నిదుర లేవగానే మంచి మంచి ఆలోచనలు చేయడం వలన ఆరోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అటువంటి మంచి ఆలోచనలు కల్పించే ప్రయత్నమే ఈ ప్రాతస్స్మరణ శ్లోకాలు చేస్తున్నాయి. పొద్దున్న మెలకువరాగానే ఈ క్రింది శ్లోకాలు మనసులోనే చదువుకుంటూ వాటి భావాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి.
మన జన్మకు కారకులైన మాతా పితరులను స్మరించవలెను. తరువాత మన ఙ్ఞాన దాతలైన గురువులను ధ్యానించవలెను.
ఇక ఉదయాన్నె చదువలసిన శ్లోకాలు చాలా ఉన్నప్పటికీ కొన్ని ప్రసిద్ద శ్లోకాలను ఇక్కడ రాస్తున్నాను. వీటిని పఠించుట వలన దుస్స్వప్న నాశనము, కలినాశనము,మహాపాతక నాశనము కలిగి మంగళకరమగును.
౧. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవేనమః
౨. అఙ్ఞాన తిమిరా2౦ధస్య ఙ్ఞానా2౦జన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః
౩. ఉత్తిష్ఠోత్తిష్ఠ విశ్వేశ ఉత్తిష్ఠ వృషభధ్వజ
ఉత్తిష్ఠ గిరిజా కాన్త త్రైలోక్యం మంగళం కురు
౪. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
౫. శారదా శారదా2౦భోజవదనా వదనా2౦బుజే
సర్వదా సర్వదా2స్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్
౬. యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయోస్సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళమ్
౭. లక్ష్మీ నివాస నిరవద్యగుణైక సింధో, సంసార సాగర సముత్తరణైకసేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య, శ్రీ వేంకటా2చలపతే తవసుప్రభాతమ్
౮. బ్రహ్మ మురారిః త్రిపురాన్తకారిః భాను శశీ భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౯. భృగుర్వసిష్ఠః క్రతురంగిరాశ్చ మనుః పులస్త్యః పులహశ్చ గౌతమః
దాల్భ్యోమరీచిః చ్యవనో2థ దక్షః కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౧౦. సనత్కుమారశ్చ సనన్దనశ్చ సనాతనో2ప్యాసురి సింహళౌ చ
సప్త స్వరాః సప్త రసాతలా కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౧౧. సప్తా2ర్ణవాః సప్తకులా2చలాశ్చ సప్తర్షయో ద్వీపవనాని సప్త
భూరాది కూర్మో భువనాని సప్త కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౧౨. పృథ్వీ సగన్ధా సరసాస్తథా2పః స్పర్శీ చ వాయుర్జ్వలితం చ తేజః
నభః సశబ్దం మహతా సహైవ కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౧౩. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసా2౦బరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్
రుక్మాంగదా2ర్జున వసిష్ఠ విభీషణా22దీన్ పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి
౧౪. పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠరః
పుణ్యశ్లోకాచ వైదేహీ పుణ్యశ్లోకో జనార్దనః
౧౫. బ్రహ్మాణం శంకరం విష్ణుం యంమం రామం దనుం బలిం
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మహా పాతక నాశనమ్
౧౬. అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా
పంచకం తాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్
౧౭. గాయత్రీం తులసీం గంగాం కామధేనుమరుంధతీమ్
పంచ మాతౄః స్మరేన్నిత్యం మహా పాతక నాశనమ్
౧౮. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్
౧౯. మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్
యత్కృపా తమహం వందే పరమానందమాధవమ్
౨౦. హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
౨౧. మహాదేవ మహాదేవ మహాదేవ దయానిధే
భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ
౨౨. కృష్ణః కరోతు కళ్యాణం కంసకుంజరకేసరీ
కాళిందీజలకల్లోలం కోలాహల కుతూహలీ
౨౩. కరాగ్రె వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితో బ్రహ్మా ప్రభాతే కర దర్శనమ్
౨౪. ఆత్మాత్వం గిరిజామతిః పరిజనాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరః
యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవా2రాధనమ్
౨౫. ఇత్థం ప్రభాతే పరమం పవిత్రం, పఠేత్ స్మరేద్వా శృణుయాచ్ఛ తద్వత్
దుస్స్వప్న నాశత్విహ సుప్రభాతం, భవేచ్చ నిత్యం భగవత్ ప్రసాదాత్
ఇంకా భూమి ప్రార్థన చేస్తూ, స్వాసను పీలుస్తూ, కుడి కాలు మొదటగా నేలపైమోపాలి.
