7, జనవరి 2014, మంగళవారం

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సమాజానికో గుణపాఠం కావాలి

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చాలాబాధాకరం. ఇది తెలుగు ప్రజానికాన్ని ఎంతగానో కలచివేసిన సంఘటన. చిన్నా పెద్దా ప్రతీ ఒక్కరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంతో జనాదరణ ఉన్న సినీ హీరోల వంటివారే కష్టాలకు పరిష్కారం ఆత్మహత్య అనే నిర్ణయానికి వస్తే, సామాన్య జనుల మాటేమిటి? ఎక్కడో ఎవరో ఆత్మహత్య చేసుకుంటే అదిపెద్ద వార్తకాదు. కానీ ఇటువంటి జనాదరణ ఎక్కువగా ఉన్న( సెలబ్రెటీ హోదా లోని) వారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే అది సమాజాన్ని మరింత బలహీన పరుస్తుంది. ఉదయ్ కిరణ్ ఈ నిర్ణయంతో నిజజీవితంలో ధీరుడుగా నిలబడలేకపోయాడు. కానీ అతడు తన కుటుంబానికే కాక మనందరకూ ఓ హెచ్చరిక చేశాడు. సమాజ స్థితి ఎలా ఉందో చూడమని , ఇప్పటికైనా జాగరూకులవమని ప్రమాద ఘటిక మ్రోగించాడు.

           పూర్వతరాలకు నేటి యువతరానికి తేడా ఇక్కడే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్వ తరాలవారికి లేవా ఇటువంటి కష్టాలు బాధలు, కానీ వారు కష్టాన్ని తట్టుకుని నిలబడి ముందుకు నడిచారు. కానీ నేటి తరంవారు ప్రతీసమస్యకూ పరిష్కారంగా ఆత్మహత్య వైపు దృష్టి సారించడం శోచనీయం. నేటి తరంలో ఎక్కువ శాతం ఇలాంటి విపరీత పోకడలకు ఆకర్షితులౌతున్నారు. అందుకు ప్రథాన  కారణం మనోబలం లేకపోవడం.  నేను గొప్పవాడిని, నేను కాబట్టి చేయగలను, నేనే చేయగలను అని అనుకునేవారికి మనోబలం రాదు. ఒకానొక స్థితిలో ఇటువంటి తత్వం వైపరీత్యాలకు దారితీస్తుంది. మనమనుకున్నది అనుకున్నట్లుగా జరిగినంతకాలం నేనుగొప్పవాడిని అను కునే ప్రతి సారీ మనకు మరింత బలంగా అనిపిస్తుంది. కానీ మన అంచనాలు తారుమారైన నాడు, ఏది ప్రారంభిస్తే అది విఫలమౌతున్న నాడు ఈ మంత్రం పనిచేయదు సరికదా మనల్ని మరింత బలహీనపరుస్తుంది. మనమీద మనమే నమ్మకాన్ని కోల్పోయే టట్లు చేస్తుంది.
 
           " భగవంతుడున్నాడు, అతడు సర్వ సమర్థుడు, ఎవరికీ పరిష్కరింప సాధ్యపడని సమస్యకు కూడా అతన్ని శరణువేడితే తప్పక మార్గం దొరుకుతుంది" అనే నమ్మకాన్ని మనలో ప్రోది చేసుకుని, భగవన్నామ స్మరణ చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ నమ్మకమే మనకు ఆపత్కాలంలో శ్రీరామ రక్షగా నిలుస్తుంది.  భక్తి అనే బీజాన్ని చిన్ననాడే పిల్ల హృదయాలలో పాదుకొల్పినట్లైతే అది ఇంతింతై మహా వృక్షమై లోకాలను తరింపచేసే శక్తిని మన పిల్లలకు అందింస్తుంది. కనుక ఇటువంటి సంఘటలను చూసిన తరువాతైనా మనమందరమూ జాగరూకులమై మసలుకోవాలి. ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకుంటూ, మన కుటుంబానికి - తోటివారికి ప్రేరణ కల్పిస్తూ సింహాల వలే జీవించాలి.

మనందిరినీ ఆలోచింపజేసిన ఉదయ్ కిరణ్ ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుందాము.

అనన్యాశ్చింతయంతోమాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం మహామ్యహమ్‌||

4 కామెంట్‌లు:

  1. పూర్వతరాలకు నేటి యువతరానికి తేడా ఇక్కడే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్వ తరాలవారికి లేవా ఇటువంటి కష్టాలు బాధలు, కానీ వారు కష్టాన్ని తట్టుకుని నిలబడి ముందుకు నడిచారు.
    ----------------------------------------------------------------------------------------------------------------
    దానికి కారణం వెనకాల backup network ఉండేది. అమ్మ, నాన్నా, పిల్లలు, బంధు మిత్రులు, స్నేహితులు. ప్రస్తుతం ఇది కోరవడిందేమో నని అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. నేను గొప్పవాడిని, నేను కాబట్టి చేయగలను, నేనే చేయగలను అని అనుకునేవారికి మనోబలం రాదు. ఒకానొక స్థితిలో ఇటువంటి తత్వం వైపరీత్యాలకు దారితీస్తుంది. మనమనుకున్నది అనుకున్నట్లుగా జరిగినంతకాలం నేనుగొప్పవాడిని అను కునే ప్రతి సారీ మనకు మరింత బలంగా అనిపిస్తుంది. కానీ మన అంచనాలు తారుమారైన నాడు, ఏది ప్రారంభిస్తే అది విఫలమౌతున్న నాడు ఈ మంత్రం పనిచేయదు సరికదా మనల్ని మరింత బలహీనపరుస్తుంది. మనమీద మనమే నమ్మకాన్ని కోల్పోయే టట్లు చేస్తుంది
    ఇది సత్యం . సున్నిత మనస్కులు అందరు అనుభవించవలసిన స్థితి. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  3. Avunandi eevishayam andhariki gunapatam kavaali. Ledhante asalu eerojullo ekaanthanga vunte / ledha kaaleega vunnagani bhagavan naamasmarana chesukonte adhi tharuvatha manaku anthagano kastakaalamlo vupayoga paduthundhi.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.