క్రొత్త బ్లాగరులకు పనికొచ్చేవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
క్రొత్త బ్లాగరులకు పనికొచ్చేవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఆగస్టు 2010, బుధవారం

దయచేసి నా సందేహాలు తీర్చండి.

కొత్త పోష్ట్ ఎడిటర్ ని ఎంచుకుంటే , పాత దానిలో ఉన్నన్ని ఆప్షన్స్ కొత్త దానిలో లేవు ఎందువల్ల? పోటో ను జతపరచడం ఎలాగా? అలాగే మనం ముందు రాసిన పోష్ట్ ని సవరించాలని చూస్తే ఏమి కనిపించడం లేదు. ఎందుకని?

మీరెవరైనా చెప్పగలరు. త్వరలో పాత పోష్ట్ ఎడిటర్ మాయమవుతుమ్దట. నాకు పాతదే నచ్చింది. ఈ సమస్యలు లేకపోతె కొత్తదైనా ఫర్వాలేదు. దయచేసి నా సందేహాలు తీర్చండి.

14, డిసెంబర్ 2009, సోమవారం

నిన్న భాగ్యనగరంలో ఉండే చాలామంది బ్లాగరులం కలిశాము



నిన్న డిశెంబరు 2వ ఆదివారం బ్లాగరుల దినోత్సవం సందర్భంగా మన భాగ్యనగర వాసులమందరము యూసఫ్ గూడాలో కల క్రిష్ణ కాంత్ పార్క్ లో కలుసుకుని సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఆ వివరాలు మీకోసం.

నేను ముందు అనుకున్నట్టుగా 2.30 కల్లా పార్కు దగ్గరకు వచ్చి వీవెన్ గారుకి ఫోన్ చేశాను. అప్పుడే వచ్చేశారా? ఇంకా ఎవరూ రాలేదేమో మీరు సి.బి. రావు గారికి ఫోన్ చెయ్యండి. నేను కాస్త ఆలస్యంగా వస్తాను అని వీవెన్ గారు చెప్పే సరికి, నేనంటే మొదటిసారి కనుక ఉత్సాహం కొద్దీ టైమంటే టైమ్ కి వచ్చేశాను. మిగతావారు రావద్దూ... కంగారెందుకు అని నన్ను నేను సముదాయించుకుని నాతో వచ్చిన నా చిననాటి స్నెహితుడు వీరు, శ్రీనివాస్ ( ఈ మధ్యే కొత్తగా పరిచయమైనారు ) లతో కబుర్లలో పడ్డాను.



ఈ లోపు రమణ అనే బ్లాగరు వచ్చి తెలుగు బ్లాగర్సా అని అడిగి పరిచయం చేసుకున్నారు. కాస్త పంచకట్టు, వీబూధిరేఖలతో ఉన్న నన్ను చూసి నేనే వీవెన్ గారినేమో అనుకున్నారట. మరికొంత సేపటితరువాత " కూడలి " టీ షర్ట్ వేస్తుకుని ఎవరో కనిపించారు. కాస్త పరీక్షగా చూస్తే ( పాపం మొహం నిండా గాయాలు ) అది చక్రవర్తిగారు. నమస్తే చక్రవర్తిగారు. అని పలకరించాను. నమస్తే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను అన్నారు. నన్ను పరిచయం చేసుకున్నాను. అందరూ లోపలే ఉన్నారు అని చెప్పడంతో లోపలికి వెళ్ళాము.

అక్కడ అప్పటికే పద్మనాభం గారు, కాశ్యప్ గారు, మురళీ ధర్ గారు, శిరీష్ కుమార్ గారు ఉన్నారు. నేనే ముందువచ్చాననుకున్నాను. వాళ్లు నాకంటే ముందు వచ్చి అక్కడ ఉన్నారు. వారు ( ఇ- తెలుగు కార్యవర్గం వారు ) రేపు జరగబోయే పుస్తక ప్రదర్శన వద్ద ఇ-తెలుగు స్టాల్ కు ఏవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలో చర్చించుకుంటున్నారు. నేను వెళ్లి శిరీష్ గారి ప్రక్కన కూర్చున్నాను. వారితో పరిచయం చేసుకుని, మిగతా వారి గురించి తెలుసుకున్నాను. ఈలోపు మరికొంత మంది వచ్చి మాతో చేరారు. మొదట అందరం పరిచయం చేసుకున్నాము.



