2, జులై 2013, మంగళవారం

వినాయకుని ఎదురుగా గుంజీలు ఎందుకు తీస్తారు?






విఘ్నేశ్వరునిది బాలుడి మనస్తత్వం. అటుకులు, బెల్లం, చెఱకు, గుంజీళ్ళు, కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు సంతోషపడిపోతుంటారు. వినాయకుని ఎదుట గుంజీళ్లు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీళ్లు తీయడం వలన స్వామికి సంతోషం కలుగుతుందట. అలా సంతోషంతో మనకోర్కెలను త్వరగా తీర్చుతారని ప్రతీతి. ఈ గుంజీళ్లు తీయడం వెనుక ఒక పురాణ కథ ఉన్నది. 


 ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకువచ్చి ఇచ్చారట. అవన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని ప్రక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మ్రింగేశాడు. కాసేపటికి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే  ఇంకెక్కడిది నేను మ్రింగేశాను అని సెలవిచ్చారు స్వామి. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టారట. అదిచూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు. ఈనవ్వడంలో సుదర్శనచక్రం బయటకు వచ్చింది. అలా మొదట గణపతికి గుంజీళ్లు సమర్పించినది శ్రీమహావిష్ణువే!

5 కామెంట్‌లు:

  1. శివుడు విష్ణువు అన్నాతమ్ముల్లు కదా.అప్పుడు గణపతి విష్ణుమూర్తి కి కొడుకు అవుతాడు కదా.మేనల్లుడు ఎలా అవుతాడు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "నారాయణి" అని ఎవరికీ పేరో మీకు తెలిస్తే, ఈ ప్రశ్న రాదు

      తొలగించండి
    2. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళా|
      జనకః శంకరో దేవః తమ్ వందే కుంజరాననమ్||

      శ్రీమాహా విష్ణువు మేనమామగా, ఆ సర్వమంగళ అయిన పార్వతి తల్లిగా, శంకరుడు తండ్రిగా కలిగిన ఓ గజాననా నీకు వందనము అని ఒకశ్లోకం చెప్తారు పెద్దలు.


      పార్వతీదేవి, శ్రీమహావిష్ణువు సోదర సోదరీ మణులు. భవ భవాని, శివ శివాని, రుద్ర రుద్రాణి అంటే భార్యాభర్తల పేర్లు. కానీ నారయణ నారాయణి అంటే లక్ష్మీ నారాయణులు కాదు సోదర సోదరీమణులు. హరి, పార్వతీ దేవులు.

      తొలగించండి
  2. చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.