7, అక్టోబర్ 2016, శుక్రవారం

కార్తీకమాసమున మహన్యాసపూర్వక శివాభిషేకములకు గోత్రనామాలు పంపండి




శ్లో|| న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్| న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్||

కార్తీక మాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరియైన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తీకమాసము లో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు విశేషఫలప్రదములు.

      అటువంటి కార్తీక మాసము పాడ్యమి (31-10-2016) మొదలు, అమావాస్య (29-11-2016) వరకు ముప్పైరోజులు "వైదికమిత్ర కార్యాలము" (వనస్థలిపురం, హైదరాబాద్ లోని మాగృహము )నందు ప్రతిరోజూ ఉ.6-00 గం.ల నుండి 10-00 గం.ల వరకు మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకములుజరుగుతున్నవి. కావున భక్తులందరూ ఈ అవకాశమును సద్వినియోగ పరచుకొనగలరు.   ఆసక్తి ఉన్నవారు రు.1516/- చెల్లించినచో వారి గోత్రనామములతో కార్తీకమాసం నెలరోజులు అభిషేకములు జరుగును.

గోత్రనామాలు తెలుపుటకు,  దక్షిణ పంపవలసిన ఎకౌంట్ వివరాల కొరకు rajasekharuni.vijay@gmail.com అనేచిరునామాలో సంప్రదించగలరు

పోయిన సంవత్సరం అందరి గోత్రనామాలతో రోజూ మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, మధ్యలో 2 సార్లు మహాలింగార్చన, మాస శివరాత్రినాడు శ్రీశైలంలో రుద్రహోమం చేశాము. 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.