15, ఆగస్టు 2024, గురువారం

జాతకంలో ఆయుష్షు నిర్ణయించడం ఎలా?

అష్టమ భావం, అష్టమాధిపతి, ఆయుష్యకారకుడు శనైశ్చరుడు వీరి ముగ్గురిని బట్టి జాతకుడి యొక్క ఆయుష్షు నిర్ణయించచవలసి ఉంటుంది.

అష్టమ భావం లో ఏదైనా గ్రహం ఉండడం కంటే ఆ ఇల్లు ఖాళీగా ఉండడం మంచిది. ఖాళీగా ఉండి, శుభగ్రహాల చేత వీక్షించబడటం ముఖ్యంగా శని గురుల చేత చూడబడడం వలన ఆ జాతకుడు పూర్ణాయుష్మంతుడు అవుతాడు. 

అష్టమ భావంలో రాహు, కేతు, కుజ గ్రహాలు ఉండడం అల్పాయుష్షుని, ప్రమాదాలను సూచిస్తుంది.

అష్టమంలో శనైశ్చరుడు ఉండడం ఒక విచిత్రమైన స్థితి. అతను పాపగ్రహం కాబట్టి గండాలను ఇస్తాడు. ఆయుష్య కారకుడు కాబట్టి ఆయుష్షును ఇస్తాడు. అష్టమంలో శని ఉండి దీర్ఘాయుష్షును పొందిన వారూ ఉన్నారు, అల్పాయుష్షుతో మరణించిన వారూ ఉన్నారు. 

అష్టమాధిపతి బలవంతుడై, కేంద్రాలలో ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు.

లగ్నాధిపతి జాతకంలో బలవంతుడిగా ఉండి కేంద్ర కోణాలలో స్థితి పొందడం, అలాగే అష్టమాధిపతి, శనైశ్చరుడూ కూడా బలం కలిగి ఉండడం జాతకుడిని పూర్ణాయుష్మంతుడిని చేస్తుంది. 

జాతకంలో గజకేసరి యోగం ఉండడం కూడా దీర్ఘాయుష్షుని సూచిస్తుంది. 

చంద్రుడు మరియు బృహస్పతి ఏకాదశ భావంతో సంబంధం కలిగి ఉండడం దీర్ఘాయుష్షును సూచిస్తుంది.

లగ్నాధిపతి అష్టమాధిపతులు కలిసి ఉన్నా పరివర్తన పొందిన అది అల్పాయువుని, గండాలను సూచిస్తుంది.

అష్టమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండడం, అష్టమంలో పాప గ్రహాలు ఉండడం అల్పాయుష్షుని సూచిస్తుంది.

మీ
R Vijay Sharma
పురోహితులు, జ్యోతిష్యులు 
9000532563

13, ఆగస్టు 2024, మంగళవారం

శీఘ్ర వివాహం కొరకు జపం చేసుకోవలసిన మంత్రాలు


శీఘ్రంగా వివాహం జరగడం కోసం పురుషుడు స్త్రీలు చేయగల మంత్రాలు ఇవి. ఏ గ్రహం వలన దోషము ఉంటే ఎటువంటి మంత్రం చదువుకోవచ్చు బ్రాకెట్లో సూచించడం జరిగింది. 

సాధారణంగా జాతకంలో సప్తమాధిపతి ఎవరో చూసుకొని ఆధిపత్య గ్రహానికి ఇక్కడ సూచించబడిన మంత్రాన్ని జపం చేసుకోవడం ఉత్తమం. 

 ఏ జప మంత్రమైనా 40 రోజులలో, లక్ష సంఖ్య పూర్తి చేసినట్లయితే ఉత్తమోత్తమం. కనీసం రోజుకు 1000 చొప్పున 40 రోజులు చేయడం మధ్యమము. 

జపం చేసే సమయంలో బ్రహ్మచర్యము, భూశయనం, పురాణ శ్రవణం, దేవాలయ ప్రదక్షిణం చేస్తూ చేయాలి.

