాకు అప్పగించడానికి ముందుకు వచ్చారు. నాకు సాధ్యమైనంత ఎక్కువ ఉపాసన చేస్తు జీవనం సాగించడం ఇష్టం. అటువంటి ఉపాసనకు పురోహితం కంటే అర్చకత్వం బహు అనుకూలమైనది. కానీ యాజమాన్య లోపం వలన దేవాలయాలలో చేయడానికి ఇప్పటివరకు నెను వెనుకాడాను. అందుకు ఈశ్వరుడే ఓ మార్గాన్ని ఈవిధంగా చూపించారు.  

  అయితే నిర్మాణం చెయ్యడానికి కూడా నేను ఏవిధంగానూ సమర్థుడను కాను. కేవలం అర్చకత్వం ద్వారా నెను తరిస్తూ నలుగురినీ తరింపచేయాలన్నదే నా జీవన లక్ష్యం. దానికి తగిన అర్హతను, ఆర్ధిక వసతినీ ఆయనే ప్రసాదిస్తాడని నమ్ముతున్నాను.

 త్వరలో జరుగ బోయే "రామాలయ"  నిర్మాణానికి మీవంతు సహాయం అందించడానికి ముందుకు రండి. ఆసక్తి ఉన్నవారు నాకు మెయిల్ చెయ్యగలరు.

8 వ్యాఖ్యలు:

 1. అయ్యా
  మీరు రామాలయం కోసం విరాళాలను ఏ హోదాలో అడుగు తున్నారు
  మీ మాట (రాత)లను పట్టి మీరు లౌకిక బాధ్యతలు అక్కర్లేదు
  కేవలం అర్చనమాత్రమే చేసే వాళ్ళకు(జవాబు దారీతనం లేనివాళ్ళకు)డబ్బు ఎందుకు
  మీరు తరించటం ఉపాసన చేయటం వ్యక్తిగత విషయాలు
  దానికోసం అందరూ ఎందుకు సహాయం చేయాలి
  (ఈ ప్రశ్నల్ని మీ శ్రేయోభివృద్ధిని కాంక్షించి అడుగుతున్నా)
  ఇట్లు,,మీ విమర్శకులు,,

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నమస్కారం!

  చాలాచక్కని ప్రశ్నవేశారు. నాశ్రేయస్సు కోరి మీరు వేసిన ప్రశ్నలు సామాన్యమైనవి కావు. చాలా లోతైనవి.

  ౧. కేవలం ఉపాసన అంటే కుటుంబం గురించి పట్టించుకోకుండా తిరుగుతానన్నది నా భావం కాదు. రోజులొ ఎక్కువభాగం ఉపాసనకు ఇవ్వాలన్నది నా యోచన. అందుకు దేవాలయంలో ఎక్కువ అనుకూల వాతావరణం ఉన్నది.

  ౨. అర్చన మాత్రమే చేస్తే కడుపునిండదు కదండీ! అదిమీకూ తెలుసు. కానీ నాలో నిజాయితీకి పరీక్షఇది. :) నాకు కుటుంబ పోషణకు కావలసిన ధనము కావాలి. కానీ అది భగవత్సేవ చేయగా ఆయన ప్రసాదంగా వచ్చిన ధనం అయ్యి ఉండాలి.

  ౩. బ్రాహ్మణుని సాధన వ్యక్తిగతమైనది అయినా అది తప్పక లోక కళ్యాణానికి కారకమౌతుంది. పూర్వం రాజులు బ్రాహ్మణులను ఎందుకు పోషించారో అందుకు సహాయ పడవచ్చు. గోబ్రాహ్మణులు ఎల్లప్పుడూ శుభంగా ఉండాలని ఆస్తికులు ఎందుకు కోరుకుంటారో అందుకు నా సంకల్పానికి నీరుపోసే ప్రయత్నం చేయవచ్చు.

  మీరు అడిగిన ప్రశ్నలకు చాలా వివరం తెలుపాలని ఉంది. కానీ సమయా భావం వలన ఇప్పుడు పూర్తి వివరణ ఇవ్వలేను కానీ, నాతరువాతి టపాలో మరికొంత వివరణను తెలుపుతాను.

  మీరు నాయందు ఇదే ప్రేమను ఎల్లప్పటికీ ప్రసరింప చేయ ప్రార్థన. పిల్లవాడిని దారితప్పకుండా గురువులు అడుగడుగునా కాపాడు తారనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు ఈ ప్రశ్నలు అడిగి మరికొంత మందికి నా యందు కలిగే సందేహమును నివృత్తిని చేసుకునే అవకాశం నాకు కల్పించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అన్యథా భావించనందుకు ధన్యవాదాలు
  మీ సంస్కారానికి నమస్సులు
  మీ కృషికి ఆశీస్సులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. namaskaramu sarma garu..... bheeshma ashtami visishtata, tallidandrulunnavaru acharinchalsina tarpana vidhi,santaanam koraku cheyavalasina vidhulu vivaramuga teliyacheyagalaru.


  Regards
  Suvarchala

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నమస్కారం! తలిదండ్రులున్నవారు తర్పణం చేయనవసరంలేదని కొందరి అభిమతం. కానీ నివీతిగా ( దండలా ) యఙ్ఞోపవీతమును వేసుకుని ఎడమ చేతి బొటన వేలుకు మాత్రమే తగిలించి తర్పణలు చేయవచ్చును. మిగిలిన విశేషాలు వీలైనంత త్వరలో ఓటపాగా తెలుపగలను.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. namaskaaramu nenu jan 20 1988na janminchanu e madhyane nanu kaala sarpa doshamunnadi telisindi. nivarinchataniki upayam cheppagalaru

  ప్రత్యుత్తరంతొలగించు
 7. రాహువుకు, కేతువుకు సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. అవి జపంచేసుకోండి. కాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలలో కాలసర్ప దోష నివారణ పూజలు చేయించండి. ఇంకా సందేహాలు ఉంటే మెయిల్ చెయ్యగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.