23, మే 2016, సోమవారం

KP ASTROLOGY ప్రాముఖ్యత ఏమిటి?



శ్రీరామాయ నమః
తమిళనాడు బ్రాహ్మణ కుటుంబీకు లైన ప్రొఫెసర్ క్రిష్ణమూర్తిగారు జ్యోతిష్యంలో ఎంతో శ్రమించి,అనేక ప్రాచ్య పాశ్చాత్య  జ్యోతిష పద్ధతులను పరిశీలించి వాటన్నిటిలో తనకు  జవాబుదొరకని ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో ఒకపద్ధతిని తయారు చేశారు. దానినే క్రిష్ణమూర్తి పద్ధతి ( KP System ) అంటారు. 



ఇది చాలా వరకూ సాంప్రదాయ వైదిక జ్యోతిషమే! కానీ కొన్ని విధానాలను ఇతర పద్ధతుల నుండి తీసుకున్నారు. కొన్నిటిని తాను స్వయం కనిపెట్టారు.  దీనిని మెరుగులు దిద్దిన వైదిక జ్యోతిష్యము అన చెప్పవచ్చు. 


దీనిలో విశేషమేమంటే...
౧. కవల ల జనన సమయం కేవలం 2,3  నిమిషాలు మాత్రమే తేడా ఉంటుంది. రెండు నిమిషాల తేడాతో జాతకాలు ఎలా మారిపోతాయి అనేద ఈ పద్ధతి ద్వారా రుజువులతో నిరూపించ వచ్చు.
౨. ఇందులో ఇలా జరగవచ్చు అనే ఊహాగానాలు ఉండవు, ఇలా జరుగుతుంది అనే ఖచ్చితంగా చెప్పవచ్చు.


౩. నా సిక్త్ సెన్స్ తో చెప్పాను, లేదా నా తపశ్శక్తితో చెప్పాను అంటే ఆధునికులు ఎవరూ నమ్మరు. వారికి ఒక ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా  ప్రకారం ఎవరికైనా ఫలితాన్ని సరిగా చెప్పినప్పుడు అది ఒక శాస్త్రంగా నమ్ముతారు. క్రిష్ణమూర్తి గారి తపస్సు ఫలితంగా నేడు మనకి అటువంట కొన్ని సూత్రాల సారంగా ఈ కేపీ జ్యోతిషం లభించింది అని చెప్పవచ్చు. ఫలితాలను సూత్ర బద్ధంగా నిరూపించ వచ్చు. అసలు KP ( క్రిష్ణమూర్తి పద్ధతి ) లో సాధన చేసే జ్యోతిష్యులు నేను ఊహించాను అనే మాటవాడడం సమ్మతించరు.  నేను సూత్రాలను అనుసరించి ఫలితాలు చెప్పాను {అంటే Predict  చేశాను} అనే మాటే వాడతారు.

౪. ఇందులో ప్రశ్నశాస్త్రం ( Horary )  విశేషంగా వివరింప బడింది. దీనిద్వారా ఏ ప్రశ్నకైనా ఖచ్చితమైన జవాబులు చెప్పవచ్చు. ప్రశ్న అడిగినప్పుడు 1 నుండి 249 లోపు ఒక సంఖ్య చెప్పమంటారు. అలా అని ఇది
ఇది న్యూమరాలజీ కాదు. ఆనెంబరు ద్వారా లగ్నాన్ని, భావాలను, గ్రహస్థితులను గుర్తించి జవాబు చెప్తారు. 


కేవలం ప్రశ్నభాగానికే ఉపయోగిస్తుందనీ, జన్మ జాతకానికి పనికిరాదని కొందరి వాదన. కానీ అది సరికాదు. దీనిద్వారా జన్మ జాతకం పరిశీలించి కచ్చితమైన ఫలితాలు చెప్పవచ్చు.

 
"ఈ పద్ధతే ఉత్తమమైనదా!? నేను పూర్వం వైదిక పద్ధతిలో సాధన చేసే వాడిని, ఈ పద్ధతిలోకి మారాలా వద్దా!?" అని చాలా మంది అడుగుతూ ఉంటారు.
దానికి నా సమాధానం ఒక్కటే! ఇది వైదిక విరుద్ధమైనది కాదు. సాంప్రదాయ పద్ధతికి మెరుగులు దిద్దబడిన పద్ధతి మాత్రమే! ఇక ఏది ఉత్తమమైనది అంటే మీరు సాధన చేస్తే ఎందులోనైనా ఉత్తమ ఫలితాలు చెప్పవచ్చు. మీకు ప్రత్యక్ష గురువులు ( అంటే ఏపుస్తాకలలో నేర్చినదో కాక, దానిని నేర్పించే వారు స్వయంగా ) ఏపద్ధతిలో దొరుకుతారో మీకు ఆపద్ధతి ఉత్తమమైనది. ( ఇది నా అభిప్రాయం మాత్రమే )


ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.