శ్లో.. సముద్రవసనే! దేవి! పర్వత స్తనమండలే!
విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే
రోజూ ఒకేలా లేవడం కన్నా కొన్ని రోజులు ఈ శ్లోకాలు చదివే ప్రయత్నం చేసి చూడండి. ఆ రోజులోని తేడా ఏమిటో మీకే తెలుస్తుంది.
పురోహిత విషయాలు మరియు జ్యోతిష్య విషయాలు చర్చిస్తాను. ఎవరైనా నేను సమస్త జ్యోతిశ్శాస్త్రాన్నీ ఔపోశన పట్టాను అంటే అది అసత్యమే! ఎంత నేర్చినా తరగని సముద్రం జ్యోతిష్యం. నేనూ విద్యార్థినే! నేను నేర్చిన జ్యోతిష్యం మీకూ సాధ్యమైనంత సులభ పద్ధతిలో నేర్పే ప్రయత్నం చేస్తాను.
16, డిసెంబర్ 2010, గురువారం
15, డిసెంబర్ 2010, బుధవారం
బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?
బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు "భూసురుడు" అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.
ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.
ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.
౧. స్నానము
౨.సంధ్యోపాసనము
౩.జపాదికము
౪.ఔపాసనము
౫. పంచాయతన దేవతార్చనము
౬.బ్రహ్మయఙ్ఞము
౭. వైశ్వదేవము
౮. పంచాయతనమునకు పునః పూజ
౯. అతిథిపూజ( భోజనము)
౧౦.భోజనము
౧౧.సత్సంగము
౧౨. సాయం సంధ్యావందనము
౧౩. సాయమౌపాసనము
౧౪. రాత్రి వైశ్వదేవము
౧౫. రాత్రి దేవతార్చనము
ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికము
లు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి.
అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా
దానంప్రతిగ్రహణం చైవ బ్రాహ్మణానామకల్పతె
మరింత వివరంగా త్వరలో రాసేప్రయత్నం చేస్తాను.
అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా
దానంప్రతిగ్రహణం చైవ బ్రాహ్మణానామకల్పతె
మరింత వివరంగా త్వరలో రాసేప్రయత్నం చేస్తాను.
8, డిసెంబర్ 2010, బుధవారం
నా పౌరోహిత్యంలో....
రహదారి వెంట వెళుతుంటే చిన్ని పాప ఎదురవుతుంది. కళ్లతోనే పలకరిస్తాను. ఆమె మొహమంతా వికసిస్తుంది. ఆనందాన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తుంది. సిగ్గుతో కూడిన అమాయకత్వం ఆ పాపాయి మోములో చూసిన నాకు ఏదోతెలియని ఆనందం కమ్మేస్తుంది. పిల్లలందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. నేనూ వెళ్లి ఓ బాల్ వేస్తాను. నాకు వాళ్లు క్రికెట్ గురువులు. పంతులుగారు మాతో ఆడుతున్నారన్న ఆనందం వారి కళ్లలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. గురువుగా ఉండడం కాన్నా ఏమీతెలియని వాడిగా ఉండడం లోని ఆనందం అనుభవానికి వస్తుంది. బాల్ ఇలా పట్టు కోవాలి, అలా వేయాలి అని నాకు వారు నేర్పిస్తుంటే నేను పూజ ఇలా చేయాలి, అలా చేయాలి అని నలుగురికీ నేర్పిన ప్రతీ మాటా గుర్తుకు వస్తాయి. చిన్న పిల్లలు అందరితోను తొందరగా కలవరు. వారి ప్రపంచం వేరు. ఆ ప్రంపంచంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాను. ఆ ప్రయత్నంలో నేను కోల్పోయిన బాల్యాన్ని మళ్లీ పొందడాన్ని గమనిస్తుంటాను.
గోల్కొండ గేటు సిగ్నల్ దగ్గర ఆగిన ప్రతీ సారీ ఆర్మీ వారికి మనసులోనే ఓ సెల్యూట్ పెడతాను. నాకూ-వారికీ మధ్య పెద్ద తేడా ఉన్నట్లు కనిపించదు. బ్రాహ్మణుడికి వైదిక పరమైన నియమాలు అనేకం ఉన్నట్లే, వారికి యుద్ధ పరమైన నియమాలు ఉన్నాయి. కాకపొతే బ్రాహ్మణుడిది మానసికమైన సిక్షణ, వారిది శారిరక పరమైన సిక్షణ. శిక్షణలో తేడాలు ఉన్నా ఇద్దరి ధర్మం ఒక్కటే "దేశ రక్షణ". అలా ఆలోచిస్తు గోల్కొండ గేటుదాటి కోట పరిధిలోకి ప్రవేశించి కోటను చూసుకుంటూ మరోగేటు వైపుకు వెళ్తుంటాను. చాలాసార్లు అక్కడి ముస్లిం పిల్లలు ( అప్పుడప్పుడు పెద్ద వారు ) ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని ఎదురు చూస్తుంటారు. నన్ను, నా వేషధారణను చూసి అడగాలా వద్దా అన్న సందేహంలో ఆగిపోతారు. నేను లిఫ్ట్ కావాలా అన్నట్టుగా కాస్త బండి వేగం తగ్గిస్తాను. ఆ పిల్లలు పరుగున వచ్చి బండి మీద కూర్చుంటారు. వెళ్తూ వెళ్తూ వారి చదువుల గురించి, అల్లరి గురించి, నాకు తెలియని హిందీ పదాల గురించి ఏవో మాటలు కలిపే ప్రయత్నం చేస్తాను. వాళ్ల మనసులో ఎక్కడో ఉన్న సందేహం అంత నిజం కాదన్న అవగాహన ఆ పసిహృదయాలకు చేరితే చాలన్నదే నా ఆలోచన. థాంక్యూ భయ్యా అంటూ బండిదిగిన వారిని చూసి నాలో నాకే చిన్ని పరవశం.
అర్థరాత్రి వేళ ఏ రోజైనా పూజంటూ బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఒక్కో రోజు బండిలెకుండానే వెళ్లాల్సిన స్థితి. బస్టాప్ లో నుంచుని, తోడెవరు లేరుకదా అనుకునేంతలో ఎవరో పలకరిస్తారు. " పంతులుగారు ఎక్కడుంటారు? ఎక్కడికి వెళ్లాలి?" అంటూ... వారికి ఆ చనువు ఎక్కడి నుండి వచ్చింది? అదే వేరే వ్యక్తినైతే అంత త్వరగా పలకరించడానికి ఇష్టపడని వారు నన్ను చూస్తే పరిచయస్తుడిలా ఎలా పలకరిస్తారు? అని నాలో నేనే ఏదోవెతకులాట మొదలెడతాను. నాకు ప్రతీసారీ తెలిసే నిజం ఒకటే. అటు పిల్లలు త్వరగా నాతో కలిసినా, పెద్దలు తెలిసిన వ్యక్తిని పలకరించినట్లు మాట్లాడినా అది నన్నుచూసికాదు నా లోని ఓ పురోహితుడిని చూసి. ఏదైనా ఆఫీసులో కానీ, మరోచోట కానీ నాకు కొత్త చోటుకు వెళ్లిన భావన కలగడం చాలా తక్కువ. అందుకు కారణం నేనో పురోహితుడిని. నేనుగా ఎవరికీ పరిచయస్తుడిని కాదు. కానీ నాలోని పురోహితుని పరిచయం వారికి ఈనాటిది కాదు. అది అనాదిగా వారిజీవితాలతో పెనవేసుకున్న అనుబంధం. పురొహితుడంటే ఓ పరిచయస్తుడేకాదు, ఓ స్నేహితుడు, ఓ గురువు, ఓ నమ్మదగిన వ్యక్తి. అటువంటి పురోహితుడిగా నేనున్నందుకు ఒక్కో క్షణం నన్ను నేనే అభినందించుకుంటాను.