పరిచయకార్యక్రమం చక్రవర్తి గారితో మొదలైంది.

1.చక్రవర్తి గారు- భవదీయుడు బ్లాగరు.
2.రవి గారు- రవి గారు బ్లాగరు.
3.వేంకట రమణ గారు- తపన బ్లాగరు.
4.రవి చంద్ర గారు- అంతర్వాహిని బ్లాగరు.
5.రాజన్ గారు- నా గోల బ్లాగరు.
6.అజయ్ గారు- కొక్కొరకో బ్లాగరు.
7.శిరీష్ కుమార్ గారు- చదువరి బ్లాగరు.
8.కోడి హళ్లి మురళీ మోహన్ గారు- తురుపుముక్క అనే బ్లాగు, కథాజగత్ అనే వెబ్ సైట్ లను వీరు నడుపుతున్నారు.
9.సత్యన్నారాయణ గారు- ఆంధ్రలేఖ అనే వెబ్ సైట్ ను నడుపుతున్నారు.
10.సి. బి. రావు గారు- దీప్తి ధార బ్లాగరు.
11.పద్మనాభం గారు- తెలుగు గ్రీటింగ్స్ అనే వెబ్ సైట్ ను నడుపుతున్నారు. వీరు ఇ-తెలుగు అధ్యక్షులు.
12.క్రిష్ణ కిషోర్ గారు- నువ్వుసెట్టి బ్రదర్స్ బ్లాగరు.
13.శ్రీనివాసరాజు గారు- -హరివిల్లు అనే వెబ్ సైట్ నడుపుతున్నారు.
14.శ్రీనివాస కుమార్ గారు- జీవితంలో కొత్త కోణం బ్లాగరు.
15.వీవెన్ గారు- వీవెనుడి టెక్కునిక్కులు బ్లాగరు.
16.కాస్యప్ గారు- telugu lo kaburlu చెప్పాలని ఉంది బ్లాగరు.
17.మురళీ ధర్ గారు- మురళీ గానం బ్లాగరు.
18.సుజాత గారు- మనసులో మాట బ్లాగరి.
19.సుజన ( సుజ్జి ) గారు- naalo nenu బ్లాగరి. వీరి స్నేహితురాలిని కూడా తీసుకు వచ్చారు.
20.వీరబాబు గారు- బ్లాగుల గురించి తెలుసుకోవాలని నేను తీసుకువచ్చాను. బ్లాగులు ఇంకాలేవు.
21.శ్రీనివాస్ గారు- చరణ్ వికాస్ కేంద్రం అనే వెబ్ సైట్ ను తెలుగులో రాయడం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చారు.
22.రాజశేఖరుని విజయ్ శర్మ- ఇది నేనే



వచ్చిన వారందరూ ఒకరి తరువాత ఒకరు పరిచయం చేసుకుంటుంటే, మిగతావారు ప్రశ్నలు సంధిస్తుంటే పరిచయకార్యక్రమం సరదాగా ముగిసింది. సత్యనారాయణ గారు ఆంధ్రలేఖ బ్లాగరులకు పోటీలు నిర్వహిస్తోందని, ఉత్తమ రచన అనిపించిన బ్లాగరుకు తగిన బహుమతులు ఉంటాయని తెలిపారు. తరువాతికాలంలో తమకు నచ్చిన వారిని తమ భవిష్యత్ కార్యకలాపాలలో రచయతలుగా వినియోగించుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు. తరువాత ఇ-తెలుగు కార్యకలాపాల గురించి పద్మనాభం గారు క్లుప్తంగా వివరించారు. రేపు భాగ్యనగరంలో జరిగే బుక్ ఫెయిర్ లో పెట్టే ఇ- తెలుగు స్టాలు వద్ద ఉండేందుకు, చూడడానికి వచ్చిన వారికి అంతర్జాలంలో తెలుగు అభివృద్ధి గురించి, బ్లాగుల గురించి వివరించడానికి ఉత్సాహవంతులైన వారు కావలని చెప్పారు. అదిముగిసినతరువాత ఎవరికి వారు ఒకరితో ఒకరు కాసేపు మాట్లాడుకుని, కాఫీలు తాగి 7 గంటలు అవుతోందనగా ఇంటికి బయలుదేరాము.



