25, ఏప్రిల్ 2011, సోమవారం

ఈ విద్యార్థులకు ఆర్థిక సహాయమందించండి

నమస్కారం.

మనలో చాలామంది చదువుకునే విద్యార్థులకు సహాయపడే వారుంటారు. అలాగే ఆసక్తి కలిగిన వారుంటే నా స్నేహితులైన శాస్త్ర విద్యార్థులకు సహాయమందించండి. వీరు "న్యాయశాస్త్రం" చదువుతున్నారు. అంటే లాయర్ లు చదివేది కాదు. భారతీయ సనాతన శాస్త్రం. వ్యాకరణం, జ్యోతీష్యము వలే న్యాయము కూడా ఒకటి.  వీరు విద్యకోసం మన రాష్ట్రం వదిలి, గురువుని వెతుక్కుంటూ వెళ్లి తమిళనాడులో నివశిస్తున్నారు.

  ప్రస్థుతం ఇటువంటి శాస్త్రాలను అభ్యసించేవారు చాలా అరుదు. వేదమును, శాస్త్రాలను బాగా తెలిసినవారుంటేనే మన భారతీయ హిందూ మతం నిలబడుతుంది. వేద పారాయణ చేస్తే చాలు వారికి పూర్వం రాజులు అనేకవిధాల సహాయపడేవారు. వారికి భూములు, గోవులు ఇచ్చి పోషించేవారు. నేడు అటువంటి పోషకులు లేక వేదమును చదివిన వారుకూడా బ్రతుకు తెరువు కోసం పురోహితులుగా మారిపోతున్నారు. పురోహితం కంటే వేదపారాయణ ఉత్తమమైనది. పురోహితులందరికీ వేదం పూర్తిగా రాదు. అందులో కొంత భాగం మాత్రమే వస్తుంది. దానిని "స్మార్తం" అంటారు. అంటే నిత్యం ఇళ్లలో జరిగే యఙ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి వీలైనంత వరకు మాత్రమే వస్తుంది. పురోహితులు వేదపండితులని ఆశ్రయించి, ఈ శాస్త్ర పండితులతో స్నేహం చేసి వారికి తెలియని విషయాలను తెలుసుకుని తమ యజమానులకు పంచుతూ ఉంటారు.

  శాస్త్ర పండితలు లేకపోతే ఆయా వేదమంత్రాలకు భాష్యాలను చెప్పేవారు ఉండరు. దాని ప్రాముఖ్యం ఏమిటో తేలుసుకొనలేము. వేదమార్గము ద్వారా నిత్య ఆనంద స్థితిని లేదా ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా పొందవచ్చో చెప్పేవారు ఉండరు. కనుక శాస్త్ర పండితుల అవసరం హిందూ సమాజానికి చాలా అవసరం. పూర్వం వేదమును, శాస్త్రాలను బ్రాహ్మణులందరూ నేర్చుకొనే వారు. కాల క్రమంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటున్నారు.  నేడు వేదపండితులకు, పురోహితులకు కూడా ఆదరణ కరువౌతున్నది. ఇక శాస్త్ర పండితుల అవసరమేమిటో కూడా నేడు ఎవరికీ తెలియదు. వారితొ ప్రత్యక్ష సంబంధాలు ప్రజలకు ఉండడం లేదు. ఆ పరిస్థుతులలో శాస్త్రాన్ని అభ్యసించడానికి ముందుకు రావడం నిజంగా చాలా ధైర్యముంటే గానీ చేయలేరు.  వారు పూర్తి విద్యనేర్చుకున్నాకూడా పోషకులు దొరకరు. అయినా వారు సాహసించి శాస్త్ర విద్య నేర్చుకొంటున్నారు.

కేవలం ఓ ఇంజనీరుకో, డాక్టరుకో ( విద్యనభ్యసించుటలో) సహాయ పడితే  వారు పెరిగిన తరువాత ఈ సమాజానికి మంచే చేస్తారన్న నమ్మకం లేదు. కానీ నేను చెప్పే ఈ శాస్త్ర విద్యార్థులవలన సమాజానికి చాలా మంచి జరుగుతుంది. మన శాస్త్రము మరొక తరం పాటు నిలిచి ఉంటుంది.

  కనుక వారికి రెండు సంవత్సరాలపాటు పోషకులు కావాలి. ప్రస్తుతం వారిద్దరకీ స్కాలర్ షిప్ వంటి ఆర్థిక సహాయం కావాలి. నేడు ఓ ఇంజనీరునో, డాక్టరు విద్యార్థినో ఎవరైనా ముందుకు వచ్చి చదివిస్తారు. కానీ ఇటువంటి శాస్త్ర విద్యార్థులను, వేద విద్యార్థులను పోషించాలంటే మన సనాతన విద్యపై అత్యంత నమ్మకముండాలి. ప్రేమ ఉండాలి. వీరిని చదివించడం కేవలం వరిఒక్కరికే సహాయ పడినట్లు కాదు. హిందూ సమాజానికే ఒక జ్యోతిని ప్రసాదించినట్లు. కనుక అటువంటి ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించ గలరు.  పూర్తి వివరాలు తెలియజేయగలను.



cell no : 9000532563

ధన్యవాదములు

17, ఏప్రిల్ 2011, ఆదివారం

తరచు స్పందించ లేక పోవచ్చు

నమస్కారం

బ్లాగు/అంతర్జాల మిత్రులకు నమస్కారం. నేను ప్రస్థుతం నా వృత్తికి, ఆధ్యాత్మిక జీవనమునకు సంబంధించిన లక్ష్యములలో మరింత సమయమును కేటాయించుటకొరకు నెట్ తీయించి వేశాను. కనుక బ్లాగులు, గ్రూపులు, మెయిల్స్ మొదలైన వాటిలో తరచుగా స్పందించక పొవచ్చును.  కానీ కనీసం వారానికి ఒకసారి తప్పక వస్తూఉంటాను.

బ్లాగును మామూలుగానె నడుపుతాను. మితృలు గమనించగలరు.

ధన్యవాదములు.