4, జనవరి 2010, సోమవారం

మాంసాహారం తినడం అధర్మమా?

నేడు శాకాహారులు మాంసాహారులు అవుతున్నారు. మాంసాహారులు అనారోగ్యం పేరుతో శాకాహారులవుతున్నారు.

శాకా హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న వారికి బయటకెళ్లి తినటం అనేది జటిలంగా మరుతోంది. ఎక్కడ చూసినా మాంసాహార శాలలే కనిపిస్తున్నాయి. కాలేజీ ర్యాగింగులలో శాకాహారి అనేవాడు కనబడితే వాడు మాంసం ముట్టేదాకా వెధిస్తారు. ( ఈ స్థితి ఎప్పుడో దాటి పోయింది. ఇప్పుడు మందు, సిగరెట్, అమ్మాయిలు ఈ విషయాలలో సీనియర్స్ జూనియర్స్ కి వద్దుమొర్రో అన్నా నెర్పిస్తున్నారు. ) మనసులో శాకాహరిగా ఉందామని ఉన్నా చుట్టూ ఉన్న అనేక పరిస్థుతుల వల్లో, చుట్టూ ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది మాంసాహారులే ఉండడం వల్లో, జిహ్వ చాపల్యం వల్లో, ప్రలోభం వల్లో నేడు శాకాహారులందరూ మాంసాహారులవుతున్నారు. గుడ్డు మాంసాహారం కాదని దానిని శాకాహారంలో కలిపెసిన వారూ ఉన్నారు.

ఇటువంటి సందర్భంలో శాకాహారిగా జీవించడం ప్రశ్నార్థకమవుతున్నది.అసలు ఇంత కష్ట పడి శకాహారిగా జీవించడం అవసరమా? అసలెందుకు శాకా హారిగా జీవించాలి? మాంసాహారం తింటే ఏమిటి నష్టం? ఇలా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అలాగే మాంసాహారులు కూడా శాకాహారుల ప్రభావంతో ఆలోచనలో పడుతున్నారు. మాంసాహారులుగా ఉండడం మంచిదా? శాకాహారులుగా ఉండడం మంచిదా? అనే ప్రశ్నలు ఏదో ఒక సందర్భంలో రాకమానవు. మాంసాహారం మానలేక శాకాహారానికి రాలేక తాముచేసేది తప్పు అనే ఉద్దేశంలో సతమత మయ్యే వారూ ఉండవచ్చు.

ఇటువంటి పరిస్థితులలో శాకాహారులకు, మాంసాహారులకు అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏది మంచి, ఏది చెడు అని. ఇదే విషయం నేనాలోచిస్తే ఏది ధర్మం, ఏది అధర్మం అని ఆలోచిస్తాను. రెండిటికీ తేడా ఏమిటీ? అనుకోకండి. చాలా తేడా ఉంది. మొదటి రకంగా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలకు ఈ ధర్మాధర్మ విచక్షణ ద్వారా చాలా సులభంగా దొరుకుతుంది.

నాకో సందేహం ఈ శాకాహరం అనేది మనమే పాటిస్తున్నామా? మొదటి నుడీ శాకాహారాన్నే నియమంగా పెట్టుకుని ఉన్న శాఖలు/తెగలు ఇతర దేశాలలో ఏమైనా ఉన్నాయా?

ఇక మన విషయానికి వస్తే ఆహారం కోసం ఒక దానిపై మరికటి ఆధార పడడం ప్రకృతి ధర్మం. ఆహారం కోసం చెట్లపై ఆధారపడడం ఎంత సహజమో, జంతువులపై ఆధారపడడమూ అంతే సహజం. పూర్వ కాలంలో అందరూ మాంసాహారం తినేవారని పూరాణేతిహాసాల వలన తెలుస్తోంది. వశిష్టుడు మొదలైన వారికి శ్రాద్ధాది క్రతువులలో మధువు, మాంసాహారం ( మేక మాంసం ) పెట్టేవారు. సోమయాగంలో( ఆ సోమయాగం చేసినవారిని మత్రమే సోమయజి అనే వారు. ఇప్పుడు అందరూ అపేరు పెట్టుకుంటున్నారు. ) ఆ విధంగా చూస్తే మాంసాహారం తినడం అధర్మమేమీ కాదు.

అయితే మాంసాహరం తినవచ్చా? అంటే తినవచ్చు. మరి కొందరు ఎందుకు నిషద్ధం చేశారు?
ఇదే అందరూ ఆలొచించ వలసిన విషయం. మాంసాహారాన్ని ఎందుకు తినకూడదు అని ప్రశ్నించుకుంటే ఆ మాంసాహారాన్ని తినడం వలన రజో గుణం ఎక్కువ అవుతుంది. ( ఇదే కారణంతో కలియుగంలో బాహ్మలు, గురువులు మధుమాంసాలు తినరాదని శుక్రాచార్యుడు శపించాడు. ) శాకాహారం సాత్విక లక్షణాలు పెరుగుతాయి. ఈ రజోగుణం మనల్ని తప్పుదారిలో నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత చేటు. సాత్విక గుణం మనల్ని ధర్మాధర్మ విచక్షణ చేసే స్థితిలో ఉంచి ఙ్ఞానం వైపు నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.

అంటే మాంసం తినేవారికి ఈ సాత్విక గుణం లేదనా? ఎందుకు ఉండదు? తప్పక ఉంటుంది. కానీ దాని పాళ్ల ( levels ) లో తేడా ఉంటుంది. అలాగే శాకాహారం తినే వారిలో పూర్తిగా సాత్విక గుణాలు ఉంటాయనుకోవడం కూడా అపోహే అవుతుంది. ఎందుకంటే వారు రజోగుణానికి ఇతర కారకాలైన మద్యము, గుట్కా, జరదా, గంజాయి, ఉల్లిపాయలు ఇంకా అనేకమైనవి సేవిస్తూ ఉండవచ్చు. కనుక ఈ రజోగుణం ఎక్కువగా కలగకుండా ఉండటం కోసం మాత్రమే ఇటువంటివి మానేయవలసిన అవసరం ఉంది.

బ్రాహ్మలు ఇదివరకు విద్యకు పరిమితమై గురువులుగా ఉండే వారు. నలుగురికీ ఙ్ఞాన మార్గం బోధించ వలెను కనుక వారికి ఇటువంటివి నిషేధించడమైనది. అందువలన వారు ఎక్కువ సాత్విక ప్రవృత్తి ( positive attitude ) కలిగి ఉండి ఙ్ఞానాన్వేషకులై జీవించేవారు. ఇప్పటికీ సాత్వికాహారం తినేవారు చాలా మంచి గుణాలు కలిగి ఉండడం మీరు గమనించ వచ్చు.

ఇది నా దృష్టి కోణం మాత్రమే. ఇంకా చాలా విషయాలు వ్యాఖ్యల రూపంలో వస్తాయి. అవన్నీ చదివి ఏది సమంజసమో మీరే నిర్ణయించుకోండి.

