4, మే 2015, సోమవారం

శివలింగాలు సాలగ్రామాలు ఇంటిలో ఉండవచ్చా

శౌచము పాటించ గల ఇళ్లలో మూడు అంగుళాలకు మించని శివలింగము ఉండవచ్చును. కానీ నిత్యం ఇంటి యజమాని శ్రద్ధగా అభిషేకం చెయ్యాలి. మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. శ్రద్ధ కొరవడితే అది ఇంటికి అరిష్టమే!  రాతితో సహజ సిద్ధంగా తయారైన సాలగ్రామాలు, బాణలింగాలు మహా శక్తివంతమైనవి. సరి అయిన నియమాలు పాటిస్తే ఎనలేని సంపదలనిస్తాయి. పాటించక అశ్రద్ధతో పూజిస్తే అరిష్టాన్నిస్తాయి. కనుక శివలింగాన్ని,సాలగ్రామాలను ఇంట్లో పెట్టడానికి ఒకటిరెండు సార్లు ఆలోచించుకోవాలి. లోహంతో తయారు చేసిన లింగాలు కనీస ధూపదీప నైవేద్యాలు ఇవ్వగలిగినట్లైతే  ఉంచుకొనవచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.