9, మే 2012, బుధవారం

మూఢమి రోజులలో వైదికులకు ఆర్థిక సహాయం అందించండి

నమస్కారం!

   ఏప్రెల్ 29 నుండి గురు మూఢమి వచ్చింది. తదనంతరం వెంటనే శుక్ర మూఢమి వస్తుంది. అదివెళ్లేసరికి ఆషాఢం వస్తుంది. దాదాపు 3 నెలల  పాటు పురొహితులందరికి పనులుండవు. చాలా మంది అప్పులు చేసి బండిలాగుకొస్తారు. కొంతమందికి  అప్పుకూడా దొరకని స్థితి. పెద్ద పెద్ద పురోహితులే డబ్బుకు చేయి చాపక తప్పని రోజులివి. ఇక చిన్న పురోహితుల స్థితి కడు దుర్భరం.
ఇటువంటి పరిస్థితిలొ వేదము పట్ల, వైదికుల పట్ల ఆదరము కలిగిన వారు కాస్త చొరవ తీసుకొని తమకు గురువులు, హితులు అయిన పురొహితుల వివరాలు అడిగితెలుసుకొని సహాయ పడాలి.
ఉచితముగా ఇవ్వటము కంటే ఇంటిలొ వ్రతములు, రుద్రాభిషేకములు, గ్రహ శాంతి జపములు మొదలైనవి నిర్వహించి దక్షిణగా ఇస్తే చాలా అందముగా ఉంటుంది.

ఎవరో కొందరికి కష్టంగా ఉండడం కాదు. దాదాపు తొంభైశాతం మంది వైదికులకు ఇవి చాలా కష్టమైన రోజులే!  వైదిక వృత్తిలోని వారెవరో అవసరమైతే అడుగుతారనికాక మీ ఆసక్తిని బట్టి ఓ పది మంది లేక ఇరవైమంది వైదికులతో ఓకార్యక్రమం చేయించుకోండి. తప్పక అది వైదికులందరికి సహాయం అవుతుంది.

నిజానికి చాలామందికి జీవనంలో అనేకరకాల సమస్యలు ఉండిఉండవచ్చు. వాటి నివారణకు నవగ్రహ జపాదికాలు చేయించుకోవడం, లేదా ఓ పదకొండు మంది ఋత్విక్కులతో రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం,  యఙ్ఞయాగాదులు వంటివి మీ శక్తిమేరకు సంకల్పించి చేయించుకొనవచ్చు.  ఎప్పుడో చేద్దామనుకుని ఇంకా చేయించకుండా కాలయాపన చేస్తున్న వైదిక క్రతువులేమైనా ఉంటే అవి ఈ మూడు నెలల కాలంలో చేయించే ప్రయత్నం చేయండి.అలా చేయడంవలన ఇటు చేయించుకున్నవారికి అభీష్ట సిద్ధి కలుగడమే కాక, అటు అవసరంలో ఉన్న వైదికులకు సహాయపడినట్లూ ఉంటుంది.

ఇది కడులోతైన విషయము. త్వరితముగా ఎవరికి తోచిన విధముగా వారు సహాయ చర్యలు చేపట్టవలసింది. తోటి పురోహితుల బాధలు తెలిసీ చూస్తూ ఉండబట్టలేక రాసిన దీనిలొ ఆవస్యకతను గమనించగలరని ఆసిస్తున్నాను. 

 ( పైవ్యాసములో వైదికులు అన్న చోటల్లా వైదిక వృత్తిద్వారా జీవనం సాగిస్తున్న వారు అని అర్థం గ్రహించగలరు )

ధన్యవాదములు.

2 వ్యాఖ్యలు:

  1. నమస్కారం బ్లాగులో కాకపోయినా మరోచోటా, మరోచోటా లేదా నా మెయిల్ కు తమ స్పందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదములు. ఇంకా పురోహితుల హితము కోరేవారు ఉన్నారు అన్న నమ్మకాన్ని కలిగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. Please record and upload "sandhyavandnam Pravachanam" by Chaganti koteswarar Rao garu..

    ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.