48 వ్యాఖ్యలు:

 1. మీ శరీరధర్మానికి ఏది మంచి అనిపిస్తే అది మంచిది. అంతే!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. @ మహేష్,

   మన శరీర నిర్మాణం మాంసాహారం భుజించడానికి పనికి రాదు, వైద్యశాస్త్రం దృష్ట్యా ఇది పేర్కొనబడింది, అంతేగాక మాంసాహారం పూర్తిగా జీర్ణం అవడానికి సుమారుగా 72 గంటల సమయం అవసరం (ఆయుర్వేదం చెప్తోంది ).

   తొలగించు
 2. ఓ జంతువు వధించబడేప్పుడు, ఆ జంతువు శరీరం నుంచి కొన్ని విషపూరిత పదార్థాలు విడుదలవుతాయని, అంచేత మాంసం వర్జనీయమని ఒక వాదన ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మ౦చిదా కాదా అనేది మన ఆరోగ్య పరిస్థితికి అణుగుణ౦గా నిర్ణయి౦చవచ్చు.

  ఇక ధర్మమా కాదా అనేది చర్చి౦చ వలసినదే....

  ఉదాహరణకు ఒక పులి ఒక జి౦కను చ౦పి తి౦దనుకో౦డి, అది ధర్మమా కాదా? నా మటుకు స్థూల౦గా అది పులి ధర్మమే. ఇక న్యాయ౦ స౦గతికొస్తే, అది ఆటవిక న్యాయమే.

  ఇక విచక్షణా ఙ్ఞాన౦ కలిగిన మనిషి, ఇతర జ౦తువులను చ౦పి తినడ౦, స్థూల౦గా అధర్మమే, అన్యాయమే. కాని ఈ విచక్షణా ఙ్ఞాన౦ అన్నది variable, subjective and relative కాబట్టి మా౦సాహార౦(ఇదేకాదు, మరిన్ని అమానుషాలు) కొన్ని సార్లు ధర్మ౦ కావచ్చు, కొన్ని సార్లు కాకపోవచ్చు. ఏయే స౦దర్బాల్లో ఏది ధర్మమో, ఏది అధర్మమో ఈ చర్చకు వదిలేస్తున్నా.

  కాకపోతే ఒక్కటి మాత్ర౦ చెప్పదల్చుకున్నాను, గుడ్డును శాఖాహార౦ చెయ్యట౦ మాత్ర౦ బూటక౦.
  తినేవాళ్ళూ తిన౦డి, కానీ తినేసి అది శాఖాహారమనట౦ అనైతికమనిపిస్తు౦ది. వీళ్ళు అసలు సిసలైన హేతువాదులు. వీళ్ళు ఎవ్వరి మాటా వినరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కొంత మంది సోమవారం నాడు, శనివారం నాడు నాన్ వెజ్ తినరు కానీ మిగితా రోజుళ్ళో మాత్రం కక్కుర్తి పడి నాన్-వెజ్ తింటారు. వ్యవసాయం ఎక్కువగా ఉన్న మన దేశంలో నాన్-వెజ్ తినడం అనవసరమే. అల్జీరియా లాంటి సహారా ఎడారి దేశాలలో ఎడారిలో పెరిగే ఒంటెలు, కొన్ని జాతుల మేకలు, గొర్రెల మాంసం ప్రజలు రోజూ తింటారు. మన ఇండియాలో నాన్-వెజ్ తినాల్సినంత contrary geographical conditions లేవు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. గాంధీ జయంతినాడు ఇడ్లీలో చికెన్ నంజుకుని మాంసాహారం తిన్నందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గతంలో ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాంధీ జయంతినాడు మాంసాహారం భుజించడం తప్పేనని అందుకు శిక్షగా వచ్చే గాంధీ జయంతి వరకు తాను మాంసాహారం తినబోనని ఆయన ప్రతిజ్ఞ చేశారు.కొన్ని రోజులను మాంసాహారానికి నిషిద్ధ దినాలుగా ప్రభుత్వం ప్రకటించిందికానీ శాహాహారంపై ఎలాంటి షరతులూ లేవు.
  జంతువుల నుండి లభించే పాలనుండి అనేక ఆహారపదార్ధాలను ఉపయోగిస్తూ ఉంటారు.పెరుగు,జున్ను,చీజ్,పనీర్,యోగర్ట్,వెన్న,నెయ్యి మొదలైనవి పాల నుండి తయారు చేసే ఆహారాలు. తేనెటీగలు తాయారు చేసే తేనెను ఆహారంలో చేర్చుకుంటూ ఉన్నారు.చేపలు,పాములు,పక్షులు,గుడ్లు,రక్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది.ను,ఎలుకలు, ఉసుళ్ళు మొదలైన కీటకాలను ఆహారలో చేర్చుకోవడం అలవాటే.
  అన్నం పరబ్రహ్మ స్వరూపం.దానాలలో శ్రేష్టమైనది అన్నదానం.పరిచయస్తులకు కాఫీ,టీ లనైనా అందిచడం సంప్రదాయమే.పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు జలపుష్పాలుగా పరిగణిస్తారు.కాశ్మీర్‌లో బ్రాహ్మణులు పాక్షిక మాంసాహారులు.శాకాహారులు కోడిగుడ్లను శాఖాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.
  యజ్ఞయాగాల్లో గోవధ, గోమాంస భక్షణ అనేది మన దేశంలో చాలా ప్రాచీన కాలంనుంచే వుంది..పాకిస్థాన్‌లోని షిన్‌ తెగకు చెందిన ముస్లింలు ఆవు మాంసాన్ని కూడా పంది మాంసంలాగే ఏవగించుకుంటారు..గోమేథ లేదా అశ్వమేధ యాగాల్లో గోవును లేదా గుర్రాన్ని బలి ఇచ్చేవారు..వేదాలలో మొత్తం 250 రకాల జంతువుల ప్రస్తావన వుంది. వాటిలో 50 రకాల జంతువులు పవిత్రమైన బలికి, మానవ వినియోగానికి అర్హమైనవిగా పేర్కొన్నారు. తైత్తరేయ బ్రాహ్మణంలో వాస్తవానికి ఆవు మన ఆహారం (అథో అన్నం వాయ్‌ గోవః) అని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. సుతపథ బ్రాహ్మణంలో యజ్ఞవల్క్యుడు లేత ఆవు మాంసాన్ని కోరడం గురించిన ప్రస్తావన వుంది..ఉత్తర క్రియల్లో (దశదిన కర్మ) భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు యిచ్చేవారు. ఆరోజు సమర్పించే జంతువుల స్థాయిని బట్టి పితృదేవతల సంతృప్తి ఆదారపడి వుంటుందని నమ్మేవారు. (ఋగ్వేదం X.14-18), అధర్వణ వేదం X 11.2, 48).రంతిదేవుని వంటగదిలో అనేక ఆవులను వధించి బ్రాహ్మణులకు ధాన్యంతో పాటు మాంసం పంచేవారు.- (డి.ఎన్‌. ఝా Paradox of the Cow : Attitudes to Beef Eating in Early India, D.N.Jha ప్రొఫెసర్‌ ద్విజేంద్ర నారాయణ్‌ ఝా ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర బోధకులు). హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ప్రథమ ముద్రణ: 2002.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చాలా మంచి సమాచారం ఇచ్చారు. 'నిషేధం' అంటూ హిందువులకు ఏ ప్రవక్త నిషేధించలేదన్నమాట! బాగుంది. అందుకే హైందవం అన్నది మతం కాదు, జీవన విధానం అంటారేమో. అలాంటి నిషేధాలన్నీ వివిధ జాతుల కుటుంబ సాంప్రదాయాలు. శాఖాహారం అన్నది ఆయా జాతుల ఎంపిక.
   అలాగంటే సారా తాగడం కురాన్లో నిషేధించారట, అలాగని పాకిస్థాన్, బంగలాల్లో నిషేధించారనుకుంటే మనం పప్పులో లెగ్ వేసినట్టే. :)