ఈ తతంగమంతా సరదాగానే గడిచింది. ఇందులో నాతో సహా సగం మంది మొదటి సారి వచ్చినవారే. స్త్రీలు ఎక్కువగా రాకపొవడానికి తోటి బ్లాగరులే కారణం అని తెలిసి కాస్త బాధ అనిపించింది. ఏది ఎమైనా బ్లాగు పరిచయాలు , ముఖ పరిచయాల వరకూ వస్తే అంచనాలు తారుమరయ్యే అవకాశం చాలాఉంది. ఎందుకంటే బ్లాగులో వ్యక్తమయ్యే భావాలే , మనిషి ఎదురుగా ఉన్నప్పుడూ ఉంటాయన్న నమ్మకంలేదు. నిన్న మాత్రం అక్కడికి వచ్చిన వారందరూ చాలా సరదాగానే నలుగురిలో కలిసిపోయారు. సమయం తెలియకుండానే గడిచి పోయింది. :)

12, డిసెంబర్ 2009, శనివారం

రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం. బ్లాగరులందరూ ఒకచోట కలుసుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం డిసెంబరు 2 వ ఆదివారం ను తెలుగు బ్లాగుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా రేపు తెలుగు బ్లాగరులందరూ ప్రతీ ప్రధాన నగరాల లోనూ కలుసుకోవడము, బ్లాగుల బాగోగుల గురించి చర్చించుకోవడము చేస్తున్నారట. నాకెందుకో మన తెలుగు బ్లాగరులతో కొత్త స్నేహం మొదలుపెట్టడానికి ఇది మంచి అవకాశంలాగా కనిపిస్తోంది. మనం అందరం కలుసుకోవచ్చన్న ఊహే చాలా ఉత్సాహాన్నిస్తోంది. ఎంత ఎక్కువమందిమి వస్తే అంత బాగుంటుంది రేపటి సాయంత్రం.

మన భాగ్యనగరంలో ఈ సమావేశం జరిగే

స్థలం : కృష్ణ కాంత్ ఉద్యాన వనం, యూసఫ్ గూడా బస్తీ .
సమయం : రేపు అనగా డిసెంబర్ 13 న సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు.

భాగ్యనగరంలో జరిగే పుస్తక ప్రదర్శనలో తెలుగు బ్లాగరులం అందరం కలుద్దాం

మన భాగ్యనగరంలో ఈ నెల 17 నుండీ 27 వరకు నెక్లెస్ రోడ్డులో పుస్తక ప్రదర్శన జరగనున్నది. ఆ ప్రదర్శనలో భాగంగా మన ఇ-తెలుగు వారిచేత ఒక స్టాలు నిర్వహించ బడుతున్నది. ఈ స్టాలులో అంతర్జాలంలో మన తెలుగు అభివృద్ధిని గురించి వచ్చిన వారికి వివరించబడుతుంది.

అందులో భాగంగా తెలుగులో బ్లాగుల పరిచయం, వాటి పురోగతి మొదలగు విషయాలను తెలియజేయడం జరుగుతుంది. మిరు భాగ్యనగరం వారై ఉండి, బ్లాగును నిర్వహిస్తున్నట్లైతే మీ బ్లాగుని పరిచయం చేసుకునే అవకాశం కూడా అక్కడ కల్పిస్తున్నారు.

మరింకెందుకు ఆలస్యం... మీ వీలుచూసుకుని ఆ పదిరోజులలో వీలైనన్ని సార్లు రండి. మనం అందరం అక్కడ కలుసుకోవచ్చు. కొత్త స్నేహం మొదలు పెట్టవచ్చు. బ్లాగుల గురించి తెలియని వారికి మనకు తెలిసినది పరిచయం చేయవచ్చు.

నాకు కొత్త, అక్కడ నాకు ఎవరూ తెలియదు, ఎవరిని ఎలా కలవాలి? కలిసినా ఏం మాట్లాడాలి ? అని ఆలోచిస్తున్నారా? నాకూ కొత్తే నండీ. నాకూ ఎవరూ తెలియదు. వెళ్లి తెలుసుకోడమే. మాటలు కలపడం మీకు రాకపోతే అక్కడ ఎవరో ఒకరు కలుపుగోలు వ్యక్తులు ఉంటారు లెండి. ముందు బయలుదేరి రండి. తరువాత కాలం దానంతట అదే గడుస్తుంది.

