పురోహిత విషయాలు మరియు జ్యోతిష్య విషయాలు చర్చిస్తాను. ఎవరైనా నేను సమస్త జ్యోతిశ్శాస్త్రాన్నీ ఔపోశన పట్టాను అంటే అది అసత్యమే! ఎంత నేర్చినా తరగని సముద్రం జ్యోతిష్యం. నేనూ విద్యార్థినే! నేను నేర్చిన జ్యోతిష్యం మీకూ సాధ్యమైనంత సులభ పద్ధతిలో నేర్పే ప్రయత్నం చేస్తాను.
24, ఫిబ్రవరి 2009, మంగళవారం
పూజ చెయ్యబోతున్నారా? అయితే ఓ సారిలా ప్రయత్నించి చూడండి.
పూజలు చాలామంది చేస్తూనే ఉంటారు. అయితే ఎంతమందికి కోరిన కోరికలు తీరాయి? ఎంతమందికి ఆత్మ సంతృప్తి లభిస్తోంది? అలా ఫలితం కనిపించని వారికోసమే ఈ వ్యాసం.
కోరికలు కోరడం తప్పా కాదా అనేది ఇప్పుడు చర్చించటం లేదు. ఒకవేళ ఏదైనా కోరి పూజలు చేస్తుంటే అవి తీరుతున్నాయా అని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. కొంతమంది చెప్తారూ.. దేముడికి పూజ చేస్తూ కోరికలు తీరుతున్నాయా? లేదా? అని ఆలోచించడం తగదని. మళ్లీ అలాంటి గొప్పవారే చెప్తారు "కామి గాని వాడు మోక్ష గామి కాలేడని". ఇవన్నీ వింటూ కూర్చుంటే ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడతారు. నేను చెప్పేది ఏమిటంటే కోరుకోండి మీ ఇష్టం వచ్చిన కోరిక కోరుకోండి. మీ కోరికలో ఎంత మంచి ఉంటే అంత తొందరగా నెరవేరతాయి. పరోపకారంతో కూడిన నిస్వార్ధమైన వి చాలా ఉత్తమమైనవి. మీ మంచి కోరేవి మధ్యస్థం. పక్కన వాడికి చెడు కోరేవి అథమం. ఈ అథమ కోరికలు కోరితే అవి నెరవేరక పోగా మీ వినాశనానికే దారితీస్తాయి. ఉత్తమ, మధ్యస్థ కోరికల గురించి మాత్రమే నేను చెప్తున్నాను.
పూజ చేసే ఏ కొద్ది మందికో ఫలితం లభిస్తోంది. దానికి కారణాలు అనేకం. అందులో మీ తప్పులు సరిదిద్దు కోండి ముందర. మిగతావి ఎలా వాటంతట అవే ఎలా తొలగి పోతాయో చూడండి.
పూజ చెయ్యాలంటే మొదట కావలసింది "శ్రద్ధ". పూజను నేడు చాలా మంది భయంతోనో, తప్పదు కనకనో చేస్తున్నారు. మీకు ప్రాణ సంకటం వచ్చినప్పుడో, ఇక ఎవ్వరి వల్లా మీకొచ్చిన కష్టం తొలగే మార్గం లేదు అనిపించినప్పుడో భగవంతుడు కావలసి వస్తున్నాడు. అప్పుడైనా ఏదో మొక్కుబడిగా చేస్తున్నారే తప్ప, చిత్తశుద్ధి లేదు. ఇలాంటి వారికి కూడా నాసలహాలు( పూజ విషయంలో) పని చెయ్యవు.
పూజ చెయ్యాలంటే మీకు ఉండాల్సిన ఒకే ఒక్క అర్హత "శ్రద్ధ". అది మీకు ఇప్పటికే ఉన్నా, లేదా ఇక ముందు కల్పించుకుంటాము అన్నా నేను మీకు చెప్పేది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, మీరు కోరుకునేది ఏదైనా తప్పక మీకు ఫలితం లభిస్తుంది. అందుకు మీరే నిదర్శనం. మీరే ఏదో ఒక రోజు నేను చెప్పినది నిజమే నంటూ సభా ముఖంగా చెప్తారు.
సుచిగా స్నానం చేసి, శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించి, శుభ్రంగా ఉన్న స్థలంలో దేముని విగ్రహాన్ని పెట్టి, ఆ విగ్రహాన్ని కడిగి బొట్టుపెట్టి పూజకు ఉపక్రమించాలి. ఇంత వరకూ అందరూ చేసేదే. కానీ విచిత్రం అసలైన పూజ మాత్రం చాలా మంది విధి విధానంగా చెయ్యలేక పోతున్నారు. ఇక్కడ అందరి ఇళ్లల్లో జరిగే సాధారణ తంతు వోసారి గమనిద్దాం.