   తొలగించు
 6. "శాకా హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న వారికి బయటకెళ్లి తినటం అనేది జటిలంగా మరుతోంది" నిజమేనండీ !!
  నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. నలుగురితో కలసి పార్టీ లకు వెళ్ళాలంటే
  నా వల్ల వారికి, వారి వల్ల నాకు ఇబ్బంది.
  ఏదన్న వెజ్ ఆర్డర్ చేస్తే దానిలో ముక్కలు తీసేసి తీసుకోస్తారని అనుమానం ఒక్కటి.
  @ రవి గారు: కరెక్ట్ చెప్పారు.
  ఒక జంతువును చంపే సమయం లో అది తప్పించుకుని పోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆ సమయం లో కొన్ని హార్మోన్లు దాని రక్తం లో కలుస్తాయి.
  అలా హార్మోన్లు విడుదల కావడం తో దానికి ఎక్కడలేని శక్తి వస్తుంది. ఆ
  శక్తి, అది తప్పించుకుని పోవడానికి సహకరిస్తుంది.
  ఈ హార్మోనులు రక్తం లో కలవడం వల్ల , ఆ జంతువును సేవించిన వారికి ఉద్రేకము కలుగుతుంది.
  దాంతో అధిక రక్త పోటు వచ్చే అవకాశంలు ఉన్నాయ్
  ఉదా : మనల్ని ఎవరన్నా కొట్టడానికి వస్తే మనం ఎంతో ఆందోళనకు గురి అవుతాం. నడవ లేని స్తితి లో ఉన్నా పరుగు పెట్టడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు మనకి కూడా హార్మోనులు విడుదల అయ్యి మరింత శక్తి వస్తుంది.
  ----అప్పారావు శాస్త్రి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పచ్చిమాంసం తింటే... ఆ హార్మోనులు వల్ల ఏదైనా అవుతుందేమో. జంతువులు వేటాడి తెనేటప్పుడు హార్మోనులు స్రవిస్తాయేమో కదా, మరి వాటికేమీ అవ్వడం లేదే!

   తొలగించు
 7. బైటకి వెళ్ళి శాఖాహారులు తినడానికి ఇబ్బంది పడుతున్నారు అనే మాటా అవాస్తవం, తినాలనుకుంటే ఎక్కదైనా యే రకమైన ఆహారమైనా దొరుకుతుంది, ఇక్కడ ఎవరి ఇష్టం వారిది, ఆహారం శరీరానికి సంబంధించిన విషయం, తినే వస్తువుని ఆహరం అని మనం అనుకోగలిగితే ఏది తిన్నా తప్పు లేదు, అక్కడ ధర్మాధర్మాలకు తావులేదు. అది చూసే దృష్టిని, మన ద్రుక్కోణాన్ని బట్టి ఉంటుందని నా అభిప్రాయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. టపా పూర్తికాక మునుపే పొరపాటున ప్రచురించడం, దానికి అపుడే వ్యాఖ్యలు కూడా రావడం జరిగింది. ఈ పై వ్యాఖ్యలు నేను టపా పూర్తిగా రాయక మునుపు వచ్చినవి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. రవి గారి వ్యాఖ్య వల్ల, దానికి అప్పారావు శాస్త్రి గారి వివరణ వల్ల నాకు మాంసాహారం తింటే రజో గుణం ఎలా ప్రబలుతుంది అనేదానికి సైన్స్ పరమైన చక్కటి ఉదాహరణ లభించింది అందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. వెజిటేరియన్ తిన్నా, నాన్-వెజిటేరియన్ తిన్నా శరీరంలో ప్రొటీన్లూ, కార్బోహైడ్రేట్లూ రెండూ ఉత్పత్తి అవుతాయి. కాకపోతే నాన్-వెజ్ సరిగా అరగదు. డాక్టర్లు నాన్-వెజ్ తినొద్దు అని చెప్పడానికి ప్రధాన కారణం ఇదే.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ప్రస్తుతం డాక్టర్లు ప్రొటీన్ల కోసం సోయా చిక్కుడు ను మంచి ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు.కిలో మాంసంలో ప్రొటీన్లు 220 గ్రాములుంటే సోయా చిక్కుడులో 440 గ్రాములున్నాయట.పైగా కొలెస్టరాల్ కూడా ఉండదట.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఢిల్లీలోని అక్షరధాం లో నేను చూసిన ఒక బోర్డుపై జార్జి బెర్నార్డ్ షా చెప్పినది అనుకుంటా ఈ విధంగా ఉంది.
  "I dont want my stomach to become graveyard for some animals"

  ప్రత్యుత్తరంతొలగించు
 13. రహమతుల్లా గారు : మికు హిందూ పురాణాలకు సంబంధించిన చాలా విషయాలపై అవగాహన ఉన్నట్టున్నది. నాకు మీ ఖురాన్ గురించి గానీ సాంప్రదాయాల గురించి గానీ బొత్తిగా అవగాహన లేదు. ఈ విషయంలో మిమ్మల్ని అభినందించాలి.

  ఆదిత్య గారు: శాకాహారులు ఎందుకు ఇబ్బంది పడటం లేదండీ. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇడ్లీ, పూరీ లాంటివి దొరుకుతాయి కానీ, అన్నం తినాలంటే మాంసాహార-శాఖాహార భోజన శాలలె ఎక్కువ కనిపిస్తున్నాయి. వంట వాళ్లు ఎలాంటి గిన్నెలో వండుతున్నాడో ఏమాంసం గిన్నెలో ఏ తోటకూర పప్పు పోపుపెడుతున్నాడో అని తినకుండా పస్తులుండే వాళ్లు చాలా మంది ఉన్నారు. విడిగా ఉండే కేవల శాఖాహార భోజన శాలలు ఇప్పుడు చాలా తగ్గి పొయాయి.

