15, డిసెంబర్ 2012, శనివారం

నూతన వాహనాలు కొనుట లేదా వాడుట ప్రారంభించుటకు శుభ సమయాలు

దినదిన గండాలతో ప్రయాణించే ఈరోజులలో క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే, కొన్న వాహనం మీకు అన్నివిధాల కలిసి రావాలంటే తప్పని సరిగా మంచి ముహూర్తము చూసే  నూతనవాహనం తీసుకోవాలి.

అందుకు మంచి తిథి వార నక్షత్రాలు క్రింద న ఇవ్వ బడుతున్నాయి. 

తిధులు : విదియ తదియ పంచమి,సప్తమి, దశమి, శుక్ల ఏకాదశి, శుక్ల త్రయోదశి
వారములు : సోమ, బుధ, గురు, శుక్ర 
నక్షత్రాలు : రోహిణి, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, ఉ.షాఢ, శ్రవణం, రేవతి
లగ్నాలు :  వృషభ, మిధున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మీన  లగ్నాలు మంచివి.
బుధ హోర ప్రశస్థమైనది

పై నక్షత్రాలలో మీకు తారాబలం సరిపోయిన రోజున మిగిలినవి కలిసి ఉండేట్లట్లుగా చూసుకుని నూతన వాహనాన్ని తీసుకోవాలి.
పైన ఇచ్చి న లగ్నాలలో మీకు అష్టమ లగ్నం కాకుండా, అష్టమ శుద్ధి ఉన్న లగ్నాన్ని నిర్ణించుకోవాలి.

తారాబలం చూసుకోవడానికి ఇక్కడ చూడండి

2 కామెంట్‌లు:

  1. ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది.మా ఇంటిలో ఉన్న పంచాంగాలలోనే చాలా వ్యత్యాసం ఉంది. ఒక పంచాగంలో ఉన్నదానికి రెండోదానితో పొంతన కుదర్ట్లేదు. ఉదాహరణకు ఒక దాంట్లో సోమవారం శ్రవణా నక్షత్రం మధ్యాహ్నం వరకూ అని ఉంటే రెండవ దానిలో సోమవారమంతా ధనిష్ట అని ఉంది. అలాగే తిథులు సూర్యోదయాస్తమాలు. దేన్ని ప్రామాణికంగా చేసుకోవాలి

    రిప్లయితొలగించండి
  2. ధృక్సిద్ధాంత ( పిడపర్తి పూర్ణయ్య సిద్ధాంతి గారిదిగానీ లేక కాలచక్రం పంచాంగం కానీ ) పంచాగాలు చూడండి.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.