6, జులై 2015, సోమవారం

పుష్కరాలలో పురోహితులను ఇక్కట్లు పెడుతున్న తెలుగు ప్రభుత్వాలు


శ్రీరామ!

      ఈ ఆలోచన ఎందుకు ఎలా ఒచ్చిందో ఏమో? “పుష్కరాలకు వచ్చే పురోహితులకు గుర్తింపు కార్డ్ లు ఇవ్వాలి” అన్న ఆలోచనకు శ్రీకారం చుట్టాయి ఆంథ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు. 
      మాది ఒకటే ప్రశ్న. "పురోహితులకే ఎందుకు కార్డ్ లు ఇవ్వాలి? వారి వలన వచ్చిన ఇబ్బంది ఏమిటి? పుష్కరాలకు వ్యాపారం చేసుకుందాం అని వచ్చే వ్యాపారస్థులకి కార్డ్ లు ఇవ్వటంలేదెందుకు?"
        ఆప్రయత్నం కనుక ప్రభుత్వం చేసి ఉంటే ఈ పాటికి అల్లరి అల్లరి అయ్యేది. బి.సి., ఎస్.సి..... అంటూ అనేక సంఘాలు ఎంత గొడవ చేసేవి? మరి మేమైతే సాధారణంగా సాత్విక వ్యవహారానికి అలవాటు పడ్డవారం కనుక గొడవలు చేయలేము. మా వెనకాల ఏ సంఘమూ సపోర్ట్ రాదు. ఇదే ఆలోచనతో మొదలు పెట్టారేమో..!?
పోనీ కార్డులు తీసుకుందాం అనుకుంటే, మెత్తనయ్యను చూస్తే మొత్త బుద్ధి వేసినట్టు మామీద పెత్తనం చెలాయిస్తున్నారు.  250/- ఫీజు కట్టాలి. అది కడితే సరిపోదు. జూలై 14 న పుష్కరాల ప్రారంభ మైతే! జూలై 1న ఇంటర్య్వూలకు పిలిచారు. పోనీ వెంటనే కార్డులు ఇచ్చారా అంటే లేదు. జూలై 11న కార్డ్ లు ఇస్తారట. గోదావరి నది పుష్క్రర ఘాట్ లు ప్రతీ ఊరిలో లేవు కదా! మేం వెళ్లాలనుకునే క్షేత్రానికి 14 పుష్కరాలకు వెళితే సరిపోదు.  ముందు రెండు సార్లు వెళ్లి రావాలి. మొత్తం మూడుసార్లు రానూ పోనూ చార్జీలు ఎంత తక్కువ వేసుకున్నా ఓ 3,000/- అవుతాయి.
     అక్కడ పధ్నాలుగు రోజులు ఎక్కడ ఉండాలి? ఓ రూము తీసుకుని ఉందాం అంటే రోజుకు 1000, 1500 అడుగుతున్నారు. ఏ బంధువో ఆ ఊరిలో ఉంటే సరి. లేకపోతే పురోహితులందరూ ఎక్కడ ఉంటున్నారో ఎవరైనా గమనించారా? నిజం చెప్పనా!? “సత్రం అరుగుల మీద పడుకుంటున్నారు” ఇంత దీన స్థితిలో ఉన్నవారు పైఖర్చు ఎలా భరించగలరు?
       అసలే అధికమాసం! తరువాత ఆషాఢం, మూఢాలవలన శ్రావణంలో ముహూర్తాలు లేవు. భాద్రపదం సూన్యమాసం. ఆశ్వయుజం వరకు పురోహితులకు గడ్డురోజులు. పురోహితులు ఏపూటకాపూట తిండికి వెతుక్కోవలసినదే! రేపేంటి? ఈ నాలుగు నెలలూ ఎలా? అందరిదీ ఇదే ప్రశ్న.
      ఇటువంటి సమయంలో పుష్కరాలు  రావడం కాస్త ఊరటనిచ్చింది. పుష్కరాల పేరుతో ఏదో ఓ నెల సంపాదనైనా రాక పోతుందా అని ఆశ. కానీ అందులోనూ ఆటంకమే! కార్డుల  తీసుకోవాలంటే ఒక్కొక్క పురోహితుడు ముందుగా 3, 4 వేలు ఖర్చు పెట్టాలంటే వారి వల్ల అవుతుందా?