  ఆ బాధితులలో ఒకరు పైన వ్యాఖ్యరాసిన అప్పారావు శాస్త్రిగారు ఒకరు. మీరు చదవలెదనుకుంటా వారి వ్యఖ్యని. ఇంతకంటే నిదర్శనమేమి కావాలి? మి అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మనం వెళ్ళే ప్రతీ చోటా అలానే ఉంటుందని అనుమానపడుతుంటాం, అయినా నా అభిప్రాయంలో "ఇక్కడ ఎవరి ఇష్టం వారిది, ఆహారం శరీరానికి సంబంధించిన విషయం, తినే వస్తువుని ఆహరం అని మనం అనుకోగలిగితే ఏది తిన్నా తప్పు లేదు" అనే విషయాన్ని ప్రస్తావించాను @ అప్పారావు శాస్త్రిగారు అనుమానపడుతున్నారు, బహుసా ఆయనకి ఎప్పుడొ ఒక చేదు అనుభవం ఎదురై ఉండాలి, అన్ని చోట్లా అలా ఉంటుంది అనుకోవడం, తినడానికి ఇబ్బంది పడడం పిచ్చితనం అవుతుంది. ఇందులో ధరాధర్మాలకు తావు లేదు అంతా మనం కల్పించుకునేవే.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. రాజశేఖరుని విజయ్ శర్మగారూ
  మీ ఖురాన్ నా వేదం అనకండి.అన్ని మతలేఖనాలు అందరివీ.
  నేను అన్ని మతాల లేఖనాలూ చదువుతాను.ఈ జన్మకీ మతం.పూర్వజన్మలో ఏమతంలో పుట్టానో,వచ్చే జన్మలో ఏ మతంలో పుడతానో గదా?మంచి ఏ మతంలో ఉన్నా స్వీకరిద్దాం.చెడును తిరస్కరిద్దాం.మంచిచెడ్డలు రెండే మతములు అన్న గురజాడ సూక్తి అనుసరణీయం.మానవత్వమే ఉత్తమ మతం.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. రహమతుల్లా గారు: క్షమించండి. నాదీ అదే భావన. నాదీ , మీదీ కాదు మనందిరిదీనూ ఆ అపూర్వసంపద. నాకు చిన్నప్పటి నుండి ఖురాన్, బైబుల్ ను చదవాలని ఆసక్తి . దానికి సరళమైన వ్యాఖ్యతో ప్రారంభకులకు సులభతరంగా ఉండేవి ఏమైనా సూచించ గలరా? తెలుగు లో..

  మాదవ్ గారు: మీ తరువాతి వ్యాఖ్యలో "పిచ్చితనం " అనడానికి బదులు "అమాయకత్వం" అని ఉంటే మరింత సౌమ్యం గా ఉండేది. చర్చ అనేది ఎల్లప్పుడూ సానుకూల వాతావరణంలో జరిగితేనే మంచిది.

  నేను ఈ టపాలో ఎవ్వరి వ్యాఖ్యలను ఖండించడం గానీ బలపరచడం గానీ చేయలేదు. అలాగే మీ అభిప్రాయం మీది. ఈ విషయంలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అందుకే మీ వ్యాఖ్యలో కూడా కొంత వరకే ఊటంకించి మిగతాది వదిలి వేశాను.
  మన అందరి అభిప్రాయాలూ క్రోడీకరిస్తే సందేహంలో ఉన్నవారికి ఓ సరైన నిర్ణయం తీసుకునే వీలుంటుంది అనే ఉద్దేశంతో రాసినది మాత్రమే ఈ టపా.


  మీరు మరో సారి ప్రస్థావించారు కాబట్టి చెబుతున్నాను.

  ధర్మము అధర్మమూ అనేవి ప్రతివిషయంలోనూ ఉంటాయి. కాకపోతే మీరు వాటిని మంచి,చెడు అనవచ్చు, మరొకరు మరో విధంగా అనవచ్చు. కానీ ప్రతీ పనిలోనూ మన పూర్వీకులు చేశారని దానిని గుడ్డిగా అనుసరించడామో, లేదా పుక్కట పురాణాలనీ, ఏదో కొందరి స్వార్థం కొసం రాసుకున్న ధర్మాలని వ్యతిరేకించడమో చేయడం కాక అది ఎందుకు మన పూర్వీకులు అలా చేశారు?, మనం అలానే చేయడం ఎంతవరకు ఆవశ్యకం?, ఇప్పుడు మనం అనుసరిస్తున్నదేమిటి? పాఠించవలసిన విధానమేమిటి? అని మనల్ని మనం ప్రశ్నించుకుని, మంచీ, చెడూ ఆలోచించి చేయడం ధర్మం.

  ధర్మం అనేది దేశ కాల పరిస్థుతులను బట్టి మారుతూ ఉంటుంది. దానిని తెలుసుకోవాలంటే చరిత్ర గురించిన అవగాహన, ప్రస్థుతం గురించిన విశ్లేషణ, వీటన్నిటినీ మించి సాటి వ్యక్తుల పట్ల ప్రేమ, అహం కారం లేని వ్యక్తిత్వం మొదలైనవన్నీ అలవరుచుకోవాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. నేను నా వ్యాఖ్యలో ఎవరినీ కించపరచలేదు ఒకవేల మీకలా అనిపిస్తే నా వ్యాఖ్యని తొలగించండి.
  నేను వాడిన "పిచ్చితనం " అనే మాట సరైయిన పదం అని నాకు అనిపించింది.
  నేను మాట్లాడింది ధర్మాధర్మాల గురించి కాదు, ఏది తినాలి ఏది వద్దు అనే దాని గురించి మాత్రమే, ధర్మాధర్మాలా గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు ఈ టపాలో (అది మంచి-చెడు అయినా గాని)అని నా ఉద్దేశం.
  మనల్ని మనం ప్రశ్నించుకుంటే సమాధానం వస్తుంది, దాని ప్రకారం నడుచుకోవడమే. మనం చేయవలసిన పనిని సక్రమముగా నిర్వర్థించడమే ధర్మం అని నా అభిప్రాయం. అది ఏ విషయమైనా కావచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. నేను నా వ్యాఖ్యలో ఎవరినీ కించపరచలేదు ఒకవేల మీకలా అనిపిస్తే నా వ్యాఖ్యని తొలగించండి.

  మీరెవరినీ కించ పరచలేదండీ, కానీ మరికొంత సౌమ్యంగా రాయవచ్చు అన్నానంతే. మాటలలో పరుషత్వం పెరిగే కొద్దీ చర్చ దారిమళ్లుతుంది.అందుకే అలా చెప్పాను. అన్యదా భావించకండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. చూడండిః
  1.http://www.teluguislamiclit.org/Quran/quran.html
  2.http://f1.grp.yahoofs.com/v1/gPFCS5vWNCBgWNsVcAUzx0dgqCydH9ZyXHw3RYaq9zcMO09jtFV0oAv4Af2GUbcPEqoHFDPeo8zONgR8oRNZ2RZy_uku_kDY7jyX/QuranBhavamrutham.pdf

