13, జూన్ 2012, బుధవారం

తిరుమలలో అంగప్రదక్షిణకు ఏ సమయంలో అనుమతిస్తారు?

తిరుమలలో  అంగప్రదక్షిణ చేయవలసిన  విధానం:



ముందుగ తిరుమలలో  విచారణ కార్యాలయము  దగ్గరలో ఉన్న సేవ టికెట్ కార్యాలయములో  సాయంత్రం ఏడు గంటలకు టోకెన్ ఇస్తారు. ( రు. 200 లు చెల్లించి టోకెన్ తీసుకోవాలి) - భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకొని  సాయంత్రము 4 గం. నుంచి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఎదురుగా క్యూలో నిలబడి మీరే స్వయముగా వెళ్లి, ముందుగా మీ వేలి ముద్రలు ఇచ్చి, టిక్కెట్లు అక్కడనే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఎదురుగా , విజయ బ్యాంకు కౌంటరులో తీసుకోవలెను. టికెట్టు ఎవరికి వారే తీసుకోవాలి. ఇతరులను రానీయరు, అంగ ప్రదక్షణ చేసే వాళ్ళను మాత్రమే రాణిస్తారు.

     టోకెన్ తీసుకున్న వారు అదే రోజు రాత్రి ఒంటి గంట సమయములో కోనేరులో స్నానము చేసి తడి బట్టలతో (ఆడవారు అయితే చీర, సల్వార్ కమీజ్, మగ వారు చొక్కా లేకుండా) వైకుఠం క్యూ  సముదాయం ద్వారా   లొపలికి ప్రవేశించాలి. అంగప్రదక్షిణ  చెసే భక్తులకి సుప్రభాత సేవ  తరువాత  గర్భ అలయ ప్రాకారములో సుమారు 3 నుంచి 4 గంటల  మధ్యలో   గర్భాలయములో ప్రవేసించే ద్వారం దగ్గర నుండి హుండీ ఉన్న ప్రదేశము వరుకు  అంగప్రదక్షిణ చేయనిస్తారు.  ఆ తరువాత వారిని దర్శనానికి గర్భ అలయములొ ప్రవేసించే ద్వారం ద్వారా లోనికి పంపుతారు.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కడుపులో తిప్పటం లేక వాంతి అయ్యే ప్రమాదం ఉంటుంది కనుక ముందు రోజు ఎంత తక్కువ తింటే అంత తేలికగా ప్రదక్షిణలు చేయవచ్చు.

5 వ్యాఖ్యలు:

 1. తిరుమల లో అంగప్రదక్షిణ ఉచితము.విజయబ్యాంక్ నుండి ప్రవేశమునకు కావలసిన స్లిప్ ఇచ్చు కౌంటరును సెంట్రల్ రిజర్వేషన్ కౌంటరుకు ఎదురుగా కల ఉచిత రూములు ఇచ్చు విభాగమునకు ప్రక్కనకు మార్చి 3సంవత్సరాలు అయినది.అలాగే స్లిప్స్ ను సాయంత్రము 6గంల తరువాత ఇస్తారు. స్త్రీలు,పురుషలకు చేరి 300 టొకెన్స్ ఇస్తారు.ఈ మార్పు తప్ప మిగతా మొత్తము యధాతధమే.ప్రవేశేము కూడా మార్చారు.వైకుంఠము నందు అర్జిత సేవల నుంచి పంపుతున్నారు.నేను షుమారుగా 5సార్లు ఈ సేవ ఆచరించాను.తాజాగా ఈ సంవత్సరము మార్చి నెలలో కూడా ఆచరించాను.
  మీరు తెలిపినదానిలో తప్పు ఏంచాలనికాదు భక్తులకు సౌకర్యముగా వుంటదని తెలిపినాను అన్యధాభావించవలదు.నమస్కారములతో.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ధన్యవాదములు రమేష్ గారు. అంటే ఒక్కరికీ 300 టోకెన్ల వరకూ ఇస్తారా... లేక స్త్రీలకు 300 పురుషులకు 300 మొత్తం 600 లు మాత్రమే ఇస్తారనా మీ భావం.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శ్రీ రాజశేఖరుని విజయ శర్మ గారికి!
  నమస్తే!
  మంచి విషయాలు చెబుతున్నారు మీరు.
  నలుగురు తెలుసుకోవలసినవి... ఆచరించవలసినవిను ...
  తిరుమల ఆలయంలో అంగ ప్రదిక్షిణలు చేయాలంటే ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
  టికెట్స్ ఉచితం గా ఇస్తారు. స్త్రీలు 300 పురుషులు 300 ఇద్దరినీ వేరు వేరు compartments లో ప్రవేశం కల్పించి ముందు స్త్రీలు, తదనంతరం పురుషులు అంగ ప్రదక్షణల అనంతరం శ్రీవారి దర్శనం ఏర్పాటు వుంటుంది.
  కొద్దిగా కష్టపడితే ఉదయాన్నే శ్రీవారి సుప్రభాతం వింటూ ప్రదిక్షిణ లు చేయటం, ఆతరువాత దర్శనం, అంతా చక చకా జరిగిపోతాయి. అద్భుతంగ వుంటుంది. మేము కూడా శ్రీవారి సేవకి వెళ్ళినపుడు వారం లో రెండు మూడు రోజులు ప్రదిక్షిణలు చేస్తాము. ప్రవేశం మాత్రం బావ గారి సత్రం ప్రక్కనుంచి వైకుంటం వెళ్ళే దారిలో 'శ్రీవారి కళ్యాణం' ఎంట్రన్సులో ఉదయం 1.30 నుంచి 2.00 లోపు లోపలి వదులుతారు.
  దర్శనానికి క్యు లో నిలుచోటం లేదా సేవ టికెట్స్ కై ఎదుచుపులు వగైరాలు వుండవు. మన్నించండి అధికంగా రాసినందుకు
  మణి కె

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శర్మ గారు ,మీవంటి వైదికోత్తములకు పాదాబివందనములు . మీ బ్లాగ్ చాల ఉత్తమంగావుంది ,అంగ ప్రదక్షిణ తిరుమలలో శ్రీవారి ఆలయం లో చేయడం పూర్వజన్మ సుకృతం . నేను ఒక 50 పర్యాయములు చేశాను .నాతో ఎంతో మంది చేయాలనీ ట్రై చేసారు కానీ కొంతమంది చేయగలిగారు,కొంతమందిని అనారోగ్యకారనలవలన శ్రీనివాస సెవానుగ్రహం కలగలేదు. ఈ సేవ పూర్తిగా ఉచితం . ఒక 7 లేక 8 సంవత్సరములనుండి ముందురోజు రాత్రి tokens వేసే సిస్టం ప్రవేశ పెట్టారు .ప్రతి రోజు స్త్రీ మరియు పురుషులకు కలిపి ఒక 750 టికెట్స్ ఇస్తున్నారు . నా బార్యను ఒకసారి ఈ సేవకు తెసుకువేల్లాను , ఆ సేవ తర్వాత తనఆనందాన్ని మాటల్లో చెప్పలేను .మీవంటి పెద్దల దీవెనలతో దాదాపుగా అన్ని సేవలు చూసాను ,హరే శ్రీనివాస .

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.