        ఇదీ మన రాష్ట్రప్రభుత్వ తీరు. బతుకమ్మకి 10కొట్లు. మరి రంజాన్ కి 26కొట్లు. ఒక్కొక ఇమామ్ కి & మౌజామ్ కి నెలకి 1000/చొప్పున అంటె మొత్తమ్ 2000/- ఇలా రాశ్త్రమ్ లొ 5000 మజీద్ కకి సంవత్సరానికి 12కోట్లు ఇస్తున్నారు కేవలం ఒక్క భద్రాచలం దేవాలయం నుండి ప్రభుత్వానికి వచ్చె ఆదాయం 30కోట్ల పైనే. ఇంకా ఇలాంటి దాదపు 19 దేవాలయాలనుండి వచ్చే ఆదాయం మొత్తం100కోట్లు. మరి మజీద్ నుండి ఎంత వస్తుంది? హిందు దేవాలయలకి ఎంతకర్చు పెడుతున్నారు.?  
         మేం ఎంత పేదరికంలో ఉన్నా, మాకు ఏపథకాలూ లేవు. ఈశ్వరుడే అన్నిటికీ దిక్కని ఏదో మా బ్రతుకులు మేం బ్రతుకుతుంటే అందులో వేలుపెట్టి నోటి కాడ కూడు లాక్కుంటున్నాయి తెలుగు ప్రభుత్వాలు. వీరు చేసే పని దేశానికి అరిష్ఠం చేస్తుంది. దయచేసి ప్రజలందరూ పురోహితులకు ఈవిషయంలో బాసటగా నిలవాలి. శుభమస్తు అని నలుగురి మంచిని కోరుకునే పురోహితుల పొట్టలు కొట్టడం ఈ ప్రభుత్వాలకు, దేశానికీ మంచిదేనా? పురోహితుల ఆక్రోశం గమనించి ప్రభుత్వాలు కార్డ్ ఉన్న లేకున్నా నదీ తీరంలో పూజలు చేసుకునే అవకాశం కల్పించాలి. అలాగే ఫలానా ఘాట్ లోనే ఉండాలని కాకుండా ఒక ఊరిలో ఎక్కడైనా పూజలు నిర్వహించే స్వాతంత్ర్యాన్ని మాకు ఇవ్వాలి.

13 కామెంట్‌లు:

  1. విజయ్ శర్మ గారికి నమస్కారం.
    పురోహితులకి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వడం గురించి మీ టపా ద్వారా బ్లాగ్వీక్షకులకు తెలియజేసినందుకు అభినందనలు.
    ప్రత్యేక గుర్తింపు కార్డులు వుచితంగా ఇవ్వడం అటుంచి మీ నుండి సొమ్ములు లాగాలనుకోవడం సిగ్గుచేటు.

    కొన్ని ప్రశ్నలు: పురోహితుల సంఘం అని ఏదైనా ఉందా? పౌరోహిత్యం చేయడానికి అర్హత పొందేందుకు ఏవైనా పరీక్షలు ఉన్నాయా?

    ఇది ఎందుకు అడుగుతున్నానంటే నేను కొంత మందిని చూశాను - మంత్రాలు [మరియు వాటి అర్ధం పరమార్ధం] తెలియకపోయినా తెలుసును అన్నట్లు వ్యవహరిస్తారు. అర్హులైన వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు – అది కూడా వుచితంగా యివ్వాలని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పురోహితులకు స్మార్తం నేర్పడం కోసం పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలు చాలా వరకు ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో నడుస్తాయి. కొన్ని ఔత్రాహికులు నడిపేవీ ఉన్నాయి. కానీ గత పది పదిహేను సంవత్సరాలనుండే ఇటువంటి సర్టిఫికెట్ ఇచ్చే విధానం అమలులో ఉంది. పాత తరం వారికి సర్టిఫికెట్స్ ఏమీ ఉండవు.

      తొలగించండి
  2. పురోహితులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే ఆలోచన ఆలోచనగానే చూస్తె బాగుంది. వివిధ సేవలకు టికెట్లు ఇవ్వడం & అర్హతలు ఉన్న తగినంత మందికి కార్డులు ఇవ్వడం వల్ల భక్తులకు సదుపాయం. అదే సమయంలో పురోహితులకు ఇన్శూరెంస్, ఈయెసై, బస్ పాసులు, ఉచిత వసతి/భోజనం ఇస్తే వారికి కూడా సమస్యలు ఉండవు.

