1, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆధ్యాత్మిక బ్లాగులు, వెబ్ సైటుల చిరునామాలు తెలియజేయగలరు

మన బ్లాగులలో తెలుగువాడకం బాగా పెరిగింది. ఆ తెలుగులో మళ్లీ ఆధ్యాత్మిక విషయాలు రాసే బ్లాగులు కూడా చాలా వస్తున్నాయి. నేను వాటినన్నిటినీ అనుసరించాలనుకుంటున్నాను. కొంతైనా ప్రోత్సాహమందించాలనుకుంటున్నాను. తద్వారా నేనూ ఎంతో కొంత నేర్చుకోవాలను కుంటున్నాను. అటువంటి ఆధ్యాత్మిక బ్లాగులు, వెబ్ సైట్ ల వివరాలు నాకు కావాలి.


అందులో విషయం గొప్పదా కాదా, వారి ప్రయత్నం మెచ్చుకునే విధంగా ఉందా లేదా అన్నది నాకనవసరం. వారు రాసేది భగవంతుడు, భక్తి అనే విషయాలకు సంబంధించినదైతే చాలు. దయచేసి ఆ సైటు వివరాలు ఇక్కడ తెలుపగలరు. 

చాలామంది ఆధ్యాత్మిక బ్లాగరులు ఫాలోవర్స్ గాడ్జట్ ని తమబ్లాగులో ప్రదర్శించడం లేదు. దయచేసి ఆవెసులుబాటు కలిగించండి చదువరులకు. మీకు ఫాలోవర్ ల మీదా దృష్టి లేకపోవచ్చు. కానీ ఎవరైనా మీ టపాలు తరచూ చదవాలి అనుకోవచ్చు కదా!? అలాగే చాలా మంది ఆధ్యాత్మిక బ్లాగరులు మరొకరి బ్లాగులలోకి కూడా ప్రవేశించడం లేదు. అదీ కాస్త మార్చుకుంటే మంచిదేమో.  ఆలోచించండి.

నా వరకు నేను ఎక్కడభగవత్ విషయాలు చర్చించే బ్లాగు కనపడినా దానిని తప్పక అనుసరిస్తున్నాను. ఇంకా నాకు తెలియనివి మీరు ఎవరైనా చెప్తారని ఈ టపా రాస్తున్నాను. మరి మీకు తెలిసిన బ్లాగులు, వెబ్ సైటుల వివరాలు తెలుపుతారు కదూ!?  :-)