స్థలం: పీపుల్స్ ప్లాజా గ్రౌండ్, నెక్లెస్ రోడ్, పుస్తక ప్రదర్శనా కేంద్రం.
ఎప్పటి నుండి: డిసెంబర్ 17 నుండీ 27 వరకు.
సమయం: మామూలు రోజుల్లో మధ్యహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు
శని ఆది వారాల్లో మధ్యహ్నం 12 గం.ల నుండి రాత్రి 9 గంటల వరకు


అలాగే ఈ నెల 13 వ తేదీన కూడా అంటే రేపే సాయంత్రం 3 గం.ల నుండి , 5 గం.ల వరకు, యూసఫ్ గూడా బస్తీ లో కల కృష్ణకాంత్ ఉద్యానవనం లో కూడా మన తెలుగు బ్లాగరులందరూ కలుస్తున్నారు. నేను వెళ్దామనుకుంటున్నాను. మీరూ వస్తారా?

18, ఆగస్టు 2009, మంగళవారం

అందరికీ ఈ తెలుగు అంతర్జాల పేజీలు తెలుసో లేదో...!?

నేను బ్లాగు లోకం లోకి వచ్చి దాదాపు ఏడు నెలలు దాటింది. నాకు నా బ్లాగును , రచనలను నలుగురితో పంచుకోవడానికి నేటి వరకు తెలిసినవి కూడలి, జల్లెడ అనే బ్లాగు సముదాయ కేంద్రాలు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఎందుకో తెలుగు బ్లాగులు అని గూగుల్ లో వెతికితే అనేక ఆసక్తికర విషయాలు తెలిశాయి.

అవి నేను ఇప్పటి వరకూ చూడనివి. తెలుగు బ్లాగులు అన్నీ ఒకే చోట సమికృతమయ్యే ఆ వెబ్ పేజీల సమాచారాన్ని నాలాంటి కొత్తవారందరి కోసం ఈ క్రింద ఆయా లింకులు ఇస్తున్నాను.

ముందుగా కొత్త బ్లాగును ప్రారంభించాలి అనుకునే వారు బ్లాగర్.కామ్ ద్వారా కానీ వర్డ్ ప్రెస్.కామ్ ద్వారా కానీ మొదలు పెట్ట వచ్చు.

తెలుగులో బ్లాగు రచనలు చేయాలనుకుంటే...
ఆంగ్లం నుండి తెలుగుకు అనువదించడానికి ,తెలుగులో రాయడానికి

లేఖిని ( ఇప్పటి వరకు నాకు తెలిసినది లేఖిని మాత్రమే ... )

తెలుగు లిపి ( కొత్తగా చూసాను )

తెలుగు టైపింగ్ కొరకు ( కొత్తగా చూసాను ) అనే అంతర్జాల పేజీలు ఉపకరిస్తాయి.



అందరికీ తెలిసిన తెలుగు బ్లాగు సముదాయ కేంద్రాలు ( ఇక్కడ మన రచనలు చేసిన బ్లాగులను ప్రచురించ వచ్చు. )
కూడలి
జల్లెడ

పొద్దు


క్రింది వాటిలో కూడా మన రచనలను ప్రచురించుకొనే వీలుంది .

తెలుగు బ్లాగుల ప్రపంచం
తెలుగురత్న
రచయుతలకు సూచనలు in తెలుగురత్న

తెలుగుబ్లాగు

తెలుగు జాతి మనది - తెలుగు సైట్లు ఇవి అనే బ్లాగులో కూడా కొత్త వారికీ పనికొచ్చే సమాచారం ఉంది.

వివేన్.కామ్ కూడా చూడండి.

మరికొన్ని కేంద్రాలను పరిచయం చేసే వెబ్ పేజి కోసం ఇక్కడ నొక్కండి.

ఇంకా మీకు తెలిసిన మరిన్ని వివరాలు వ్యాఖ్యలుగా రాయండి. అవన్నీ ఇదే పోస్టులో జత పరుస్తాను. కొత్తవారికి సహాయపడతాయి.

25, మార్చి 2009, బుధవారం

ఎవరైనా నా సందేహాలు తీర్చరూ...!?



