5, నవంబర్ 2009, గురువారం

వివిధ సందర్భాలలో పఠించదగు శ్లోకములు

ఉదయం నిద్ర లేచిన వెంటనే పఠించు ధ్యానము:

బ్రహ్మమురారి త్రిపురాంతకారీ భానుశ్శశిః భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రశ్శని రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం.

విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణ మహీతలే
అనేకరత్న సంపన్నే పాదఘాత క్షమా భవ.

కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతీ
కరమూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనం.

సముద్ర వసనే దేవి పర్వత స్తనమండితే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే.

స్నానము చేయునపుడు పఠించవలసినవి:

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.

ఆవాహయామి త్వాం దేవి స్నానార్థమిహ సుందరి
ఏహి గంగే నమస్తుభ్యం సర్వతీర్థ సమన్వితే.

పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యా సరిత స్తథా
ఆగచ్ఛంతు మహాభాగా స్నానకాలే సదా మమ.

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో2పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః

పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:





వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

ధ్యాన మూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా.

సరస్వతీ ప్రార్థన:

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా.

పద్మ పత్ర విశాలాక్షి పద్మ కేశరవర్ణనీ
నిత్యం పద్మాలయాం దేవి సామాంపాతు
సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేషజాడ్యాపహా.

దక్షిణామూర్తి ప్రార్థన:

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ్ ఙ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణా మూర్తయే నమః.

గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః.

భోజనమునకు ముందు:

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

భోజనమునకు తరువాత:

అగస్త్యం కుంభకర్ణం శమ్యం బడబానలం
ఆహారపరిణామార్థం స్మరామి వృకోదరం.

సంధ్యా దీపమునకు:

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే.

నిద్రకు ఉపక్రమించునపుడు :

అచ్యుతం కేశవం విష్ణుం హరిం సత్యం జనార్దనం
హంసం నారాయణం కృష్ణం జపేద్దుస్వప్న శాంతయే.

రామస్కంధం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనేయసి స్మరేన్నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి.

ఇంటి నుండి కార్యార్థులై వెళ్లునపుడు:

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం.

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
యేషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దనః.

ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.

ఔషధ సేవనము చేయునపుడు:

ధన్వంత్రిణం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం
అచ్యుతం చామృతం చంద్రం స్మరేదౌషధ కర్మణి.

శరీరే జర్జరీభూతే వ్యాధి గ్రస్తేకళేబరే
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః.

8 కామెంట్‌లు:

  1. నమస్కారాలండి. చాలా హృద్యంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి సమాచారం ఇచ్చారు

    రిప్లయితొలగించండి
  3. బాగున్నాయి అండి, ఇన్ని తెలియదు నాకు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. మీకు మెయిల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుదాం అనుకున్నాను, కానీ ఇక్కడే సరిన చోటు అని కామెంట్ పెడుతున్నాను. మీకు ఏమైనా శ్రమ ఇచ్చి వుంటే క్షమించండి, కానీ ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. @ సంతోష్ గారు: శ్రమ ఏమిటండీ... ? నేను మీకు ఈ ఉత్తరంలోనే చెప్పాను కదా, ఆ పిల్లల కోసం ఏదైనా చేసే అవకాశం మీరు నాకూ ఇచ్చారు. అందుకు నేనే కృతఙ్ఞుడను. ఇంకా ఏమైనా కావాలన్నా తప్పక అడగండి.

    ఈ శ్లోకాలు ఎక్కువగ ఉన్నాయి అనిపిస్తే మీరు వీటిలో కొన్ని మాత్రమే ఎంచుకుని వారిచేత చదివింప చేయవచ్చు. తరువాత తరువాత నెమ్మదిగా మిగతావి కూడా చేర్చవచ్చు.

    క్షమించండీ లాంటి పదాలు ప్రయోగించకండి మరెప్పుడూను :)

    రిప్లయితొలగించండి
  6. ayya meeru devi navaratrulalo prathiroju ammavarini pradinchutaku slokamulu andinchagalara

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.