ఈ శ్రీవరలక్ష్మీ వ్రతకల్పం లోని లక్ష్మీ పూజను వ్రతంనాడే కాకుండా రోజూ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చదువరుల సౌలభ్యం కొరకు మంత్రములను ఎరుపు రంగులోను, శ్లోకములను ఆకుపచ్చ రంగులోను, సంస్కృత వాక్యాలను నీలం రంగులోను, చేయవలసిన విధానమును నలుపు రంగులోను ఉంచాను. మీకు చాలా సులువుగా అర్థంఅవ్వాలంటే రంగుప్రతి ( కలర్ ప్రింట్ ) తీసుకో
గలరు.
ఇది స్త్రీలకు ప్రత్యేక వ్రతము. కానీ దంపతులిరువురు ఆచరించ వలెను. దీర్ఘ సౌభాగ్యము, సత్సంతానము, సిరిసంపదల కొరకు స్త్రీలు విధిగా ఆచరించవలెను. ఈ వ్రతమును చేయువారు శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చెడి 2వ శుక్రవారం నాడు ఆచరించవలెను. సూర్యోదయానికి పూర్వమేలేచి, కాలకృత్యములు ముగించుకుని మనసులో “అమ్మా! నీ అనుగ్రహము కోరి ఈవరలక్ష్మీ వ్రతమును చేయుటకు సంకల్పిస్తున్నాను. దానికి తగిన అర్హతను, శ్రద్ధను నాకు ప్రసాదించ వలసినది” అని సంకల్పించుకొనవలెను. బ్రహ్మచర్యము వహించి, మిత భుక్తులై, మితముగా మాట్లాడుతూ అమ్మవారినే మనసున స్మరిస్తూ వ్రతమునకు కావలసిన సంభారములన్నీ ఏర్పరచుకొనవలెను. అమ్మవారికి నివేదించుటకు 21 రకముల పిండివంటలు లేదా శక్తి కొలదీ తయారు చేసుకొనవలెను. గృహమునకు ఉత్తర ప్రదేశమున పూజాస్థలమును గోమయంతో అలికి ఐదురంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి, ఆసనము వేసి, నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, చతురస్రముగా చేసి, అందు అష్ట దళ పద్మమును లిఖించి ఆ బియ్యము తూర్పు భాగమున బంగారు లేక వెండి లేక రాగి లేక మట్టితో చేసిన లక్ష్మీదేవి విగ్రహమును ఉంచవలెను. దానికెదురుగా మండప మధ్యములో నీటితో నింపిన రాగి/వెండి కలశమును ఉంచవలెను. మండపమునకు ముందు పళ్లెములో బియ్యము పోసి ఉంచుకొవాలి. పసుపు గణపతిని వేరే పళ్లెములో ఏర్పాటు చేసుకొన వలెను. (ఈ పసుపు గణపతిని ముందే బియ్యములో పెట్టరాదు. పీటలమీద కూర్చున్నతరువాత పెట్టాలి. లేనిచో అనుకున్న వ్రతము ఏదో కారణముతో చాలా ఆలస్యమగును. ) విధిగా శుచి అయిన సాంప్రదాయ వస్త్రములు ( చీర ) ధరించాలి. జుట్టును ముడివేసి ఉండాలి. నుదుటన కుంకుమ ధరించాలి. కాళ్లకు పసుపు రాయాలి. పీటలమీద కూర్చునే ముందు పెద్దల ఆశీర్వాదమును స్వీకరించి కుడికాలు ముందు పెట్టి ఆసనము పై కూర్చొన వలెను. ఆచమనము చేసి,దీపారాధన చేసి, పసుపు గణపతిని బియ్యపు పళ్లెములో ఉంచి, కుంకుమ అలంకరించి పూజను ప్రారంభించ వలెను.
శ్రీవరలక్ష్మీ వ్రతకల్పము కథతో సహా పూర్తి PDF లింక్ క్రింద తెలుపుతున్నాను. స్వీకరించగలరు. దీనిని
ఉపయోగించి వ్రతం చేసుకుని ఇంకా మీకు కావలసిన మార్పులు చేర్పులు తెలుపగలరు.
ఏఒక్కరికి ఇది ఉపయోగపడినా ఈశ్వరనుగ్రహంగా భావిస్తాను. ధన్యవాదములు.
http://www.mediafire.com/download/w1al6kh1gr9nz6s/SRI_VARALAKSHMI_VRATA_KALPAMU-RVJ.pdf
https://ia601006.us.archive.org/29/items/SRIVARALAKSHMIVRATAKALPAMURVJ/SRI%20VARALAKSHMI%20VRATA%20KALPAMU-RVJ.pdf
http://www.mediafire.com/download/w1al6kh1gr9nz6s/SRI_VARALAKSHMI_VRATA_KALPAMU-RVJ.pdf
https://ia601006.us.archive.org/29/items/SRIVARALAKSHMIVRATAKALPAMURVJ/SRI%20VARALAKSHMI%20VRATA%20KALPAMU-RVJ.pdf
మీకు చాలా థాంక్సండి, చాలా చక్కగా వివరించారు పూజావిధానాన్ని.
రిప్లయితొలగించండిchala thanks.
రిప్లయితొలగించండిsreerama
Very useful.thank you very much
తొలగించండిచాలా శ్రమ తీసుకుని చక్కగా వివరించారండీ. ధన్యవాదాలు. పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఒక చిన్న విషయం. వినాయక వ్రత విధానాన్ని ఎడిట్ చేసినట్టున్నారు. భాద్రపద మాస శుక్ల చతుర్ధి అని ఉండిపోయింది. ఎవరైనా పరాకుపడి చూసుకోకపోతే పనికొస్తుందని చెప్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిnijame samkalpamlo kasta marchali. dhanyavadamulu.
తొలగించండిచాలా చక్కగా వివరించారు శర్మ గారూ !
రిప్లయితొలగించండిపూజ అయ్యేక లక్ష్మీదేవికి ఉద్వాసన ఎలా చెప్పాలో ,ఎప్పుడు చెప్పాలో కూడా తెలియచేయ గలరా?
PDF lo undi chudaleda. chivaralo untundi chudandi.
తొలగించండిధన్యవాదాలు శర్మ గారూ!
రిప్లయితొలగించండిఅమ్మవారికి అదేరొజు వుద్వాసన చెప్పవచ్చా.శుక్రవారం కదా?
రాబోయే వినాయక చవితికి స్వామికి ఎప్పుడు వుద్వాసన చెప్పాలి? మరునాడు మంగళవారం చెప్పవచ్చునా?
వుద్వాసనకి ఇలాంటి పట్టింపులు వుంటాయా?