26, ఆగస్టు 2011, శుక్రవారం

నా గాయత్రీ జప దీక్ష పునః ప్రారంభం

నమస్కారం

ఆదివారం నుండి నా గాయత్రీ జపం ప్రారంభం. నలభైరోజులలో సాధ్యమైనంత ఎక్కువ జపం  చెయ్యాలని సంకల్పం. పోయిన సంవత్సరం సరిగ్గా ఇలాగే గణపతి నవరాత్రులలో ప్రారంభించి, ఆశ్వయుజ పూర్ణిమకు హోమంతో పూర్తి చేశాను. అప్పటి జపం నాలో చక్కటి మార్పును తీసుకువచ్చింది. ఇటు వృత్తిలోనూ మంచి స్థానాన్ని ప్రసాదించారు అమ్మవారు. చక్కటి అనుభూతులు సొంతం చేసుకున్నాను. అమ్మవారి అనుగ్రహంతో మరల ఈ సంవత్సరం కూడా చెయ్యడానికి సాహసిస్తున్నాను.

పెద్దలందరూ నా జపం చక్కగా కొనసాగి అమ్మదయ కలగాలని ఆశీర్వదించగలరు. జపం చేయాలంటే కేవలం శారీరక, మానసిక బలాలతో పాటు అమ్మదయ ఉండాలి. మనం ఊహించని అనేక శక్తులు  ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. అవన్నీ దాటుకుని నాజపం పూర్తిచేయాలంటే పెద్దల ఆశీర్వచనాలు, పిన్నల శుభకామనలు ఈ సమయంలో నాకు చాలా అవసరం.

ఒక్కసారి నాగురించి భగవంతుని ప్రార్థిస్తారు కదూ..! :)



( జపం జరిగే రోజులలొ నెను మెయిల్స్ కి అందుబాటులో ఉండకపోవచ్చు. )

ధన్యవాదములు,
బుధజన విధేయుడు,
రాజశేఖరుని విజయ్ శర్మ.