    అయితే సఫలం కావాలంటే ప్రభుత్వ/రాజకీయ/వ్యాపార వర్గాల జోక్యం లేకుండా చేయడం అత్యవసరం. గతంలో చెప్పినట్టు మతపెద్దలు & ఆగామ పండితులతో మాత్రమె కూడిన తెలంగాణా ధార్మిక పరిషత్ ఏర్పాటు అయి ఉండుంటే వారి అధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉండేది. ఇప్పటికయినా దీని పర్యవేక్షణ పుష్కరాల విషయంలో నిష్ణాతుల పర్తవేక్షణలో చేస్తారని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కార్డులు ఇస్తే ఇచ్చారు. కానీ ఎవరికి దగ్గరలో ఉన్న వేదపాఠశాలనుండి వారు కార్డులు పొందే విధంగా ఏర్పాటు చేస్తే అన్ని విధాలా బాగుండేది. తలా తోకా లేకుండా ఉంది వ్యవహారం అంతా! పురోహితులకు ఆ పన్నెండు రోజులూ ఎటువంటి సౌకర్యాలు కల్పించని ఎండోమెంట్ వారు, వారివద్ద రుసుములు వసూలు చేయడం, దక్షిణ ఇంతే తీసుకోవాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజసం?

      తొలగించండి
    2. నేనూ అదే అంటున్నాను సార్. ఇడియా బాగున్నా ఆచరణలో పెట్టేముందు సరయిన కసరత్తు చేయాలి. ఏడాది నుండే ధార్మిక పరిషత్ గురించి మాట్లాడుతున్నా ఇంకా ఏర్పరచలేదు.

      దక్షిణ మొత్తాన్ని నియంత్రించడం భక్తులకు మంచిదే కానీ నిర్ణయించిన సంఖ్య గిట్టుబాటు కావాలి. నేను బస్ పాస్, ఉచిత భోజన/వసతులు ఇవ్వాలన్నది అందుకే.

      తొలగించండి
  3. తెలంగాణా ఆవిర్భావం తరువాత ప్రభుత్వం అర్చకులకు 4,000 జీతంగానూ & నైవేద్యం కోసం 2,000 ఇచ్చింది. ఇటీవలి ఈ మొత్తాన్ని పెంచాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.

    రిప్లయితొలగించండి
  4. అర్చకులు అంటే గుడిలో ఉండి దైవ కార్యక్రమాలు ఆ గుడి యొక్క నిర్ధిష్టత ప్రకారం కొనసాగించేవారు. పురోహితులు అసలు ఆపడంలోనే దాని అర్ధముంది దయచేసి గమనించండి. అర్చకులకి జీతభత్యాలు ఇస్తే అవి పురోహితులకి కూడా ఇచ్చినవి కావు. జరగబోయే మహాపుష్కరాలు రాజకీయ వ్యాపరముగా కనపడుతున్నాయి. వస్తాయి మనం చూస్తాము. పత్రికలు టి.వి.లు జనాన్ని కొంచెం సేపు నాయకుల్ని చాలా సేఅపు చూపిస్తూ కాలం గడిపేస్తాయి. నా అనుమానం ఇప్పుడు నిర్మిస్తున్న కట్టడాలు అంత్య పుష్కరాలనాటికి ఉంటాయా????? అలా ఉంటేనే వాటికి బిల్లులు చెల్లిస్తాము అంటే....... ఎవరైనా ఊరుకుంటారా.. సంకల్పం చెప్పించి స్నానము సక్రమముగా జరిపించే పురోహితుడు మాత్రం లోకువ ఈ ప్రభుత్వాలకి.
    కారణం...? వీళ్ళకి ఉన్న ఓట్లు బహు తక్కువ.. పైగా ఒ.సి.లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగా చెప్పారు. కోట్లు ఖర్చు పెడుతున్నా మంటున్నారు. కానీ ఎవరి వద్దనుండీ వసూలు చేయనిది పురోహితులనుండి రుసుము వసూలు చేయడం బాధాకరం. వారి బాగోగులు చూడడానికి మాత్రం ఎవరికీ పట్టదు.