  ప్రత్యుత్తరంతొలగించు
 20. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతాయంటారు.
  జన్మత: మనకేది అలవాటయితే అదే జీవితాంతం కొనసాగిస్తాం. మనకి ధర్మ మయినది మరొకరికి కాకపోవచ్చును. అంత మాత్రం చేత అది అధర్మం అయిపోదు కదా.పురాణేతిహాసాలు మనకు ఒక సన్మార్గాన్ని, ఒక జీవనవిధానాన్ని ఇస్తాయి అని మనం నమ్ముతున్నాం.వీటిలో మాంసాహారం అధర్మం అని ఎక్కడా చెప్పలేదు. మాంసాహారం శరీర తత్వానికి మంచిదికాదని ప్రస్తావన ఉంది.యజ్ఞ యాగాదులలో మాంసాహారం ఋషులు సేవించినట్లు ఆధారాలు కూడా లభ్యం.
  అయితే ఈ మధ్యకాలమ్లో మాంసాహారం త్యజించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
  ఇది మంచి పరిణామం.
  కానీ ఈ ధర్మాధర్మాలకి అతీతంగా ఒకటుంది.
  అది మానవ ధర్మం.
  ఒక జీవిని పుట్టించలేని అసమర్ధులం, మనకు చంపే హక్కెక్కడిది? వీటిని మనం సృష్టించామా? మనమంతం చేయడానికి.
  సాటిజీవులపట్ల సానుభూతి మనకి కరవయిపోతోంది.
  ఉదా: ఒకసారి బొల్లోజు బాబా గారి బ్లాగులో అంతరించి పోతున్న పులస చేపలపై ఒక కవిత వ్రాసారు.ఇది మానవుని నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఈ పరిస్థితి రాబోయే తరాల్లో మరిన్నిజీవులకు కూడా వర్తిస్తుంది అనడం లో సందేహం లేదు. ఇది ప్రకృతి ధర్మం...చిన్న చేపను పెద్ద చేప చంపాల్సిందే..అనేవారికేం చెప్పలేం.
  ఈ టపా ఎవరి మనోభావాలని నొప్పించాలని కాదు.
  అభ్యంతరమనిపిస్తే తొలగించవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. "ఒక జీవిని పుట్టించలేని అసమర్ధులం, మనకు చంపే హక్కెక్కడిది? వీటిని మనం సృష్టించామా? మనమంతం చేయడానికి."

   చెట్లు, మొక్కలు కూడా జీవులే. మీ మాటలు వీటికి కూడా అన్వయిస్తే?

   తొలగించు
  2. అజ్ఞాత మరి మీరు ఏంతింటారు?!! :-?

   తొలగించు
 21. ప్రత్యుత్తరాలు
  1. స్వామీ వివేకానందాగారి కడుపు పెద్ద గోతాం. అందులో షాడ్ చేపలు, తాబేళ్ళు, చికెన్, అన్నీ పడతాయి. డంబాచారి. దీనిగురించిన సాక్ష్యాలు చదవాలంటే ఆయన సంపూర్ణ రచనలలో నే దొరుకుతాయి. ఓపికలేకపోతే వివేకానందవైబి.బ్లాగ్ స్పాట్.కాంచూడండి. తెల్లనివన్నీ పాలూ కావు, నల్లని వన్నీ నీళ్ళూకావు.

   తొలగించు
 22. ఆ మాట అన్నది జార్జి బెర్నార్డ్ షా అంట కదా? http://saakaahaaram.blogspot.com/

  ప్రత్యుత్తరంతొలగించు
 23. ఆలస్యం గా రాలేదనుకుంటాను ...చర్చలో పాలు పంచుకొనే అవకాశం కల్పించిన విజయ్ గారికి ధన్యవాదాలు.

  మాంసమునకు, మధ్యమునకు నిష్ఠ యొక్క దృష్టి చెడగొట్టే లక్షనాలున్నయంటే నేను నమ్ముతాను. ఎందుకంటే తినడం మానుకోవాలని మాంసం తినడం మానని చాలా మందిని నేను చూసాను. ఇక మద్యం సంగతి సర్వత్రా విదితమే (మద్యం ఈ చర్చలో భాగం కాక పోయినా ప్రస్తావించాలని పించింది అంతే... అన్యధా భావించకండి ). అతిగా తింటే ఆరోగ్యానికి ఏదీ మంచిది కాదు, అది శాఖమైనా లేక మాంసపు వంటకమైనా.. తినడానికి బ్రతికేవారుంటారు.. బ్రతకడానికి తినే వారుంటారు. నా మటుకు నేను రెండో రకాన్నే... మానవునికి ముందు మొక్కలు కనిపించి ఉంటాయి.. తిన్నాడు..తరువాత రుచికోసం, లేక తప్పని స్థితిలోనో జంతు మాంసాన్ని ఆశ్రయించి ఉంటాడు అనే వారి మాట నేను ఆమోదించకుండా ఉండలేను . మాంసము తింటే వచ్చే లక్షణాలు నాకు తెలియదు కానీ.. ధర్మా ధర్మములు కూడా నాకు తెలియవు.. ఒక ప్రాణిని మనం తినడం కోసం చంపడం మటుకు సరైనది కాదు. అక్కడే మనిషిలోని చెడు లక్షణాలు బయటకు వస్తున్నై కదా మరి. మనకు బ్రతికే అవసరం, హక్కు ఎంత ఉందొ వాటికి కూడా అంతే... దీనికి ముఖ్య కారణం మాత్రం జిహ్వ చాపల్యమే అని నిస్సందేహం గా చెప్పవచ్చు. రుచులను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే... అవి ఇవీ తింటే నా ఆరోగ్యమేగా పోయేది నీకేం పోయే ... అనే వాదనలు ఉన్నాయ్. వారికి నాదొక్కటే మనవి. మీ ఆరోగ్యం మీ ఒక్కరిదే కాదు. మీ వారందరిదీ...నాకు chips అంటే పిచ్చి నేను ఇక మీదట chips తినను అని ప్రమాణం చేసుకున్నాను. ఎందుకంటే అందులో cancer కారకాలు ఉన్నాయట... ఇక మీదట ఈ చర్చ ముగిసిన తరువాత గుడ్డు కూడా తినను (తినడం మానేస్తాను )ఇదే నా ప్రమాణం ... మాంసం అయినా మరేదయినా ఆరోగ్యం చెడిపోయే దాక వచ్చిన తరువాత మానేస్తే ఏం లాభం. జీవహింస మహా పాపం. చర్చలో పాల్గొన్న ప్రతి వోక్కరు చక్కటి అభిప్రాయలు వెలిబుచ్చారు. అభినందనలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 24. ఇక మీదట ఈ చర్చ ముగిసిన తరువాత గుడ్డు కూడా తినను (తినడం మానేస్తాను )ఇదే నా ప్రమాణం ...