రామనాధం అనే అతను తనకు ప్రమోషన్ వచ్చిన సంధర్భంగా సత్యనారాయణ వ్రతం చెయ్యాలనుకున్నాడు. అతని ఉద్యోగం చిన్నదే అయినా క్షణం తీరికలేనిది. అయినా ఎప్పుడో మొక్కుకున్నాడు కనక ఓ ఆదివారం ఏ పనీ పెట్టుకోకుండా ఖాళీగా ఉంచుకుని ఆరోజు సాయంత్రం వ్రతం తలపెట్టాడు. రామనాధం దంపతులు చాలా సంత్సరాల తరువాత పూజ చేసుకుం టున్నాం కనుక నలుగురినీ పిలుద్దాం అనుకున్నారు. అనుకున్నట్లుగానే కాస్త వాళ్ల శక్తికి మించిన పనే అయినా ఆఫీసు వాళ్లని, బంధువులనీ, చుట్టు ప్రక్కల వాళ్లానీ భోజనాలకు కూడా పిలిచారు. ఆ దగ్గరలో ఉన్న పురోహితుడిని పిలిచారు. వ్రతానికి కావలసిన సామాగ్రిని ఆదివారం ఉదయం పూట తెచ్చాడు రామనాధం. సాయంత్రం ఎంత తొందరగా మొదలు పెడదామన్నా జానకమ్మ చుట్టు ప్రక్కల వాళ్లని పిలవటం, ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకోవటం, వంటవాళ్లకి కావలసిన సామాగ్రి అందివ్వటంతో మొదలు పెట్టేటప్పటికి ఆలస్యమైపోయింది. పంతులుగారు వచ్చి తొందర పెట్టిన అరగంటకి ఇద్దరూఫ్ వ్రతానికి కూర్చున్నారు. ఈ లోపులో రామనాధం చెల్లెలు పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసింది. వ్రతం మొదలుపెట్టే సమయానికి అందరూ రావడం మొదలైంది. వ్రతం చేస్తూ అందరినీ అక్కడినుండే పలకరిస్తూ కూర్చోమని చెబుతున్నారు ఆ దంపతులు. మంత్ర పుష్పం సమయంలో మనస్పూర్తిగా నమస్కారం చేసుకున్నాడు రామనాధం. కధ సమయంలో పంతులుగారి అనుమతితో ఏవో అవసరమైన ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాడు. గం: 1.30 ని.లు వ్రతానికి కూర్చుని కూర్చుని కాళ్లు నొప్పులు పుట్టాయి. పంతులు గారికి దక్షిణ ఇచ్చి అందరితో భోజనాలు చేశారు రామనాధం దంపతులు.
ఇంతే కదండి అందరిళ్లల్లో పూజల తంతు. దీనికి మీకు లభించే ఫలితమేమిటో చెప్పనా... " ఖర్చు". అంతే అంతకంటే ఏమీ లభించదు. తృప్తి లభిస్తోంది అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అక్కడ మీరు పూజ చేస్తే కదా తృప్తైనా మిగిలేందుకు. పూజ అనే తంతు( పని) మాత్రమే చేశారు. పూజ మాత్రం కాదది. దీనికంటే రోజూ మీరు ఇంట్లో చేసే దీపారాధన వేయి రెట్లు నయం. పోనీ వచ్చిన నలుగురూ మిమ్మల్ని అభినందించారా అంటే... అవును మీ ఎదురుకుండా చాలా బాగా ఏర్పాట్లు చేశావోయ్ అని చెప్పి, మీ వెనుకగా రిసీవింగ్ సరిగా లేదనీ, పట్టించుకునే వాళ్లే లేరనీ, తమ దర్పం చూపడానికే అందర్నీ పిలిచి ఆర్భాటంగా చేశారనీ ఇలా చాలా మాటలు అని ఉంటారు. అందులో కొన్ని మీచెవులని తాకి వుంటాయి కూడా... అందుకే అంటున్నా మీకు మిగిలింది ఖర్చు మాత్రమే అని. వీటన్నిటికీ కారణం మీరే. మీరు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే అన్నీ సవ్యంగా జరిగి ఉండేవి.
పూజను "మనసా వాచా కర్మణా" ఆచరించాలి. అప్పుడే అది సంపూర్ణమైన పూజ అవుతుంది. మీరు కర్మని(పని) మాత్రం ఆచరించి నేను పూజ చేశాను అని చెప్పడం ఎంతవరకూ న్యాయం. పూజ చేస్తే మనసుకు ఒక అద్వితీయమైన, ఆనందకరమైన, సున్నితమైన భావన కలగాలి. అది కలగలేదు అంటే అక్కడ మీమనసు లేదు అని అర్ధం.
మనసారా అంటే మనం పూజ చేసేటప్పుడు ఏమి చేస్తున్నామో తెలుసుకుని దాన్ని చేస్తున్నట్లుగా భావన చెయ్యాలి.
