27, సెప్టెంబర్ 2011, మంగళవారం

హైదరాబాదు ప్రాంతం వారికి వనభోజనాలకు అనువైన స్థలం సూచించండి

నమస్కారం

కార్తీక మాసం వస్తోంది కదా! మరి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.  కానీ మంచి స్థలం దొరకడమే కష్టంగా ఉంది.

 వనభోజనాలు అంటే ఒక రోజులో ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేలాగ ఉండాలి. కాస్త ఆహ్లాదకరమైన చెట్లతో నిండిన ప్రదేశమై ఉండాలి. అది శైవ/వైష్ణవ సంబంధమైన దేవాలయ ప్రాంతమై ఉండాలి. కనీసం ఒక్క ఉసిరి చెట్టైనా ఉండాలి.  ఓ వందమందికైనా సరిపడ స్థలం ఉండాలి. మంచి నీటి సదుపాయం ఉండాలి.

ఇటువంటి ప్రాంతం భాగ్యనగరానికి అందుబాటులో ఉంటే తెలుపగలరు. భాగ్యనగరం శివార్లలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మీరేమైనా వెళ్లి వచ్చిన ప్రదేశాలు ఉంటే తెలియజేయగలరు.

--
ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ

12, సెప్టెంబర్ 2011, సోమవారం

శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం

ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే
లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం
అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ నమో నమః
స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ


చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ
సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక
ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి

ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం