11, సెప్టెంబర్ 2012, మంగళవారం

శివ ప్రదక్షిణ విధి


మిగిలిన దేవాలయాలలో వలే ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షీణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని కూడా అంటారు.

ఈ క్రింది విధంగా చేయాలి.
వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం|
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం||
శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్|
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం|| 

 నందీశ్వరుని వద్ద ప్రారంభించి - కుడిచేతి వైపు చండీశ్వరుని చేరి - అక్కడనుండి మళ్లీ వెనుకకు ( నందీశ్వరుని మీదుగా ) సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి నందీశ్వరుని-   నేరుగా చండీశ్వరుని వద్దకు వెళ్లి - అక్కడ వెనుదిరిగి  ( నందీశ్వరుని మీదుగా ) సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి ( నందీశ్వరుని మీదుగా ) చండీశ్వరుని చేరి - వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక "శివ ప్రదక్షిణ" పూర్తి చేసినట్లు.

శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. దాటితే నరకంలో పడి పతనమౌతనమవడం తథ్యం.

కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. 

9 వ్యాఖ్యలు:

 1. చాలా మంచి విషయాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రత్యుత్తరాలు
  1. somasootram ante sivunuku abhishekam chesina ravyalu( dravalu) bayataku velle sannapati gottapu kaaluva lantidi, adi data koodadu. adhukani ala pradikshana cheyali.

   తొలగించు
 3. బ్రహ్మ చారులకు ఈ సూత్రం వరించదు. గృహస్తు మాత్రమె ఈ విధం గా చేయవలెను. సన్యాసులు అపసవ్య ప్రదక్షిణం చెయవలెను.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సోమసూత్రం లో కొందరు ఎడమవైపు నుంచి మొదలుపెట్టాలి అని ,, కొందరు కుడిచేతి వైపు నుంచి మొదలుపెట్టాలి అని రకరకాల sites లో వుంది .

  ఏది సరిఅయినదొ దయచేసి వివరించ గలరు .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సోమసూత్రం లో కొందరు ఎడమవైపు నుంచి మొదలుపెట్టాలి అని ,, కొందరు కుడిచేతి వైపు నుంచి మొదలుపెట్టాలి అని రకరకాల sites లో వుంది .

  ఏది సరిఅయినదొ దయచేసి వివరించ గలరు .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సోమసూత్రం లో కొందరు ఎడమవైపు నుంచి మొదలుపెట్టాలి అని ,, కొందరు కుడిచేతి వైపు నుంచి మొదలుపెట్టాలి అని రకరకాల sites లో వుంది .

  ఏది సరిఅయినదొ దయచేసి వివరించ గలరు .

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శివుడు తూర్పు ముఖముగా ఉన్నాడా? పశ్చిమ ముఖముగా ఉన్నాడా అన్న దానిని బట్టి ఉంటుంది. తూర్పు ముఖముగా ఉంటే కుడివైపు చండీ శ్వరుడు ఉంటాడు. శివుడు పశ్చిమ ముఖంగా ఉంటే ఎడమ వైపు చండీశ్వరుడు ఉంటాడు. సోమసూత్రం దాటకుండా చండీశ్వరుని ఏవైపునుండి చేరుకోవచ్చో ఆవైపు వెళ్ళాలి.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.