వైదిక క్రతువులకై సంప్రదించండి

   గృహస్థుకు అవసరమైన స్మార్త కార్యక్రమాలు  అన్నీ చేయించబడును. అంటే వివాహము,గర్భాదానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ,నామకరణము( బారసాల ), అన్నప్రాశనము, అక్షరాభ్యాసము, చౌలము, ఉపనయనము మొదలైన పంచదశ కర్మలు, తరచూ చేసుకునే అనేక రకాల వ్రతములు, శత రుద్రీయ అభిషేకములు, నక్షత్ర - నవగ్రహ జపాలు,హోమాలు, కళ్యాణాలు, శాంతి కర్మలు, ఆబ్దీకములు, కంపెనీలలో పూజలు, ఆలయాలలో జరిగే సామూహిక క్రతువులు మొ.వి అన్నీ చేయించుటకై ....

   
ముహూర్తాలు, జాతక చక్ర పరిశీలన, జాతకపొంతన చూడబడును.  ప్రత్యేకంగా ఎవరైనా అత్యంతకష్టంలో ఉండి, ఆ కష్టం తొలగడానికి వైదికమైన శాంతి పూజలు వంటివి ఏమైనా చేయించాలి అనుకుంటుంటే తప్పక తెలియజేయండి.  మానసికమైన ధైర్యాన్ని అందించడంలో వారికి సహాయపడుతూ ఫలితం పొందేదిశగా వారిచేత వివరంగా తెలుపుతూ పూజలు చేయించబడును. 

 పూజలు చేయించుకున్న తరువాత మీకు కలిగిన అనుభవాలను క్రింది కామెంట్లరూపంలో తెలుపగలరు.  

4 వ్యాఖ్యలు:

 1. Vijay garu is extremely knowledgeable and very clear in going through the aspects of any ritual. He is dedicated to god and guides his followers in the right direction. He is very down to earth and doesnt tend to please anyone for the sake of fame or money. He is an ideal guru one can have. Iam personally lucky to meet him and have him as guru for all our family events. Thank you Vijay garu.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Jai sriram..
  Edi ayina prarambam mundu antha aa ramudu daya vale ani smarichukovali ani nerpina manchi manishi.. Oka mukalo chepali ante.. epudu vuntuna modern life lo manaki konchum daiva bhakthi vipu nadavataniki dari chupe pathulu garu evarina vunnaru ante adi vijay garu.. asalu puja endhuku chesukovali.. endhuku devudini smarinchukovali ani logical ga chepe vythi vijay garu.. thana manchithaname thana pujalalu vala thana namukuna valaki manchi jaruguthundi.. danaiki vudaharana nene.. Thanks vijay garu for being our well wisher and being a good friend.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. దైవాధీనం జగత్ సర్వం | మంత్రాధీనంతు దైవతం ||
  తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవత ||

  ఈ జగత్తు మొత్తము దైవము యొక్క అధీనంలో వుంటుంది.
  ఆ దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది, ఆ మంత్రములకు అధీనులై వుంటారు.
  ఆ మంత్రము సాత్విక లక్షణములు కలిగిన బ్రాహ్మణుల అధీనంలో వుంటుంది.
  అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములు అని తెలుసుకోవాలి.

  పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం చేత, మనుష్యులలో బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. కానీ, లభించిన ఆ జన్మలో చెడు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ వుంటే మాత్రం, అందుకు తగిన పరిహారం ఖచ్చితంగా చేల్లించుకోవాలి. వచ్చే జన్మ సంగతి ఎలా వున్నా, ఈ జన్మలోనే ముందు ఆ దోషముల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉద్యోగాలు చేసుకునే బ్రాహ్మణుల విషయం ఎలా వున్నా, కనీసం వైదికంలో వుండే బ్రాహ్మణులు (హిందూ ప్రీస్ట్) మాత్రం కొన్ని కనీస నియమాలు పాటించాలి. అవి పాటించటం కష్టం అనుకుంటే, వైదికవృత్తి వదిలేసి వేరే వృత్తి చూసుకోవటం మంచిది.

  బ్రాహ్మణుడికి ఉండవలసిన కనీస లక్షణాలు :

  యజ్ఞోపవీత (జంధ్యం) ధారణ :
  కేవలం యజ్ఞోపవీతం ధారణ చేయటమే కాకుండా, దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.

