28, జులై 2016, గురువారం

ప్రశ్న అడగండి - సమాధానం చెప్తాను ( ఉచితం )

మీ ప్రశ్న - నా సమాధానం ( ఉచితం ) ప్రశ్నశాస్త్రం ద్వారా

1. నాకు వివాహం అవుతుందా?  అవదా? అయితే ఎప్పుడు అవుతుంది?

2. నాకు సంతానయోగం ఉందా! లేదా!?  ఉంటే ఎప్పుడు కలుగుతుంది?

3. నేను పై చదువులు చదువుతానా!?  ఉద్యోగంలో చేరుతానా!?

4. నేను పై చదువులు చదువుతానా!? పెళ్లి చేసుకోసుకుంటానా!?

5. దాంపత్యంలో సమస్యలు తీరుతాయా!?

6. ఉన్న ఉద్యోగం వదులుకుని కొత్త ఉద్యోగంలో చేరడం నాకు లాభమా!?  నష్టమా!?

7. నేను పెట్టే పెట్టుబడి నాకు లాభిస్తుందా!?  లేదా ఫలానా వ్యాపారం నాకు లాభమా నష్టమా!?

8. నా ఋణ బాధలు తీరుతాయా!?

9. సినిమా / రాజకీయం / షేర్స్ వీటిలో. నేను రాణిస్తానా!?

10. నాకు విదేశీ యానం,  అక్కడ ఉద్యోగ యోగం ఉందా!?  ఎప్పుడు వెళ్లగలను?

ఇలా మనకు నిత్యం మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు ఉంటాయి.  వాటికి సమాధానం ఎలా దొరుకుతుందో,  ఎవరు సరిగ్గా చెప్పగలరో తెలియక సతమతమవుతూ ఉన్నారా!

ఇప్పుడు మీకా సమస్యలేదు.  KP ASTROLOGY ద్వారా నేను మీకు సమాధానం చెప్తాను.

ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పవచ్చు.  అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా!

కానీ నేను కాలక్షేపానికి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పను. నాకంత సమయం లేదు. మీ ప్రశ్న లో తీక్షణత ఉండాలి.  దానికి సమాధానం దొరికితే మీకు గట్టి లాభం చేకూరుతుందని నేను నమ్మితే తప్పక సమాధానం చెప్తాను.ప్రశ్న వేసే విధానం :

ముందుగా ఏ సమస్య మిమ్మల్ని బాధపెడుతోందో?  మీ ప్రశ్న ఏమిటో!?  దేనికి సమాధానం తెలియక సతమతమవుతున్నారో?  దానిని  పేపరు మీద రాసి,  ఒకటికి రెండు సార్లు చదివి ఓ స్పష్టతకు రావాలి.

 ఉదయం స్నానానంతరం భగవంతుని ముందు కూర్చుని, మీకు  దారి చూపించమని ప్రార్థించి, మీ మనసులోని ప్రశ్న తలచుకోండి. 1 నుండి 249 లోపు ఏదో ఒక సంఖ్య అనుకోండి.  ఆ సమయంలో మనసులో బలంగా ఏ సంఖ్య తోచుతుందో అది పేపరు మీద రాసుకుని నాకు తెలియచేయాలి. మీ ప్రశ్న మరియు కేపీ నెంబర్ వాయిస్ మెసేజ్ ద్వారా నాకు పంపించాలి.

 నేను వచ్చిన ప్రశ్నలన్నీ రాసుకుని ఓ pdf తయారు చేయాలి.  కనుక నా మెయిల్ కి ( rvj.astropandit@gmail.com) వచ్చిన వాటికి మాత్రమే సమాధానం చెప్తాను. మీరు అడిగిన ప్రశ్న,  నేను చెప్పిన సమాధానం ఎప్పటికీ స్టోర్ అయ్యి ఉంటాయి.  జ్యోతిషం,  పూజలు మొదలైన వాటి ఉత్తర ప్రత్యుత్తరాల కోసం నా మెయిల్ ఐడీ మార్చాను గమనించగలరు.

