10, డిసెంబర్ 2012, సోమవారం

మార్గశిర మాస విశిష్ఠ తిథులు - పండుగలు



మార్గశిరమాసం - శుక్లపక్షం : 
పాడ్యమి : గంగాసాన్నం 14/12/12
విదియ :                  
తదియ : ఉమామహేశ్వర వ్రతంఅనంత తృతీయ వ్రతం 15/12/12
చవితి :  వరద చతుర్థినక్త చతుర్థి వినాయకపూజ 16/12
పంచమి :  నాగపంచమి’ నాగపూజ ( స్మృతి కౌస్తుభం ) శ్రీ పంచమి వ్రతం’ ( చతుర్వర్గ చింతామణి) 17/12
షష్ఠి :  సుబ్బారాయుడి  షష్ఠి, స్కందషష్ఠి, చంపాషష్ఠిప్రవార షష్ఠి వ్రతాలు – సుబ్రహ్మణ్య పూజ, రైతుల పండుగ  18/12
సప్తమి : మిత్ర సప్తమి  "ఆదిత్య ఆరాధన( నీలమత పురాణం ) 19/12
అష్టమి : కాలాష్టమీ వ్రతం 20/12  
నవమి :         
దశమి :          
ఏకాదశి : ముక్కోటి ఏకాదశి, మోక్షదైకాదశి, సౌఖ్యదా ఏకాదశి, గీతాజయంతి – ఏకాదశీ ( ఉపవాస) వ్రతం కృష్ణ పూజ, భగవద్గీతా పారాయణ 23/12   

ద్వాదశి :  ద్వాదశీ పారణ, తీర్థదినం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం 24/12

త్రయోదశి :  హనుమద్ వ్రతం, అనంగ (మన్మధత్రయోదశీ వ్రతం     25/12
చతుర్దశి :  చాంద్రాయణ వ్రతం ఆరంభ తిథి - రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి 26/12
పూర్ణిమ :  కోరల పున్నమి, దత్త జయంతి - చంద్ర ఆరాధన, దత్త చరిత్ర పారాయణం, సాయి సత్చరిత్ర  పారాయణం.  28/12


మార్గశిర మాసం - కృష్ణపక్షం :
పాడ్యమి :  శిలావ్యాప్తి వ్రతం  29/12
విదియ :
తదియ :                  
చవితి :   సంకష్ట హర చతుర్థి 01/01/2013
పంచమి :        
షష్ఠి :            
సప్తమి :  ఫలసప్తమీ వ్రతం 04/01/13
అష్టమి : అనఘాష్టమీ వ్రతంకాలభైరవాష్టమి/ – కాలభైరవపూజ   05/01/13  
నవమి : రూపనవమి వ్రతం   06/01
దశమి :          
ఏకాదశి : సఫల ఏకాదశీ వ్రతం, వైతరణీ వ్రతంధనద వ్రతం 08/01
ద్వాదశి :  మల్లి ద్వాదశి వ్రతంకృష్ణ ద్వాదశీ వ్రతం 09/01
త్రయోదశి : యమత్రయోదశి వ్రతం, మాస శివరాత్రి 10/01
చతుర్దశి :        
అమావాస్య : వకుళామావాస్య, అమావాస్య వ్రతం - ఆవు పాలతో పరమాన్నం వండి దేవునికి నివేదన చేయడం సర్వ శుభస్కరం 11/01/2013
ధనుర్మాసం :    సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన ( 15/12/12, 08.140pm )  నాటి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ( 14/01/2013, 06.59am - మకర సంక్రాంతి ) వరకు ధనుర్మాసంగా పిలుస్తారు. సంక్రాంతి నెలపెట్టుట అని కూడా పేర్కొంటారు. సాధారణంగా ప్రతీనెలా 14,15 తేదీలలో సూర్యుడు ఒకరాశినుండి మరో రాశికి ప్రవేశిస్తుంటాడు. మాసంలో "తిరుప్పావై" రోజుకొక్క పాశురం చొప్పున ప్రతి వైష్ణవ ఆలయంలోను చేస్తారు.  గోదా దేవిని ( సాక్షాత్తు లక్ష్మీదేవి )  పూజిస్తారు.  తిరుప్పావై ప్రవచనాలు, ప్రత్యెక పూజలతో వైష్ణవ ఆలయాలు చాల సందడిగా ఉండే మాసం ఇది. ఈ ధనుర్మాసం నెలరోజులూ  కన్నె పిల్లలు తెల్లవారుజ్హామునే లేచి ఇళ్ళముందు కలాపిల్లి చక్కని రంగవల్లులతో,  గొబ్బెమ్మలతో అలంకరిస్తారు.   వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో కళ కళ లాడుతూ ఉంటాయి. 

తీర్థ దినం : ఈ భూలోకంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలు, మార్గశిర సుద్ధ ద్వాదశి నాడు "అరుణోదయ (సూర్యోదయ)" సమయంలో తిరుమల కొండపై గల స్వామీ పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయని పురాణ ప్రమాణం.  అందుకే,  స్వామి పుష్కరిణి "తీర్థ దినం" గా పూజిస్తారు

మోక్షదా ఏకాదశి : ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని చెబుతారు. అందుకే దీనిని మోక్ష ఏకాదశిగా పేర్కొంటారు. ఈరోజు  ఏకాదశీవ్రతం ఆచరిస్తారు. పూర్వం  వైఖానసుడు అని ఒకరాజు ఉండేవాడు. అతనికి ఒకనాడు తన తండ్రి నకరంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు అతను మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్షదా ఏకాదశిఅని పేరువచ్చింది.
తిథిలన్నింటిలోకీ మార్గశిర శుద్ధ  ఏకాదశికి మరో ప్రత్యేకతా ఉందికురుక్షేత్రంలో తాతలనూ, తండ్రులనూబంధుగణాల్నీ చూసి అస్తస్రన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీత బోధన చేసిందీ రోజేనని పురాణాలు చెబుతున్నాయిఅందుకే  రోజును "గీతాజయంతిగా వ్యవహరిస్తారుఆవేళ కృష్ణుణ్ని  భక్తీ శ్రద్ధ లతో పూజించిగీతా పారాయణ చేయడం నిర్దేసించబడింది.

మనం అందరం మాసంలో చేయవలసిన విధులను ఆచరించి తరించెదము గాక! 

బుధజన విధేయుడు,
రాజశేఖరుని విజయ్ శర్మ

4 కామెంట్‌లు:

  1. వివాహమయ్యాక మీ మొదటి పోస్ట్ అనుకుంటాను. చాలాచక్కని సమాచారమిచ్చారు. జైశ్రీరాం

    రిప్లయితొలగించండి
  2. చక్కటి విషయాలను వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  3. మీ బ్లాగు ద్వారా మంచి విషయాలు తెలుసుకోగలుతున్నాము. ఆదిత్య హృదయం గురించి మాకు తెలియని విషయాల గురించి చెప్పగలరు.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.