పురోహితుడు అనే పేరుకే కాక భావానికి తగిన అర్హతను పొందడానికి నాకు నేనే సూచనలు చేసుకుంటుంటాను. నన్ను నేనే సరిచేసుకుంటుంటాను. నా చుట్టూ ఉండే ప్రపంచం నాకెప్పుడూ అందమైన గులాబీ పూలు పూచిన మొక్కలా కనిపిస్తుంది. చెట్టుకున్న ముళ్లను చూస్తూ కూర్చుంటే పువ్వుల అందాన్ని ఆస్వాదించలేము. అలాగని ముళ్లులేకుండా కేవలం పూలు పూసే చెట్టే కావాలంటే అది అత్యాసే అవుతుంది. అయినా ముళ్లు ఉన్నాయికనుకనే ఆ పూలకు అంత అందం వచ్చిందేమో అనిపిస్తుంది. ఈ భావాన్నే నా పురోహితంలో వ్యక్తపరచే ప్రయత్నం చేస్తుంటాను.
నాకు కేవలం పూజ చేసి రావడం ఇష్టం ఉండదు. పూజతో పాటు (ఆ పూజ చేసే) వారి మనసు లోతులను పలకరించి వచ్చే ప్రయత్నం చేస్తుంటాను. లోలోపల దాచుకున్న ఆనందాలను, దుఃఖాలను వెలికి తీస్తాను. పొంగుకొచ్చే ఆవేశానికి నా మాటలతో మంత్రం వేస్తాను. అంసంపూర్తిగా మిగిలిన ఎన్నో ప్రశ్నలు వారి మదినిండా. ఏదో తెలియని భయం. చేయరానిదేదో చేస్తున్నామన్న ఆలోచన. అవన్నీ తవ్వుకుంటే సుఖాలను వదులుకోవాలేమో అన్న దిగులు. అందుకే అంతరాత్మను లోలోపలే గొయ్యి తవ్వి ఆ గోతిలో కప్పేస్తారు. నేను ఆ గోతిని మరల తిరిగి తవ్వే ప్రయత్నం చేస్తాను. మీ భయాలకు అర్థం లేదు. కావలసినంత సుఖపడవచ్చు. అందులో తప్పే లేదు. ఏ వైరాగ్యమూ అవసరం లేదు. మీ అంతరాత్మలను చంపుకుంటే మీకు కలిగేది సుఖం కాదు, దుఃఖం. వాటిని బ్రతికించి చూడండి. మీలో ఎంత శక్తి దాగి ఉన్నదో మీకే తెలుస్తుంది. అనంత విశ్వాన్ని అరచేత పట్ట గలరు. అద్దంలోని బింబంలాగ ప్రపంచాన్ని ఓ కొత్త దృష్టితో అనుభూతించ గలరు. అని నేను చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓ చిన్ని ధైర్యం వారి కళ్లలో కనిపిస్తుంది. ఏదీ ఒకేసారి జరిగి పోదు. క్రమ క్రమంగా కొన్ని పరిచయాల తరువాత వారిలో ఓ చిన్న మార్పు వస్తుంది. ఆ మార్పును చూసిన నాడు నాలో కలిగే ఆనందానికి నాలోని అణువణువు పులకిస్తుంది.
నన్ను ఓ పురోహితుడిగా మలచిన గురువులకు, ఆ పరమేశ్వరునికి వేవేల వందనాలు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)