19, జనవరి 2013, శనివారం

పుంసవనము

శ్లో : తృతీయేవా చతుర్థేవా మాసిపుంసవనం భవేత్
వ్యక్తే గర్భే భవేత్కార్యం సీమన్తేన సహాథవా .

 భార్య గర్భం దాల్చిన మూడవ ( లేదా ) నాలుగవ  మాసములో ఈ పుంసవనమును జరుపవలెను. అప్పుడు కుదరని వారు కనీసం సీమంతమునకు ముందుగానైనా చేసుకొనవలెను.

ఇది ఒక తంత్రము వంటిది. నేడు చాలా కుటుంబాలలో ఈ తంతు జరగడం లేదు. ఈ కార్యక్రమము చివరిలో జరుగు తంతు నేడు నవీనులకు వింతగా తోచవచ్చు. కానీ ఇది తప్పక చేయవలసిన సంస్కారము. ( 1. గర్భాదానం, 2. పుంసవనం, 3. సీమంతం, 4. జాతకర్మ, 5. నామకరణం, 6. అన్నప్రాసన, 7. చౌలం, 8. ఉపనయనం, 9. ప్రాజాపత్యం, 10. సౌమ్యం, 11. ఆగ్నేయం, 12. వైశ్వదేవం, 13. గోదానం, 14. సమావర్తనం, 15. వివాహం, 16. అంత్యేష్టి.  అను 16 కూడా మానవుడు పుట్టినప్పటినుండి చనిపోయే వరకు చేయవలసిన ముఖ్యమైన సంస్కారములు )

 శుభ తిథి నాడు, పుష్యమి లేదా ఏవైన పుణ్యనక్షత్రమునాడు ఈ పుంసవనము చేసుకొనవలెను.

 సంకల్పం : శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమోపాత్తదురితక్షయ ద్వారా.... శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం - అస్యాం మమ భార్యాయాం జనిష్యమాణ గర్భస్య పుంరూపతా ప్రాప్తిద్వారా గర్భస్థ పిండశుద్ధ్యర్థం పుంసవనాఖ్యం కర్మకరిష్యమాణ స్తదంగత్వేన....

( నాయొక్క భార్యకు కలిగిన గర్భమునందు గల పిండమునకు పురుష రూపము ప్రాప్తించుటకొఱకు మరియు గర్భస్థ పిండ శుద్ధి కొఱకు పుంసవనమును జరుపుతున్నాను )

కార్యక్రమ వివరము:

గణపతి పూజ
పుణ్యాహవాచనము
రక్షాబంధన ధారణ
దేవతాహ్వానము
పుంసవన హోమము

హోమము అయిన తరువాత యజమానుడు ( భర్త ) ఫలసహిత వటాంకురమునుండి రసమును   భార్యయొక్క కుడి ముక్కు రంథ్రములో పడునట్లుగా  " పుగ్ం సువనమసి " అను మంత్రము చదువుతూ పిండవలెను. ( అది గర్భం లోపల పిండం వరకు పడుతుంది )

తరువాత నూతన వస్త్ర ధారణ, ఆశీర్వచనం, మంగళ హారతి
గర్భాదాన సీమంతోన్నయనములు స్త్రీ సంస్కారములగుటచే ప్రతి గర్భమందు అవసరం లేదు.  మొదటి గర్భధారణ సమయంలో తప్పని సరిగా జరుపవలెను. అట్లు చేయనిచో  ఆ లోప ప్రాయశ్చిత్తము కొఱకు తరువాత ప్రతి గర్భమందును చేయవలెను.  పుంసవనము మాత్రము ప్రతీసారీ జరుపవలెను.

5 వ్యాఖ్యలు:

 1. mee blog chaala baavundi swami. Daya chesi continue cheyyandi

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నమస్కారం స్వామి.నన్ను మనోజ్ కుమార్ అంటారు.మీ బ్లాగ్ సనాతన ధర్మం తెలుసుకోవలనికునే వారికీ చాల బాగుంది .అలాగే సీమంతోన్నయణం గూర్చి కూడా చెప్పగలరని ప్రార్ధిస్తున్నాను

   తొలగించు
 2. Punsavanam kevalam maga bidda korukune varu matrame chesukuntarani vinnanu. Aa kalamlo varasudu ane concept balamga undadam valla adi compulsory sanskaram chesarani abhiprayam. Ivala alanti bhavalu levemo ilanti karyakramalu kuda jaragadamledu ani na feeling. Konta mandi okaro / iddaro ada pillalu puttaka tarvata garbhaniki kevalam magabidda kalagalani punsavanam chesina sandarbhalu kuda chusanu. Ayite indulo nijaanijalu naku teliyavu.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గర్భస్థ పిండ శుద్ధి కొఱకు కూడా పుంసవనమును జరుపవలెను. కొంతమందికి గర్భం వచ్చినా అదినిలవడంలేదు కదా! అటువంటి వారు చేసుకొనడం అవసరం. కానీ ప్రథాన కారణం మగపిల్లవాడు కలగడం కోసమ్ అనే!

   తొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.