13, ఆగస్టు 2024, మంగళవారం

శీఘ్ర వివాహం కొరకు జపం చేసుకోవలసిన మంత్రాలు


శీఘ్రంగా వివాహం జరగడం కోసం పురుషుడు స్త్రీలు చేయగల మంత్రాలు ఇవి. ఏ గ్రహం వలన దోషము ఉంటే ఎటువంటి మంత్రం చదువుకోవచ్చు బ్రాకెట్లో సూచించడం జరిగింది. 

సాధారణంగా జాతకంలో సప్తమాధిపతి ఎవరో చూసుకొని ఆధిపత్య గ్రహానికి ఇక్కడ సూచించబడిన మంత్రాన్ని జపం చేసుకోవడం ఉత్తమం. 

 ఏ జప మంత్రమైనా 40 రోజులలో, లక్ష సంఖ్య పూర్తి చేసినట్లయితే ఉత్తమోత్తమం. కనీసం రోజుకు 1000 చొప్పున 40 రోజులు చేయడం మధ్యమము. 

జపం చేసే సమయంలో బ్రహ్మచర్యము, భూశయనం, పురాణ శ్రవణం, దేవాలయ ప్రదక్షిణం చేస్తూ చేయాలి.

🌺 వివాహ ప్రద ఇంద్రాణీ మంత్రం(సూర్య, శుక్ర గ్రహ ప్రీతికరం) 
ॐ देवेन्द्राणि नमस्तुभ्यं देवेन्द्रप्रिय भामिनि ।
विवाहं भाग्यमारोग्यं शीघ्रलाभं च देहि मे ॥
దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భామినీ।
వివాహం భాగ్య మారోగ్యం శీఘ్ర లాభంచ దేహిమే॥

🌺 వివాహ ప్రద గౌరీ శంకర మంత్రం (చంద్ర గ్రహ ప్రీతికరం)
हे गौरी शंकरार्धांगि । यथा त्वं शंकरप्रिया ।|
तथा माँ कुरु कल्याणि । कान्त कांता सुदुर्लभाम्।।
హే గౌరీ శంకరార్ధాంగీ । యథా త్వం శంకరప్రియా ।
తథా మాం కురు కళ్యాణీ  కాంతా కాంతా సుదుర్లభమ్॥

🌺 వివాహ ప్రద కాత్యాయనీ మంత్రం(రాహు, కుజ గ్రహ ప్రీతికరం) 
ॐ कात्यायनि महामाये महायोगिन्यधीस्वरि ।
नन्दगोपसुतं देवि पतिं मे कुरु ते नमः ।।
ఓం కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరీ।
నందగోపసుతం దేవీ పతిం మే కురు తే నమః।। 

🌺 వివాహ ప్రద గణేశ మంత్రం(బుధ, కేతు గ్రహ ప్రీతికరం)
नमो सिद्धि विनायकाय सर्व कार्य कर्त्रे सर्व विघ्न प्रशमनाय।
सर्व राज्य वश्यकरणाय सर्वजन सर्वस्त्री पुरुष आकर्षणाय श्रीं ॐ स्वाहा॥
నమో సిద్ధి వినాయకాయ సర్వ కార్య కర్త్రే సర్వ విఘ్న ప్రశమనాయ।
సర్వ రాజ్య వశ్యకరణాయ సర్వజన సర్వస్త్రీ పురుష ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా॥

🌺 వివాహ ప్రద శంకర మంత్రం (గురు,శని గ్రహ ప్రీతికరం)
शं शंकराय सकल जन्मार्जित पाप विध्वंस नाय।
पुरुषार्थ चतुस्टय लाभाय च पतिं मे देहि कुरु-कुरु स्वाहा ।।
శం శంకరాయ సకల జన్మార్‍జిత పాప విధ్వంస నాయ।
పురుషార్‍థ చతుష్టయ లాభాయచ పతిం మే దేహి కురు-కురు స్వాహా॥

మీ 
రాజశేఖరుని విజయ్ శర్మ 
9000532563

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.