  శివ గారు: ఈ టపా మిమ్మల్ని ఆలోచింప చేయడమే కాక, ఆచరించాలి అనుకునే టట్టు కూడా చేసింది. అందుకు చాలా ఆనందం.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. ప్రాణం మాట కొస్తే, పచ్చటి కూరల్లోను ప్రాణముంది, తెగ కోసిన మాంసంలోను ప్రాణముంది. మొక్కలని ఎలా పెంచుతున్నారో, మాంసాహరం కోసం పశు పక్షులని కూడా వ్యవసాయం చేస్తున్నారు అంతే గాని కౄరంగా వేటాడి ఏమి తినటం లేదు కదా? కూరల్లో విటమిన్లు, మాంసంలో ప్రోటిన్లు వున్న విషయం అందరికి విదితమే. ఏదైనా మితంగా తీసుకుంటే ఒంటికి మంచిది. బెంగాల్ పూజారులకి చేప జల పుష్పం. ఆది తినే వారు పూజలు నిర్వహిస్తారు. చర్చ్ ఫాదర్ కి ద్రాక్ష సారాయి పవిత్రం. మాంసాహారం తిని, ద్రాక్ష సారాయి సేవించే ఆయన ప్రార్ధనలు నిర్వహిస్తారు. కాని మనం మాత్రం మాంసం తినే పూజారులని అంగీకరించలేము. గేదె నుంచి వచ్చిన పాలు పవిత్రం, షాకాహారం ఐనప్పుడు, కోడి గుడ్డు షాకాహారమే అనేది కొందరి వాదన. నాకు ఆశ్చర్యం కలిగించే నేను విన్న రెండు వాదనలు. ఒకటి, మాంసం హీనం అట, మధ్యం మధురమట. అది ఎలాగా? మద్యం మతినే చెడగొడుతుందే? చావుకు కూడా చేరుస్తుందే? రెండోది, కోడిని తినే వాడు, పాముని, కుక్కని, పందిని తినేవాడిని అసహ్యించుకోటం. అది ఎలాగా? జంతువు ఎదైనా జంతువే కదా? మాంసాహారం రజో గుణాన్ని, షాకాహారం సాత్విక గుణాన్ని పెంపొందిస్తుంది అన్న దాన్ని, ఇతర పదర్థాలతో, జీనాలజి తో, ప్రాంతియ తేడలతో, ఎన్నో రకాల ప్రాబబిలిటి టెస్టులు నిర్వహించి మాత్రమే కనుక్కోగలం. --Vijaya

  ప్రత్యుత్తరంతొలగించు
 26. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. అవునండీ. ఇది కూడా నాకు సంతృప్తికరంగా అనిపించడం లేదు. ఆలోచిస్తున్నాను. ఏదైనా ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను ఉండే పేరుకోసం.

  ఎవరైనా సూచిస్తారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 28. "శాకాహారం తినే బతకవచ్చు" అని విన్నా కాని, ఎక్కడైనా మంసహరమే తిని బతకవచ్చని చదివారా? నాకు తెలియక అడుగుతున్నా, ఎవరైనా విన్నవించ గలరు..

  ప్రత్యుత్తరంతొలగించు
 29. What I feel is now a days vegetarians become non-vegetarains influenced by these non-vegetarians.Mostly the youth who stay away from Home tend to try it and once they get habituated they can not avoid it.So if you have "nigraham" you can be a vegetarion even though you don't find vegetarion food.I am staying in Germany for two years and here very rarely we find vegetratin food but still I managed to be a vegetarian.So if we want to be a vegetarian nothing can stop us from being a veggie.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. కేవలం శాకాహారము మాత్రమే తిని బ్రతక వచ్చా అని ప్రశ్నించారు. కూరలు (అంటే green vegitables ) విడి గా తింటూ ప్రతి నిత్యమూ ఏదో ఒక విధమైన మాంసాహారము తినకుండా విదేశాలలో 99 % మనుషుల ఆహారము ఉండదు. అంచేత, శాకాహారమా, లేక మాంసాహారమా అన్నది, ఈనాడు ఒక వ్యక్తిగత విషయము గా మారి పోయింది. అన్నీ దొరికినా, శుద్ధ శ్రోత్రియ కుటుంబము నుంచి వచ్చిన ఎంతో మంది వ్యక్తులు మధు మాంస భక్షణ చెయ్యడం నేను చూశాను. అలాగే, ఏదీ దొరకక పోతే నిట్రుపవాసము ఉన్న వ్యక్తులనీ చూశాను. వీరు తినలేరు. వారు మానలేరు. ఎవరి కారణాలు వారివి. తిరుగుబాటు చేసే ఆత్మని సంతృప్తి పరచుకోడానికి యేవో కారణాలు, దృష్టాంతాలు అన్నీ వెతకటం నైజం.

  మరొక విషయం, అన్నీ ఒకే గిన్నె లో వండి ఉంటారు అని. బయటకు వచ్చాక మన ఇంటి ఆచార వ్యవహారాలు ఎలా కుదురుతాయి. భారత దేశము లో కొంతవరకైనా కుదురుతాయి. లేకపోతె వొకపూట మానేస్తాము అనుకోవచ్చు. విదేశము లలో నివసించేవారికి తప్పదు, అంచేత ఆ ఆలోచన కూడా రాదు :)

  బుధజన విధేయుడు

  సీతారామం

  ప్రత్యుత్తరంతొలగించు
 31. meat eating was there in Vedas!!! because of the BUDDHA...taught no violence....and its because...Buddhism flourished for more than 1000 years in INDIA,and for the brahmins.. to get back the hindu stuff,,,they started...vegetarianism. i worked for 1000 years!! why dont we take it in our religion????

  you can see this more in south indian brahmins more than in north indian brahmins....Buddhism was strong in south india...and it preached vegetarianism. the original brahminism never told anything against meat eating...and it should be so...because..it is very nourishing and filling the life cylce!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 32. మరొక్క విషయం ప్రతీ జీవి ఆహారం కోసం ఏదోఒక దానిపై ఆధారపడక తప్పదు. కానీ మానవునికి మనసు, బుద్ధి ఉన్నాయి. ఇది బాధ, ఇది హాయి అని తెలుస్తుంది. అతనికంటే క్రింది స్థాయి ద్విపాద జంతువులు, అంతకంటే చతుష్పాత్తులు( నాలుగు పాదాలున్న వి) , అంతకంటే పాదపములు ( మొక్కలు ) మొదలైనవి బాధను పొందడంలో క్రింది స్థాయివి.  మనకున్నంత బాధ బర్రెను కొడితే దానికి కలుగుతుందా? కలుగదు. అలాగే బర్రెకు కలిగినంత చెట్లకు కలుగదు. కనుక బాధను పొందడం అనేది చెట్లకు అతి స్వల్పం. వివేకం కలిగిన మానవునిగా బ్రాహ్మణుడు చెట్లపై ఆధారపడడం అతను పొందిన ఙ్ఞనానికి గుర్తు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. /మనకున్నంత బాధ బర్రెను కొడితే దానికి కలుగుతుందా? కలుగదు. అలాగే బర్రెకు కలిగినంత చెట్లకు కలుగదు./
   !! బర్రెను, గొర్రెను కొడితే/నరికితే వానికి బాధ కలగలేదని మనకెలా తెలుస్తుంది?!!

   తొలగించు
 33. శ్రీ రాఘవ గారి వ్యాఖ్య :

  ఈ శాకాహారమన్నది ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించిన కాలంలో వచ్చిన ఒక పడికట్టు. తత్పూర్వం మనం శ్రీమద్భగవద్గీతలో భగవానుడు చెప్పినట్టుగా సాత్వికాహారం రాజసికాహారం తామసికాహారం అని చెప్పుకునేవారం.

  Vegetarian అన్నది అప్రాచ్యులలో ఉన్న వాడుక. వారి vegetarian కీ మన సాత్వికాహారానికీ సామ్యమెక్కువ. నాటి కాలమానపరిస్థితులలో మనకు ఆంగ్లంమీద ఉన్న మోజు వలన... తరువాత తరువాత ఈ సాత్వికాహారం అన్న మాటను మఱచిపోయామనే అనుకోవాలి. ఆ vegetarian పదాన్ని దృష్టిలో పెట్టుకునే శాకాహారం అన్న వ్యవహారం మొదలయ్యింది. ఐతే, non-vegetarian కు మనం అశాకాహారమని కాక, మాంసాహారమని పిలుచుకోవటం మొదలుపెట్టాం.

