15, ఆగస్టు 2024, గురువారం

జాతకంలో ఆయుష్షు నిర్ణయించడం ఎలా?

అష్టమ భావం, అష్టమాధిపతి, ఆయుష్యకారకుడు శనైశ్చరుడు వీరి ముగ్గురిని బట్టి జాతకుడి యొక్క ఆయుష్షు నిర్ణయించచవలసి ఉంటుంది.

అష్టమ భావం లో ఏదైనా గ్రహం ఉండడం కంటే ఆ ఇల్లు ఖాళీగా ఉండడం మంచిది. ఖాళీగా ఉండి, శుభగ్రహాల చేత వీక్షించబడటం ముఖ్యంగా శని గురుల చేత చూడబడడం వలన ఆ జాతకుడు పూర్ణాయుష్మంతుడు అవుతాడు. 

అష్టమ భావంలో రాహు, కేతు, కుజ గ్రహాలు ఉండడం అల్పాయుష్షుని, ప్రమాదాలను సూచిస్తుంది.

అష్టమంలో శనైశ్చరుడు ఉండడం ఒక విచిత్రమైన స్థితి. అతను పాపగ్రహం కాబట్టి గండాలను ఇస్తాడు. ఆయుష్య కారకుడు కాబట్టి ఆయుష్షును ఇస్తాడు. అష్టమంలో శని ఉండి దీర్ఘాయుష్షును పొందిన వారూ ఉన్నారు, అల్పాయుష్షుతో మరణించిన వారూ ఉన్నారు. 

అష్టమాధిపతి బలవంతుడై, కేంద్రాలలో ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు.

లగ్నాధిపతి జాతకంలో బలవంతుడిగా ఉండి కేంద్ర కోణాలలో స్థితి పొందడం, అలాగే అష్టమాధిపతి, శనైశ్చరుడూ కూడా బలం కలిగి ఉండడం జాతకుడిని పూర్ణాయుష్మంతుడిని చేస్తుంది. 

జాతకంలో గజకేసరి యోగం ఉండడం కూడా దీర్ఘాయుష్షుని సూచిస్తుంది. 

చంద్రుడు మరియు బృహస్పతి ఏకాదశ భావంతో సంబంధం కలిగి ఉండడం దీర్ఘాయుష్షును సూచిస్తుంది.

లగ్నాధిపతి అష్టమాధిపతులు కలిసి ఉన్నా పరివర్తన పొందిన అది అల్పాయువుని, గండాలను సూచిస్తుంది.

అష్టమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండడం, అష్టమంలో పాప గ్రహాలు ఉండడం అల్పాయుష్షుని సూచిస్తుంది.

మీ
R Vijay Sharma
పురోహితులు, జ్యోతిష్యులు 
9000532563

1 కామెంట్‌:

  1. కారకగ్రహసంయుక్తః భావః స్వల్పఫలప్రదః అన్నందువలన ఆరుష్కారకుడు శని అష్టమంలో అల్పాయుష్కారకుడే. ఐతే సహజపాపి ఐన శనికి పీఠికపైన ఎటువంటి బలం ఉన్నదీ అన్నది ముఖ్యం. బలహీనుడైన శని ఐన పక్షంలో ఆయుర్భావాధిపతి బలంగా ఉంటే ఆయుర్దాయం బాగుంటుంది. ముఖ్యంగా ఎనిమిదింటికి నైసర్గికశుభగ్రహ దృష్టి కూడా కలిసివస్తుంది.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.