🌺 వివాహ ప్రద ఇంద్రాణీ మంత్రం(సూర్య, శుక్ర గ్రహ ప్రీతికరం) 
ॐ देवेन्द्राणि नमस्तुभ्यं देवेन्द्रप्रिय भामिनि ।
विवाहं भाग्यमारोग्यं शीघ्रलाभं च देहि मे ॥
దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భామినీ।
వివాహం భాగ్య మారోగ్యం శీఘ్ర లాభంచ దేహిమే॥

🌺 వివాహ ప్రద గౌరీ శంకర మంత్రం (చంద్ర గ్రహ ప్రీతికరం)
हे गौरी शंकरार्धांगि । यथा त्वं शंकरप्रिया ।|
तथा माँ कुरु कल्याणि । कान्त कांता सुदुर्लभाम्।।
హే గౌరీ శంకరార్ధాంగీ । యథా త్వం శంకరప్రియా ।
తథా మాం కురు కళ్యాణీ  కాంతా కాంతా సుదుర్లభమ్॥

🌺 వివాహ ప్రద కాత్యాయనీ మంత్రం(రాహు, కుజ గ్రహ ప్రీతికరం) 
ॐ कात्यायनि महामाये महायोगिन्यधीस्वरि ।
नन्दगोपसुतं देवि पतिं मे कुरु ते नमः ।।
ఓం కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరీ।
నందగోపసుతం దేవీ పతిం మే కురు తే నమః।। 

🌺 వివాహ ప్రద గణేశ మంత్రం(బుధ, కేతు గ్రహ ప్రీతికరం)
नमो सिद्धि विनायकाय सर्व कार्य कर्त्रे सर्व विघ्न प्रशमनाय।
सर्व राज्य वश्यकरणाय सर्वजन सर्वस्त्री पुरुष आकर्षणाय श्रीं ॐ स्वाहा॥
నమో సిద్ధి వినాయకాయ సర్వ కార్య కర్త్రే సర్వ విఘ్న ప్రశమనాయ।
సర్వ రాజ్య వశ్యకరణాయ సర్వజన సర్వస్త్రీ పురుష ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా॥

🌺 వివాహ ప్రద శంకర మంత్రం (గురు,శని గ్రహ ప్రీతికరం)
शं शंकराय सकल जन्मार्जित पाप विध्वंस नाय।
पुरुषार्थ चतुस्टय लाभाय च पतिं मे देहि कुरु-कुरु स्वाहा ।।
శం శంకరాయ సకల జన్మార్‍జిత పాప విధ్వంస నాయ।
పురుషార్‍థ చతుష్టయ లాభాయచ పతిం మే దేహి కురు-కురు స్వాహా॥

మీ 
రాజశేఖరుని విజయ్ శర్మ 
9000532563

1, సెప్టెంబర్ 2020, మంగళవారం

LEARN KP ASTROLOGY (Online Video Course in Telugu)

 

LEARN KP ASTROLOGY
(Online Video Course in Telugu)
-BY Astrologer R VIJAY SHARMA
 
Introduction Free Live Webinar on 13th Sep 2020
Classes Starts From 19th Sep 2020
 
20 కి పైగా ముందుగా రికార్డ్ చేయబడిన Youtube వీడియోలు
20 కి పైగా జాతకచక్ర + ప్రశ్న చక్ర విశ్లేషణలు
9 కి పైగా లైవ్ వీడియో క్లాస్ లు
ప్రాథమిక స్థాయి నుండీ Advanced Level వరకూ అందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన శైలిలో వివరణాత్మకంగా
మీకు పూర్వం ఎటువంటి జ్యోతిష అనుభమూ అవసరం లేదు. నేర్చుకోవాలనే ఆసక్తి, దానికోసం సాధన చేయగలిగే సమయం మీవద్ద ఉంటేచాలు.
మీ ఇంటివద్దనే ఉండి, మీకు వీలైన సమయంలో రోజూ ఒక గంట సాధన చేయడం ద్వారా మూడు నెలల్లో జ్యోతిషంలో మీరే స్వయంగా ఫలిత నిర్ణయం చేయగలిగే విధంగా తయారవండి.
Course Fee Rs. 10,116 only 
 
మరిన్ని వివరాలకై సంప్రదించండి :
R VIJAY SHARMA
MA Astrologer, KP and CIL Astrologer
CELL NO : 9000532563
rvj.astropandit@gmail.com 
 

7, అక్టోబర్ 2016, శుక్రవారం

కార్తీకమాసమున మహన్యాసపూర్వక శివాభిషేకములకు గోత్రనామాలు పంపండి




శ్లో|| న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్| న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్||

కార్తీక మాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరియైన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తీకమాసము లో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు విశేషఫలప్రదములు.

      అటువంటి కార్తీక మాసము పాడ్యమి (31-10-2016) మొదలు, అమావాస్య (29-11-2016) వరకు ముప్పైరోజులు "వైదికమిత్ర కార్యాలము" (వనస్థలిపురం, హైదరాబాద్ లోని మాగృహము )నందు ప్రతిరోజూ ఉ.6-00 గం.ల నుండి 10-00 గం.ల వరకు మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకములుజరుగుతున్నవి. కావున భక్తులందరూ ఈ అవకాశమును సద్వినియోగ పరచుకొనగలరు.   ఆసక్తి ఉన్నవారు రు.1516/- చెల్లించినచో వారి గోత్రనామములతో కార్తీకమాసం నెలరోజులు అభిషేకములు జరుగును.

గోత్రనామాలు తెలుపుటకు,  దక్షిణ పంపవలసిన ఎకౌంట్ వివరాల కొరకు rajasekharuni.vijay@gmail.com అనేచిరునామాలో సంప్రదించగలరు

పోయిన సంవత్సరం అందరి గోత్రనామాలతో రోజూ మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, మధ్యలో 2 సార్లు మహాలింగార్చన, మాస శివరాత్రినాడు శ్రీశైలంలో రుద్రహోమం చేశాము. 

 

 

28, జులై 2016, గురువారం

KP Astrology ద్వారా మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవచ్చు

      ప్రతీ ఒక్కరికీ ఏదోఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలు తీవ్రంగా బాధపెట్టనంతకాలం ఫర్వాలేదు. కానీ కొన్ని సమస్యలు  పట్టి కుదిపేస్తుంటాయి. ఒక్కో సందర్భంలో బయటపడే దారి తెలియక కొట్టుమిట్టాడుతుంటాము. అటువంటి సమయంలో జ్యోతిషం మనకు దారిచూపుతుంది. జ్యోతిషంలోని వివిధ ప్రక్రియలలో KP Astrology ఒకటి. ఈ ప్రక్రియ ద్వారా మీ పుట్టినతేదీ వివరాలు తెలియక పోయినా  కేవలం ప్రశ్న ద్వారా సమాధానం చెప్పవచ్చు. ప్రశ్నశాస్త్రానికి ప్రఖ్యాతిగాంచిన KP Astrology మీ డేటాఫ్ బర్త్ తో సంబంధంలేదు. ఆ వివరాలేమీ తెలియక పోయినప్పటికీ చక్కటి ఫలితాలు సాధించగలము.  
 
విద్య, ఉద్యోగం, విదేశీయానం, ప్రేమ, వివాహం, సంతానం, వ్యాపారం లాభనష్టాలు, దాంపత్యం, కోర్టు వ్యవహారం, రాజకీయ పదవి, సినిమా అవకాశం, ప్రమోషన్, ఇల్లు వాహనాలు కొనడం లేదా అమ్మడం ఇలా సమస్య ఏదైనా మీ డేటాఫ్ బర్త్ వివరాలు లేకుండానే ప్రశ్న శాస్త్రం ( KP Astrology ) ద్వారా సమాధానం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. 




1. నాకు వివాహం అవుతుందా?  అవదా? అయితే ఎప్పుడు అవుతుంది?
2. నాకు సంతానయోగం ఉందా! లేదా!?  ఉంటే ఎప్పుడు కలుగుతుంది?
3. నేను పై చదువులు చదువుతానా!?  ఉద్యోగంలో చేరుతానా!?
4. నేను పై చదువులు చదువుతానా!? పెళ్లి చేసుకోసుకుంటానా!?
5. దాంపత్యంలో సమస్యలు తీరుతాయా!?
6. ఉన్న ఉద్యోగం వదులుకుని కొత్త ఉద్యోగంలో చేరడం నాకు లాభమా!?  నష్టమా!?
7. నేను పెట్టే పెట్టుబడి నాకు లాభిస్తుందా!?  లేదా ఫలానా వ్యాపారం నాకు లాభమా నష్టమా!?
8. నా ఋణ బాధలు తీరుతాయా!?
9. సినిమా / రాజకీయం / షేర్స్ వీటిలో. నేను రాణిస్తానా!?
10. నాకు విదేశీ యానం,  అక్కడ ఉద్యోగ యోగం ఉందా!?  ఎప్పుడు వెళ్లగలను?


     ఇలా మనకు నిత్యం మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు ఉంటాయి.  వాటికి సమాధానం ఎలా దొరుకుతుందో,  ఎవరు సరిగ్గా చెప్పగలరో తెలియక సతమతమవుతూ ఉన్నారా! నేను  KP ASTROLOGY ద్వారా మీకు సహాయపడగలను. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పవచ్చు.  అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా!  నేను కాలక్షేపానికి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పను. నాకంత సమయం లేదు. మీ ప్రశ్న లో తీక్షణత ఉండాలి. దానికి సమాధానం దొరికితే మీకు గట్టి లాభం చేకూరుతుందని నేను నమ్మితే తప్పక సమాధానం చెప్తాను.

23, మే 2016, సోమవారం

KP ASTROLOGY ప్రాముఖ్యత ఏమిటి?