ఉదా: "పుష్పం సమర్పయామి" అన్నప్పుడు "పుష్పాన్ని సమర్పిస్తున్నాను స్వామీ స్వీకరించు" అని మనసులో ప్రార్ధించాలి. ఆ వేశే పుష్పం సాక్షాత్తూ భగవంతుడి పాదాల వద్ద పడుతోంది అని భావించాలి. దాన్ని ఆ భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తున్నట్లు భావించాలి.
వాచా అంటే వాక్కు ద్వారా కూడా ఆ స్వామిని సేవించాలి. అంటే పూజ చేస్తున్నంత సేపూ భగవత్ నామస్మరణ చేయాలి.
కర్మణా అంటే కర్మ ద్వారా సేవించాలి. భగవంతునికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించడమే కర్మ(పని). ఏ సమయానికి ఏది చేయాలో కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలియని వారు పెద్దలని గురువులని పురోహితులనీ అడిగి తెలుసుకుని చేయండి. త్వరలో " పూజా విధానం" అనే పోస్టు రాస్తాను. అది చదివితే మీకు పూజ చేయడమెలాగో సులభంగా అర్ధమౌతుంది.
ఈ పోస్టు ఇంకా విపులంగా రాయాలి. కానీ సమయా భావం వల్ల కొంత తగ్గించి రాస్తున్నాను. చదువుతుంటే మీకు ఏమైనా సందేహాలు వస్తే వ్యాఖ్యలలో రాయండి. సమాధానం తప్పక ఇస్తాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
chakkani vavarana rasaaru.abhinamdanalu
రిప్లయితొలగించండిబాగా రాసారు!!
రిప్లయితొలగించండిమర్చే పొయ్యాను. వీలున్నప్పుడు నా ఈ పోస్టు చదవండి.
రిప్లయితొలగించండిhttp://vedasamhitam.blogspot.com/2009/02/brief-transcript.html
బాగా చెప్పారు...
రిప్లయితొలగించండిబాగా చెప్పారు.
రిప్లయితొలగించండిచాలా చక్కగా చెప్పారు.
రిప్లయితొలగించండిబాగుంది మీరు చెప్పిన విధానం.
రిప్లయితొలగించండిchakkaga chepparu. waiting for new post.
రిప్లయితొలగించండివిలువైన అభిప్రాయాలు తెలిపిన అందరికీ నా ధన్య వాదాలండీ. :)
రిప్లయితొలగించండిguruvu gaaru chaaala chaaaala baga chepparu
రిప్లయితొలగించండిnijanga
prajalaku ee rojullo edoka fashion pooja ane peru cheppi pilavadam
sir very nice very good
ఇప్పుడే చూశాను. చాలా బాగా చెప్పారు.
రిప్లయితొలగించండిpujya vijaya sarma garu
రిప్లయితొలగించండిchaala baaga chepparu andi. naaku oka doubt with your permission. memu eee year may 14th maa pelli roju na satyanarayana vratam chesukunnamu manchi purohitulni pilichi aayana cheta cheyinchukunnamu. kaani evvarini pilava lekapoyamu. pilichina oke okallu ralekapoyaru. so meme chesukunnamu. ilanti puja chesinappudu naluguriki bhojanalu pettali antaru kadandi? so naaku koncham badha kaligindi. kaani meeru paina cheppina vidham gane chaalaa chakkaga manasu anta swamy meeda petti puja chesukunnamu. chesukunnamu ani anakodadu aaa swamy maa meeda preeti to puja cheyinchukunnaru.
namassulu
sesirekha.
మీ ప్రయత్నం మీరు చేశారు కదా! స్వామి వారు మీతో ప్రశాంతంగా పూజ చేయించుకోవాలనుకున్నారు. అందుకె మీకా వెసులుబాటు కలిగించారు. :)
రిప్లయితొలగించండిశర్మ గారూ, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. వినాయకుడి తొండం కుడి వైపుకి ఉంటే పూజ చాలా పవిత్రంగా అన్ని శాస్త్రోక్తంగా చేయాలి అని ఎడం వైపుకి ఉంటే ఇంట్లో మామూలుగా పూజ అంటే దైవ భక్తి మెండుగా ఉండి తెలీక చేసే తప్పులున్నా ఫరవాలేదనీ విని, చవితికి పూజ కి ఎడం వైపు తొండం ఉన్న గణపతినే మట్టి తో చేసి వాడుతాము. అసలు ఏది సరి ఐనదో వివరించగలరు.
రిప్లయితొలగించండిఓంకారంలాగ గణపతి బ్రహ్మకుదర్శనమిచ్చాడని పెద్దలు చెప్తారు. కనుక తొండము కుడివైపుకు ఉండడమే సమంజసం. మిగతా మీ సందేహాలు సరిఅయినవికావు. ఏ గణపతినైనా శ్రద్ధతో పూజచేస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. :)
తొలగించండిశ్రీ గురుభ్యోనమ;
రిప్లయితొలగించండిఅయ్యా నాపేరు కోలపల్లి కమలాకరశర్మ. అవకాశం వున్నప్పుడు శివ పంచాయతన పూజా విధానమును తెలియచేయగలరు