మన భాగ్యనగరంలో ఈ నెల 17 నుండీ 27 వరకు నెక్లెస్ రోడ్డులో పుస్తక ప్రదర్శన జరగనున్నది. ఆ ప్రదర్శనలో భాగంగా మన ఇ-తెలుగు వారిచేత ఒక స్టాలు నిర్వహించ బడుతున్నది. ఈ స్టాలులో అంతర్జాలంలో మన తెలుగు అభివృద్ధిని గురించి వచ్చిన వారికి వివరించబడుతుంది.
అందులో భాగంగా తెలుగులో బ్లాగుల పరిచయం, వాటి పురోగతి మొదలగు విషయాలను తెలియజేయడం జరుగుతుంది. మిరు భాగ్యనగరం వారై ఉండి, బ్లాగును నిర్వహిస్తున్నట్లైతే మీ బ్లాగుని పరిచయం చేసుకునే అవకాశం కూడా అక్కడ కల్పిస్తున్నారు.
మరింకెందుకు ఆలస్యం... మీ వీలుచూసుకుని ఆ పదిరోజులలో వీలైనన్ని సార్లు రండి. మనం అందరం అక్కడ కలుసుకోవచ్చు. కొత్త స్నేహం మొదలు పెట్టవచ్చు. బ్లాగుల గురించి తెలియని వారికి మనకు తెలిసినది పరిచయం చేయవచ్చు.
నాకు కొత్త, అక్కడ నాకు ఎవరూ తెలియదు, ఎవరిని ఎలా కలవాలి? కలిసినా ఏం మాట్లాడాలి ? అని ఆలోచిస్తున్నారా? నాకూ కొత్తే నండీ. నాకూ ఎవరూ తెలియదు. వెళ్లి తెలుసుకోడమే. మాటలు కలపడం మీకు రాకపోతే అక్కడ ఎవరో ఒకరు కలుపుగోలు వ్యక్తులు ఉంటారు లెండి. ముందు బయలుదేరి రండి. తరువాత కాలం దానంతట అదే గడుస్తుంది.
స్థలం: పీపుల్స్ ప్లాజా గ్రