13, సెప్టెంబర్ 2012, గురువారం

రామ చరణం రామ చరణం - దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు

రామ చరణం రామ చరణం రామ చరణం మాకు శరణం
మాకు చాలును మౌని మస్తక భూషణం శ్రీ రామ చరణం || మాకు చాలును || 
 రామ చరణం రామ చరణం రామ చరణం మాకు శరణం రామ చరణం

రాగయై ఈబ్రతుకు చెడి రాయైన వేళల రామ చరణం
మూగయై పెన్ ధూళి పడి మ్రోడైన వేళల రామ చరణం || రాగయై ||
ప్రాణమీయగ రామ చరణం పటిమ నీయగ రామ చరణం
మాకుచాలును తెరలు మరణం రాక పోతే రామ చరణం || మాకు చాలును ||
రామ చరణం రామ చరణం రామ చరణం మాకు శరణం రామ చరణం 

కోతియై ఈ మనసు నిలకడ కోలుపోతే రామ చరణం
సేతువై భవజలధి తారణ హేతువైతే రామ చరణం  || కోతియై ||
వేరుపడ శ్రీరామ చరణం తోడు బడ శ్రీరామచరణం
మాకుచాలును ముక్తి సౌధ ప్రాగణం || మాకు చాలును ||
రామ చరణం రామ చరణం రామ చరణం మాకు శరణం రామ చరణం 

నావలో తానుండి మము నట్టేట నడిపే రామ చరణం
త్రోవలో కారడవిలో తొత్తోడ నడిపే రామ చరణం  || నావలో ||
నావయైతే రామ చరణం త్రోవయైతే రామ చరణం
మాకు చాలు వికుంఠ మందిర తోరణం శ్రీరామ చరణం || మాకు చాలు ||
రామ చరణం రామ చరణం రామ చరణం మాకు శరణం రామ చరణం 
దారువునకును రాజ్య బూర్వహ దర్పమిచ్చే రామ చరణం
భీరువునకును అరినెదిర్చే బీరమిచ్చే రామ చరణం
ప్రభుత నిచ్చే రామ చరణం అభయ మిచ్చే రామచరణం
మాకు చాలు మహేంద్ర వైభవ కారణం శ్రీరామ చరణం || మాకు చాలు ||
రామ చరణం రామ చరణం రామ చరణం మాకు శరణం


జై శ్రీరామ


2 కామెంట్‌లు:

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.