శ్రీరామాయ నమః
తమిళనాడు బ్రాహ్మణ కుటుంబీకు లైన ప్రొఫెసర్ క్రిష్ణమూర్తిగారు జ్యోతిష్యంలో ఎంతో శ్రమించి,అనేక ప్రాచ్య పాశ్చాత్య  జ్యోతిష పద్ధతులను పరిశీలించి వాటన్నిటిలో తనకు  జవాబుదొరకని ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో ఒకపద్ధతిని తయారు చేశారు. దానినే క్రిష్ణమూర్తి పద్ధతి ( KP System ) అంటారు. 



ఇది చాలా వరకూ సాంప్రదాయ వైదిక జ్యోతిషమే! కానీ కొన్ని విధానాలను ఇతర పద్ధతుల నుండి తీసుకున్నారు. కొన్నిటిని తాను స్వయం కనిపెట్టారు.  దీనిని మెరుగులు దిద్దిన వైదిక జ్యోతిష్యము అన చెప్పవచ్చు. 


దీనిలో విశేషమేమంటే...
౧. కవల ల జనన సమయం కేవలం 2,3  నిమిషాలు మాత్రమే తేడా ఉంటుంది. రెండు నిమిషాల తేడాతో జాతకాలు ఎలా మారిపోతాయి అనేద ఈ పద్ధతి ద్వారా రుజువులతో నిరూపించ వచ్చు.
౨. ఇందులో ఇలా జరగవచ్చు అనే ఊహాగానాలు ఉండవు, ఇలా జరుగుతుంది అనే ఖచ్చితంగా చెప్పవచ్చు.


౩. నా సిక్త్ సెన్స్ తో చెప్పాను, లేదా నా తపశ్శక్తితో చెప్పాను అంటే ఆధునికులు ఎవరూ నమ్మరు. వారికి ఒక ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా  ప్రకారం ఎవరికైనా ఫలితాన్ని సరిగా చెప్పినప్పుడు అది ఒక శాస్త్రంగా నమ్ముతారు. క్రిష్ణమూర్తి గారి తపస్సు ఫలితంగా నేడు మనకి అటువంట కొన్ని సూత్రాల సారంగా ఈ కేపీ జ్యోతిషం లభించింది అని చెప్పవచ్చు. ఫలితాలను సూత్ర బద్ధంగా నిరూపించ వచ్చు. అసలు KP ( క్రిష్ణమూర్తి పద్ధతి ) లో సాధన చేసే జ్యోతిష్యులు నేను ఊహించాను అనే మాటవాడడం సమ్మతించరు.  నేను సూత్రాలను అనుసరించి ఫలితాలు చెప్పాను {అంటే Predict  చేశాను} అనే మాటే వాడతారు.

౪. ఇందులో ప్రశ్నశాస్త్రం ( Horary )  విశేషంగా వివరింప బడింది. దీనిద్వారా ఏ ప్రశ్నకైనా ఖచ్చితమైన జవాబులు చెప్పవచ్చు. ప్రశ్న అడిగినప్పుడు 1 నుండి 249 లోపు ఒక సంఖ్య చెప్పమంటారు. అలా అని ఇది
ఇది న్యూమరాలజీ కాదు. ఆనెంబరు ద్వారా లగ్నాన్ని, భావాలను, గ్రహస్థితులను గుర్తించి జవాబు చెప్తారు. 


కేవలం ప్రశ్నభాగానికే ఉపయోగిస్తుందనీ, జన్మ జాతకానికి పనికిరాదని కొందరి వాదన. కానీ అది సరికాదు. దీనిద్వారా జన్మ జాతకం పరిశీలించి కచ్చితమైన ఫలితాలు చెప్పవచ్చు.

 
"ఈ పద్ధతే ఉత్తమమైనదా!? నేను పూర్వం వైదిక పద్ధతిలో సాధన చేసే వాడిని, ఈ పద్ధతిలోకి మారాలా వద్దా!?" అని చాలా మంది అడుగుతూ ఉంటారు.
దానికి నా సమాధానం ఒక్కటే! ఇది వైదిక విరుద్ధమైనది కాదు. సాంప్రదాయ పద్ధతికి మెరుగులు దిద్దబడిన పద్ధతి మాత్రమే! ఇక ఏది ఉత్తమమైనది అంటే మీరు సాధన చేస్తే ఎందులోనైనా ఉత్తమ ఫలితాలు చెప్పవచ్చు. మీకు ప్రత్యక్ష గురువులు ( అంటే ఏపుస్తాకలలో నేర్చినదో కాక, దానిని నేర్పించే వారు స్వయంగా ) ఏపద్ధతిలో దొరుకుతారో మీకు ఆపద్ధతి ఉత్తమమైనది. ( ఇది నా అభిప్రాయం మాత్రమే )


ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