  పరిస్థితి ఇలాగే వదిలివేస్తే, ఈ మధ్య క్రొత్తగా ప్రబలిన eggitarian వంటి పదాలను చేర్చుకోవటం కోసం, కొంత కాలానికి శాకాండాహారమనీ మఱొకటనీ పేర్లు పుట్టుకువచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!

  ప్రత్యుత్తరంతొలగించు
 34. తాడేపల్లి హరి గారి అభిప్రాయం

  >> మనకున్నంత బాధ బర్రెను కొడితే దానికి కలుగుతుందా? కలుగదు.


  ఇది అతి వివాదాస్పదము. పక్ష్యాదులు కూడా మనుష్యులంత సమానంగా బాధ, ప్రేమ, సహజీవనము ఇత్యాదిగా మనుష్యులకే ప్రత్యేకాలనుకునే భావాలని చూపించగలవు. చివరికి కేంద్ర నాడీ మండలము లేని చెట్లు కూడా సుఖదు:ఖాలని అనుభవించ గలవని కొన్ని శాస్త్రీయ ప్రయోగాల ఫలితంగా వెల్లడించారు.

  ఒక మనుష్యేతర జీవాన్ని వధించి తినడానికీ, తోటి మనుష్యులని వధించ డానికీ మధ్యన వున్న తార్కిక వివేచన బహు పలుచన. జంతువులని చంపి తినడానికి అలవాటు పడిన సామాజిక వర్గాలు, దేశాలల్లో యుద్ధ విజిగీష ఎక్కువ.
  వసిష్టుడూ, అగస్త్యుడూ, ధౌమ్యుడో మాంసం తిని ఉండ వచ్చుగాక. ఆ దేశకాల పరిస్థితులతో మనకి పరిచయమూ లేదు, ప్రాస్తుత్యమూ లేదు. మనమెరిగి ఉన్నంత వరకూ మన ౨౦౦౦ సంవత్సరాల నాటి పూర్వులు కూడా శాకాహారు లేననడానికి చాలా నిరూపణ వుంది. బ్రాహ్మణులు మాంసం తినేవారనడానికి వున్న నిరూపణ అతి స్వల్పం. దేశ కాలాలని బట్టి ఆహారవిహారాలని ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే వున్నారు కదా అన్ని వర్గాల వారున్నూ? మరి విజ్ఞాన శాస్త్రము, వైద్య శాస్త్రమూ అడయారు మర్రి చెట్టు కన్నా ప్రబలిన ఈ కాలంలో శాకాహారం వలన వచ్చే ప్రయోజనాల గురించి చెవినిల్లు కట్టుకు పోరుతున్నా కూడా ఎవరూ నేర్చుకోరెందుకు చెప్మా?

  మాంసాహారం మానవజాతి శైశవదశ లోని ఆహార విధానము. దాన్ని విడిచి వృక్షాదారమైన ఆహారాన్ని నేర్చిన నాడే మనుషులు అనేక విధాలుగా వృద్ధి చెందారు.
  జంతువులని మాంసం కోసం పెంచడం హీనత్వం. చాలా మంది మాంసాహారులు ఎవ్వరూ కూడా తమకి తాము ప్రాణులని చంపరు, చంపలేరు. ఎవరో పేద కసాయి వారు జీవిక కోసం చంపితే వారు ఆ మాంసాన్ని కొన్నుక్కు తింటారు.
  మాంసం కోసం పశువులని పెంచి చంపడం అతి వ్యర్ధమైన విధానము. ఒక పసువుని కొన్ని సంవత్సరాలు పోషించి దాన్ని చంపుకు తినే బదులు, దానికి పెట్టే వ్యవసాయ ఉత్పత్తులని నేరుగా మనుషులకే పెడితే అంతకు నూరింతల మంది కడుపు నింపుకో గలరు.
  వైద్యశాస్త్ర పరంగా మాంసాహారం అనేక విధాలుగా రోగ కారకం: జీర్ణ శక్తి, మూత్రపిండాలు, పెద్దపేగులు (మల బద్ధకం) ఇవన్నీ అతిగా పనిచేయాలి మాంసాన్ని జీర్నిన్చుకోవాలంటే. ఇక మాంసం వల్ల వచ్చే కొవ్వు నేరుగా గుండె జబ్బుకి, రక్తపోటుకి టిక్కెట్లు.
  పాశ్చాత్య దేశాల్లో మాంసాన్ని ఒక పరిశ్రమ లాగున పెంచి అమ్ముతారు. ఈ విధానంలో సమస్తమైన జీవకారున్యమూ బందు. తము తినే మాంసానికి సజీవరూపాలైన పశువులని ఎంత క్రూరమైన పరిస్థితుల్లో పెంచుతారో చాలా మందికి తెలియదు. తెలిస్తే చాలా మంది voluntary గా మాంసాన్ని విసర్జిస్తారని నా నమ్మకం.
  ఇలా పెంచే పశువులకి రోగాలు రాకుండాను, మాంసం బలవడానికి వాటికి తరచూ హార్మోన్ ఇంజక్షన్లూ, ఆంటీబయాటిక్ లూ ఇస్తారు. ఆ మాంసం తినే వాళ్ళందరూ కూడా ఆ రసాయనాలని ఆస్వాదించి అవి తెచ్చిపెట్టే శరీర వైకల్యాలని తెచ్చుకుంటున్నారు.
  మాంస భక్షణ కేవలం మనుషులు కృతకంగా పెంచుకునే పశువులు, మేకలు, గొర్రెలు కోళ్ళ కీ మాత్రమే పరిమితం కాదు. సమస్త జంతుకోటీ, పక్షికోటీ మత్స్యకోటీ కూడా మనుషుల మాంసబుభుత్సకి బలై అంతరించి పోతోందటే అతిశయం కాదు. వీటన్నింటినీ కడ తెర్చాక ఆ తరవాతి వంతు మనుష్య జాతిదేను.

  శాకాహారానికి, పై చెప్పిన విధ్వంసక గుణాలేవీ లేవు:

  అది పుష్కలంగా లభిస్తుంది.
  అది రోగ నిరోధకము. ఎంజైములూ, విటమిన్లూ, బయోఫ్లేవనాయిడ్లూ, ఖనిజలవణాలూ - ఇత్యాది రోగనిరోధక పోషకాలన్నీ శాకాహారంలో వుంటాయి.
  మాంసంలో Fiber కానీ Soluble Fiber కానీ శూన్యము. అంచేత మాంసం, మలబద్ధకం సహోదరాలు. శాకాహారం ఇందుకు పూర్తిగా విరుద్ధం. [అతిగా మాంసం మీద ఆధార పడే కొన్ని వర్గాల వారిలో పెద్దపేగుల కాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ].
  ఇటీవలి కాలంలో మధ్య తరగతి వారికి ఆహారం పుష్కలంగా లభిస్తోంది. అందుకు తగిన శరీర శ్రమ లేక స్థూలకాయం అనేది ఒక దేశకాల భేదాతీతమైన మహమ్మారి లాగున వ్యాపించింది. మాంసంలో కాలరీలు శాకాహారం కన్నా కొన్ని రెట్లు. ఈ కోణంలో చూసినా కూడా, శాకాహారమే ఉత్క్రుష్టం.
  శాకాహారం చవక.
  మాంసాహారం నిలవ వుండదు. ఒకవేళ అలా ఉంచినా తొందరగా బాక్టీరియా చర్యకి లోనవుతుంది.