      తొలగించండి
  5. విజయ్ శర్మ గారు నమస్కారం
    నేను ఒక పురొహితుడను హైదరాబాద్ వాసిని నేను శృంగేరీ వారి ఆధ్వర్యం లొ నడిచే స్మార్త పాఠశాలలొ స్మార్తం పూర్తి చేసాను బయట పురొహితం లొకి వచాక చాల మంది అనర్హులు ఐనటువంటి వాళ్ళు పురొహితం లొ ఉండటం గమనించాను వారి వద్ద కార్యక్రమం జరిగినప్పుడు ఋత్విక్కు గా వెళ్ళి నప్పుడు
    వారు చెప్పె అప స్వరాలు , అప పదాలు విని విసుగు పుట్టేది ఐతే ఈ విధం గా కనీసం పంచ దశ సంస్కారాలు ,కనీస శబ్ధ జ్ఞానము కూడ లేకుండ యజమాని కి కార్యక్రమము చేయించుట ఎంత వరకు సమంజసము ?
    ప్రభుత్వ సాయములు కొరుకునే పురొహితునికి కనీస అర్హత అవసరం అని నా అభిప్రాయం
    నెను మరొకరిని కించ పరచటానికి చెప్పట్లేదు
    బ్రాహ్మణానాం అనేకత్వం అనే విధంగా వారికి ఇది తప్పు ఇది సరిఐనది అని మెము చెప్తే మమ్మల్ని నీకేమి తెలీదు అవతల కి ఫొ అనే విధం గా వుంటుంది వారి తీరు
    కాబట్టి నాలాగే చాలామంది పాఠశాలనుండి వొచ్చే వారికి పురొహితం మీద నమ్మకం ఉండాలి అంటే అర్హత కలిగిన వారి కి గుర్తింపు కార్డులు ఉండాలని నేను అనుకుంటున్నను
    నేను కొత్తగా పురొహితం లొకి వొచ్చినవాడిని అందుకే ఈ విధం గా అడుగుతున్నా తప్పు గా భావించకుండా
    నాకు సరైన ప్రత్యుత్త్రరం ఇస్తారని ఆసిస్తూ ........ కొల్లూరి ఆంజనేయ శాస్త్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనం అందరం ఇలా ఆలోచించ బట్టే ప్రతీ ఒక్కళ్ళూ బ్రాహ్మణులనే పొడుచుకు తింటున్నారు. మనలో మనకే ఐక్యత ఉండదు. కార్డులు కావాలంలంటే ఇరవైసార్లు తిరగాలట. 250 చెల్లించాలి ప్రభుత్వం వారికి. కోట్లు ఖర్చుపెట్టి పుష్కర ఏర్పాట్లు చేస్తున్నారుట, కానీ పురోహితుల కార్డులు ఇవ్వడానికి వారి వద్ద డబ్బులు లేవు. ఇప్పుడు కార్డులు ఇచ్చిన వారందరూ ఉద్ధండ పండితులు కారు. ఒకసారి రేవు కు వెళ్లి గమనించండి. ఏప్రాతిపదికన, ఎందుకోసం కార్డులు ఇచ్చారో మీకేమైనా అర్థమైతే మాకు కాస్త తెలియజేయండి.

      తొలగించండి
    2. ఈ కార్డుల ప్రక్రియ అన్ని స్మార్త పాఠశాలలకు అప్పజెప్పి ఉంటే పురోహితులు ఎవరికీ ఇబ్బంది ఉండేది కారు. ఏఊరి వారు ఆఊరికి దగ్గరలోని పాఠశాలలో సంప్రదించడం పెద్ద కష్టం కాదు. కానీ ఊరుకాని ఊరు కేవలం కార్డుల కోసం మూడు నాలుగు సార్లు తిరగాలంటే ఎంత ఇబ్బంది ఆలోచించండి.

      తొలగించండి
  6. మన ఇంట్లోని సమస్యల గురించి చర్చించేటపుడు ప్రక్కింట్లో వారిని పోల్చుకోకూడదు.మజీద్ ల ఆదాయం సంగతి ఇక్కడ అనవసరం.మీరు చెప్పిన విషయంలో కార్డులు ఉంటే బాగుంటుంది.అది కూడా గుర్తింపు పొందిన వేద పాఠశాలలవారు ఇస్తే ఇంకా బాగుంటుంది.ఇప్పటికిప్పుడు కార్డులు అని సతాయించకుండా ముందుగా మొదలుపెట్టి ఉంటే బాగుండేది.
    ఇకపోతే హిందూ ఆలయాల ఆదాయం గురించి మీరు చెప్పిన మొత్తం చాలా తక్కువ.ఒక్క వైజాగ్ లో వీధికొక ఆలయం చొప్పున 23 వేల ఆలయాలు ఉన్నాయి.ఈ లెక్ఖన ప్రభుత్వం ఎంత ఆదాయాన్ని కోల్పోతున్నదో ఆలోచించండి.ఆలయ నిర్మాణం అనేది ఒక మంచి బిజినెస్ అయిపోయింది.మొన్న ఒక ఆలయం చూసాను ఒకే ప్రాంగణంలో ఇల్లు కట్టుకుని ప్రక్కనే ఆలయం కూడా నిర్మించుకున్నారు.వీరభక్తులనుకుంటున్నారేమో విశాఖలో పేదవారూ ఎక్కువే భక్తీ ఎక్కువే !

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.