నాకు ఈ బ్లాగు లోకం కాస్త కొత్త. కానీ నా స్నేహితుల సహాయంతో చాలా తెలుసుకున్నాను. వాళ్లకు కూడా తెలియని కొన్ని సందేహాలను ఎవరినడిగి తెలుసుకోవాలో అర్ధం కాలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరికైనా తెలిస్తే నా సందేహాలు తీర్చరూ... :)

నా సందేహాలు:

1. బ్లాగును ఎన్నిసార్లు ఎంతమంది చూశారో తెలుసుకోవడం ఎలా? ప్రొఫైల్ విజిట్లు తెలిపినట్లే, బ్లాగు విజిట్లు కూడా తెలుసుకునే టట్లు కొన్ని బ్లాగుల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అది ఎలా చేసుకోవాలి?

2. బ్లాగు అనుచరుల జాబితా మొదట్లో నా బ్లాగులో కనపడేది. ఇప్పుడు కనపడటం లేదు. సెట్టింగుల్లో కెళ్లి చూస్తే ఏవో అంకెలు వస్తున్నాయి. ఎందువల్ల? అది పూర్వం లా కనపడాలంటే ఏమి చెయ్యాలి?

3. కొన్ని బ్లాగుల్లోకి ప్రవేశించాలంటే వారి అనుమతి లెనిదే కుదరటం లేదు. వారి అనుమతి తీసుకుందామంటే వాళ్ల మెయిల్ ఐడి నాకు తెలియదే... :( మరి వాళ్ల అనుమతి తీసుకునే మార్గం ఏమిటి?

ఈ అనుమతి విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పటి నుండో ఇష్టంగా ఒక బ్లాగు చూస్తున్నా మనుకోడి, వాళ్ల ప్రతీ పోస్టుకీ సమాధానం ఇచ్చినా ఇవ్వక పోయినా పోస్టులు మాత్రం క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాము. కొంతకాలం తరువాత వాళ్ళు బ్లాగును తాము అనుమతించిన వాళ్లే చూసేలా ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏమిటి చెప్పండి? మనమేమో ఎప్పుడూ బ్లాగులో అందుబాటులోనే ఉంటారుకదా.... అనే ఉద్దేశంతో ఐడీ కూడా తీసుకోలేదనుకోండీ... మీకు బాధ అనిపించదూ...? అంత పర్సనల్ గా బ్లాగు నడప దలుచుకుంటే మరి కూడలి, జల్లెడలలో బ్లాగు చేర్చడం ఎందుకు? ఇంత కాలం వాళ్ల బ్లాగు పాపులారిటీ పెంచుకోవడానికీ, నా బ్లాగును అనుసరించే వాళ్లు 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, నాకు 30 వ్యాఖ్యలు వచ్చాయ్, 40 వ్యాఖ్యలు వచ్చాయి అని చెప్పుకోడానికి కొత్త నేస్తాలు కావలసి వచ్చారూ....! తాము కూడా హీరోలమే, తాము రాసేది చదివేందుకు జనాలు ఎగబడుతున్నారు అని నలుగురికీ చాటుకున్న తరువాత, తమ ఈగో సంతృప్తి పొదాకా మనం అవసరం లేక పోయామా...!? ఇది ఎంతవరకూ న్యాయ మండీ? ఇక్కడ ఏ ఒక్కరినో తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఇది మీమీద ఇష్టంతో వచ్చిన కోపం. మీ ఇబ్బందులు మీకుంటాయి, కాదనను. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. మీ బ్లాగుకి అటువంటి కట్టడి పెట్టాలనుకున్నప్పుడు, ఓ వారం రోజుల ముందుగా బ్లాగు మిత్రులందరికీ తెలిసేటట్టు ఓ పోస్టు మీ బ్లాగులో పెట్టవచ్చు. అప్పడు మీ బ్లాగును అభిమానించే వారు మీ అనుమతి తీసుకునే వీలు ఉంటుంది కదా..? మిమ్మల్ని, మి రచనల్నీ అభిమానించే వారినికూడా దృష్టిలో ఉంచుకుని ఏ నిర్ణయమైనా తీసుకోండి అనే నేను చెప్పదలుచుకున్నది. ఒక్క సారి ఆలోచించండి.

నా సందేహాలు తిరుస్తారు కదూ... ఉంటాను మరీ... :)