ఈరోజు నుండి వచ్చిన 500 వందల ప్రశ్నలకు ఉచితంగా సమాధానం చెప్పాలని అనుకున్నాను.  ఇలా ఉచితంగా చేయడం నాకు ఖాళీగా ఉండడం వలన కాదు.  నిజంగా సమస్యలలో ఉన్న వారికి నావంతు సహాయం అందించాలని నా ఉద్దేశం. కేవలం ఒకరికి ఒక ప్రశ్న మాత్రమే ఉచితం.   ఒకటికంటే ఎక్కువ వేస్తే వాటికి తప్పక  దక్షిణ చెల్లించాలి.  ఉచితం అంటే అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తున్నారు.  పదే పదే అనవసరమైన ప్రశ్నలు వేస్తే నిజంగా అవసరంలో ఉన్న వారికి సేవ చేయలేం. కనుక ఈ నియమం. అలా అని ధన సంపాదన నా ధ్యేయం కాదు.  ఇవ్వలేని పేదవారికి పూర్తిగా ఉచితం.

వేదపండితులకు,  పురోహితులకు,  అర్చకులకు,  వైదిక వృత్తిలో ఉన్న మిత్రులకు ప్రత్యేక గౌరవంతో నా సేవలు అందిస్తాను.  మీ సమస్యలకు,  ప్రశ్నలకు నాద్వారా ఏ మాత్రం దారి దొరికినా అది నా అదృష్టంగా భావిస్తాను.

నా ఫేస్ బుక్ పేజ్ : https://m.facebook.com/Rajasekharuni-Vijay-Sharma-558643490887306/

నా జీ మెయిల్ : rvj.astropandit@gmail.com

4 వ్యాఖ్యలు:

 1. KP Astrolagy లో ప్రశ్నలు ఆహ్వానించాను. చాలా మంది తమ సమస్యలు తెలుపుతూ ప్రశ్నలు అడుగుతున్నారు.

  కానీ కొందరు gmail ద్వారా, కొందరు watsapp ద్వారా , కొందరు Facebook ద్వారా , మరి కొందరు Telegram ద్వారా ఇలా ఒకొక్కరు ఒక్కో దానిలో పంపుతున్నారు.

  నాకు నోట్ చేసుకోవడం, మళ్లీ సమాధానం ఇవ్వడం సమస్యగా ఉంది.

  కనుక దయచేసి ఇకనుండి అందరూ rvj.astropandit@gmail.com ద్వారా మాత్రమే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపగలరు

  మీరు అడిగిన ప్రశ్న, నేను చెప్పిన సమాధానం ఎప్పటికీ స్టోర్ అయ్యి ఉంటాయి.


  అలాగే ప్రశ్న పంపేవారు ముందుగా మీ గురించి పరిచయం చేసుకోండి. అది కనీస మర్యాద.

  ప్రతీ ఒక్క ప్రశ్న నేను రాసి పెట్టుకుని రిజల్ట్స్ ఎంతవరకు వచ్చాయని మళ్లీ కొన్ని రోజుల తర్వాత చెక్ చేసుకోవాలి.

  కనుక క్రింది వివరాలు తప్పక పంపండి

  మీ ఇంటిపేరు
  మీ పేరు
  మీ ఊరు

  మీ ప్రశ్న
  KP నెంబర్ ( 1 నుండి 249 లోపు )

  మీ మెయిల్ ఐడి
  మీ సెల్ నెంబర్

  నేను సమాధానం పంపిన తరువాత, మీ జీవితంలో నేను చెప్పినది నిజమైనా, తప్పినా అదినాకు తెలియజేయండి.

  ఏ జ్యోతిష్యుడు నూటికి నూరు శాతం సరిగ్గా చెప్పలేరు. కానీ ఓ 70 శాతం వరకూ సరిగ్గా చెప్పగలిగితే చాలు. కానీ KP Astrologers కు విజయాలు ఎక్కువ. సక్సెస్ రేటు ఎక్కువ.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. దయచేసి ఈ విషయంలో నా సమస్యను అర్థం చేసుకుని, నాకు సహకరించండి.

  పైన పేర్కొన్న జీ మెయిల్ కు మాత్రమే మీ సమస్యలు పంపండి.

  మీరు నాకు చేయగల సహకారం అదే...

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.