19, ఆగస్టు 2015, బుధవారం

మూఢాలలో మంగళ గౌరీ వ్రతం చేయవచ్చా!?
శ్లో|| నశుక్ర దోశః నసురేద్య దోశః తారాబలం చంద్రబలం విచింత్యం|
ఉద్వాహితాయాః నవ కన్యకాయాః దీపోథ్సవో మంగళ శోభనాని|| ___ జ్యోతిర్నిబంధే
కొత్తగా పెళ్లయిన వథువుకు గురు శుక్ర దోషములు ఉండవు. తారాబల, చంద్రబలాలు అవసరం లేదు. మంగళ కరమైన వ్రతములు దీపోత్సవములు ఆచరించ వచ్చును


 
శ్లో||సీమంతే జాతకే పుంసే మన్వాదిషు యుగాదిషు
మహాలయే మృతాహేచ భూదానే సేతుదర్శనే
వారణాస్యాం గయాక్షేత్రే చతుర్ధ్యాంగణపూజనే
మాంగల్యగౌరీపూజాచ వరలక్ష్మీ తథైవచ
ఏతేషు సర్వకార్యేషు మూఢదోషోనవిద్యతే|| ___ జ్యోతిర్నిబంధే
సీమంతము, జాతకర్మ, పుంసువనము, మన్వాది, యుగాది, మహాలయ శ్రాద్ధము, మృతాశౌచము, భూదానము, సేతుదర్శనము, కాశీ గయా క్షేత్ర ములు, వినాయక చవితి, మంగళ గౌరీ మరియు వరలక్ష్మీ వ్రతములు మొదలగు వాని విషయములో మూఢదోషము ఉండదు. కనుక మూఢములైననూ ఇవి ఆచరించ వచ్చును.

6 వ్యాఖ్యలు:

 1. 200% true..as you said in civilisation flow so many rules r changing nd changed by kuhana folks...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. >తారాబలం చంద్రబలం విచింత్యం
  ఇలా అన్నప్పుడు తారాబలం చంద్రబలం చూడాలన్న అర్థం వస్తోంది. మీరు విరుధ్ధంగా వ్రాసారు!

  తారాబలం చంద్రబలం నచింత్యం
  ఇలా అంటే తారాబలం చంద్రబలం చూడటం అవసరం కాదన్న అర్థం వస్తోంది. మీరు చెప్పిన అర్థం ఇది. అందుకే ఈ పాఠం ఉండాలి మీ టపాలోని శ్లోకంలో

  ఒక్క అక్షరం తేడాలో అర్థం అంతా మారిపోయింది. ఏది సరైన పాఠమో తెలిసేది కష్టమేను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఒక్క అక్షరం తేడాలో అర్థం అంతా మారిపోయింది. ఏది సరైన పాఠమో తెలిసేది కష్టమేను.
  ఒక అక్షరంలో తేడాను కూడా సహించలేని శ్యామలీయం వారు నిజంగా మహాత్ములు,ఔరా!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మంగళ గౌరీ వ్రతానికి తారాబల చంద్ర బలాలు చూసే విధానమే అసలు లేదు
  అలాగే అదే గ్రంథంలోని క్రింది శ్లోకం కూడా మూఢ దోషం లేదని చెప్తున్నది
  నచింత్యం అనేది సబబుగా తోస్తున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నచింత్యం అనేది సబబుగా తోస్తున్న పక్షంలో మీరు టపాను కూడా తదద్నుగుణంగా కొంచెం మార్పు చేస్తే బాగుంటుంది. పాఠకులందరూ వ్యాఖ్యలను కూడా క్షుణ్ణంగా చదువక పోవచ్చును కదా!

   తొలగించు
  2. శ్యామలీయం సర్ చెప్పింది అక్షరాలా నిజమ్. వుపాధ్యాయుడు తప్పు చెప్పకూడదు కద..ఒక్క అక్షరం అయినా అర్ధం మారిపోతే మాలాంటి తెలియని వారు అయోమయానికి లోను అవుతారు.. చూసారు కదా-పుష్కరాలు ఇప్పుడు అని కొందరు కాదు అప్పుడు అని మరికొందరు ...ఎందుకు ఈ తేడాలు? మనసులో confusions

   తొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.