  నిత్య సంధ్యావందనం :
  నిత్యం ఖచ్చితంగా సంధ్యావందనము, గాయత్రీ జపము చేస్తూ వుండాలి.

  శిఖా సంస్కారం (పిలక), చెవి పోగులు :
  బ్రాహ్మణులకి శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. ఎవరైనా బ్రాహ్మణులు శిఖ లేకుండా బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుంటే, అతనికి తన వృత్తి పట్ల, దేవతల పట్ల నమ్మకం లేదు అని తెలుసుకోవాలి. అంతే కాకుండా, అతను సమాజాన్నీ, భక్తులనీ మోసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అతనిని గౌరవించవలసిన అవసరం లేదు. సంస్కారాలకి విలువ ఇవ్వనివాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శిఖ లేనివాడు బ్రాహ్మణుడే కాదు.

  పవిత్రద్రవ్య ధారణ :
  ముఖము నందు బ్రహ్మ తేజస్సు కనిపించాలి. ఎల్లవేళలా, నుదిటిన కుంకుమ లేక విభూది లేక గంధము ధరించినవాడై వుండాలి. వారిని చూస్తే గురు భావన కలగాలి.

  ప్రశాంతంగా ఉండుట :
  ఎప్పుడూ ప్రశాంతంగా వుండాలి తప్ప, కోపము, చికాకు, విసుకు, అయిష్టము, ద్వేషము వంటి గుణములు వుండకూడదు. నిగ్రహం లేనివ్యక్తి దేవతా అర్చానాదులకి అర్హుడు కాడు.

  స్పష్టంగా మాట్లాడుట :
  మాట్లాడే మాట స్పష్టంగా వుండాలి. మనస్సులో ఒకటి, బయటికి చెప్పేది వేరొకటి వుండకూడదు. సత్యమే మాట్లాడాలి. మాటలో వెకిలితనం, గర్వం, ఇతరులని నిందించటం వంటివి వుండకూడదు. అట్లాగే, ఇతరులకి చెడు కలిగే మాటలు మాట్లాడకూడదు.

  చెడు వ్యసనములు లేకుండుట :
  మాంసం, మద్యం, పొగ త్రాగటం, మత్తు పదార్థాలు నములుతూ వుండటం పనికిరాదు. పర స్త్రీ, పర ధనం గురించి వ్యామోహం వుండకూడదు.

  సమ భావన :
  ధనిక, బీద అనే తేడా లేకుండా అందరితో సమ భావన కలిగి వుండాలి.

  కేవలం, పైన చెప్పిన లక్షణాలే కాకుండా ఇంకా అనేక అంశాలు వుంటాయి. కనీసం, పైన చెప్పిన లక్షణాలు వుంటే అతను మంచి బ్రాహ్మణుడు అని చెప్పవచ్చు. వైదికాన్ని (అర్చకత్వ, పురోహిత లేక ఆగమం) ఒక డబ్బు సంపాదించే వృత్తిగా మాత్రమే భావిస్తూ, డబ్బుతో బాటు చెడు వ్యసనాలు కూడా కలిగినవారిని గౌరవించాల్సిన అవసరం లేదు.

  కానీ, నిస్వార్థంగా లోకశ్రేయస్సు కోసం దేవతా అర్చన, ఆరాధనలు చేస్తున్న బ్రాహ్మణులకు ఏ కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత సమాజంలో ప్రతి వ్యక్తి పైనా వుంది. బ్రాహ్మణులు, గోవులు సుభిక్షంగా వున్నంత కాలం లోకం సుభిక్షంగా వున్నట్లే అని గ్రహించాలి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. బాగుంది మంచి విషయాలు తెలిపారు. నేను ఎంతవరకు చక్కటి పురోహితుడను అనేది నేను తెలిపితే బాగోదు. నాగురించి తెలిసినవారు చెప్పాలి, కనుక నాకు వ్యక్తిగతం పరిచయమైన వారు నాలో పైలక్షణాలలో కనీసం 75 శాతం ఉన్నాయొ లేదో తెలుపండి. ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా సవరించుకుంటే బాగుంటుందిఅని అనుకుంటే నాకు వ్యక్తిగతంగా తెలుపండి. తప్పక సరిచేసుకుంటాను.

   తొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.