  నిజమేను - "జీవో జీవస్య జీవనం" - చెట్లకి కూడా ప్రాణం వుంది. కానీ ప్రాణికోటిని ఆమూలాగ్రంగా అంతరింప జేసే ప్రమాదం శాకాహారంలో లేదు. తామసంలోంచీ, రాజసంలోకి, రాజసంలోంచీ సాత్వికతలోకి ఎదిగి, ఇంద్రియాధారమైన శరీర ధర్మాల్ని అధిగమించి, అవసరాలని సోషింప చేసుకుని, పరమార్ధాన్ని వెతకమని కదా ఆర్షధర్మము?

  ఇన్ని విధాలుగా ఉత్కృష్టమైన ఆహారావిధానాన్ని మన పూర్వులు కొన్ని వేల సంవత్సరాలుగా అవలంబించి మనకి అప్రయత్నంగా మన జీవన చర్యలో భాగం చేశారు. దీన్ని నేనెందుకు వదులుకోవాలి? ఇన్ని ప్రమానాలున్నప్పటికీ కూడా మాంసాన్ని విసర్జించలేని వారితో వాదోపవాదాలు అవసరమా?

  ప్రత్యుత్తరంతొలగించు
 35. ఇన్ని వాదోపవాదలమీద ఆహారాన్ని శాకాహారం, మాంసాహారం అనికాక " సాత్వికాహారం, రాజసాహారం, తామసాహారం " విడదీసుకుని అందులో సాత్వికతను పెంచేదిగా ఉన్నటువంటి మొక్కలపై ఆధారపడడం అటు ఆరోగ్యరీత్యా, ఇటు మానసిక రీత్యా ఉచితమనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. మనిషి పుట్టుకతో మాంసాహారి అవడం అసంభవమని నా అభిప్రాయం.
  అది ఎలాగంటే ప్రకృతిలో ముందుగా జల చరాలు వచ్చి ఉంటాయి. వాటి కంటే ముందు జలలో పెరిగే చెట్లు పుట్టు ఉండవచ్చు. తరువాత భూమి మీద జంతువులు పక్షుల కంటే ముంది చెట్లే పుట్టి ఉంటాయి. ఎందుకనగా అవే జంతువుల మొదటి ఆహారం. తరువాతననే జంతువులను తినే జంతువులు ఉద్భవించి ఉంటాయి.
  ఈ విధంగా చెట్లు, తరువాత జంతువులు పుట్టాక మనిషి పుట్టుక జరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

  ఇంకా సహజంగానే మనిషి-జంతువుని, జంతువు-మనిషిని ఒకరినోకరు చూచుకుని ముందు భయపడేవారని ఖచ్చితంగా చెప్ప వచ్చు. అదే ప్రవృత్తి నేటికి కొనసాగుతోంది. మనకి పరిచయం లేని ఒక చిన్న పురుగు దగ్గరకి వెళ్ళడానికి మనం భయపడతాము.

  ఈ పరిస్థితి కారణంగాను, సహజంగాను మనిషి మొదటి ఆహారం ఖచ్చితంగా ఆకులు, అలములు, ఫలాలే అయి ఉంటాయి. అవి అన్నీ సహజంగా లభిస్తాయి. ప్రయత్నం లేకుండా లభిస్తాయి. పండిపోయిన ఫలాలు కింద పడి ఉంటాయి. ఆదమ్ ఈవ్ కధ లో కూడా ఏపిల్ తినడం అనేది ఈ విషయాన్నే దృవీకరిస్తుంది.

  అలా కాని స్థితిలో పురుగులను కాని, జంతువులను కాని, పక్షులను కాని మనిషి వేటాడితే తప్ప తినలేడు. ప్రారంభావస్తలో ఇది సహజంగా సాధ్యపడిందనలేము... కావున మానవుడు ప్రకృతి సిధ్దంగా శాఖాహారిగానే జన్మించాడు.....

  ప్రత్యుత్తరంతొలగించు
 37. http://www.facebook.com/photo.php?fbid=206533729496953&set=a.107420516074942.17483.100004209823862&type=1&theater

  http://www.facebook.com/raju.vizag.3

  ప్రత్యుత్తరంతొలగించు
 38. పురోహితుడైనవాడికి నిర్భయత్వం నిజాయితీ అవసరం. బ్రాహ్మణత్వంలో అది ముఖ్య లక్షణం. మీరు ఈబ్లాగుల్లో వ్రాసే కామెంట్లని మీ ఇష్టమైనవి ఉంచుకొని మిగిలినవి తీసేసేద్దాము అనుకుంటున్నారంటే నిజాయితి స్థానంలో పిరికితనం ప్రవేశించింది అనే అనుమానం కలిగితీరుతుంది. కనుక మాడరేషన్ తొలగించండి. ఎవరైనా ఘోరమైన నిందలకు పాల్పడితే వాటిని తొలగించేటపుడు కారణం వ్రాసి తొలగిస్తే బాగుంటుంది.

  వశిష్ఠుడి ఆవు మాంస భక్షణ గురించి మీకు ఆసక్తిఉంటే నా బ్లాగు problemsoftelugus.blogspot.com చదవండి. సత్యం పౌరోహిత్యంలో ఉన్న బ్రాహ్మణులకి అందనంత దూరానికి జరిగిపోయింది. మీరు ఈకామెంట్ ను కూడ చెత్తకుండీలో పారేస్తారని నాకు తెలుసు. అందుకే ఘజినీ వెంట వచ్చిన యాత్రికుడు అల్ బెరూనీ భారతీయ బ్రాహ్మణులు సర్వం తమకే తెలుసు అనుకుంటారు అని వ్రాసుకున్నాడు. ఘజినీ మహమ్మద్ 17 సార్లు సోమనాధ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే బ్రాహ్మణులు ఇచ్చిన శాపాలు పనిచేయలేదు. వారు అతడిని రాజస్థాన్ ఎడారిలో దారి తప్పించాలని చూశారు. అది గ్రహించిన అతడు వెనక్కి తిరిగి వచ్చి నాలుగు దెబ్బలు అంటించి అదనపు బంగారం కొల్లగొట్టుకెళ్ళాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరు ఎవరు? మీరు ఏమి చేస్తుంటారు? మీ చిత్రం మీబ్లాగులో ఎక్కడైనా షేర్ చేశారా? నిర్భయంగా తెలియజేయండి.

   మాడరేషన్ నా సౌకర్యం కోసమే! నేను ప్రతీ సమయంలోనూ బ్లాగులో అందుబాటులో ఉండను. ఎవరు ఏ పోస్ట్ కి కామెంట్ చేశారో నాకు తెలియాలి కదా! అలాగే చెత్త అంతా ప్రచురించే ఓపిక, తీరిక నాకు లేవు.

   తొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.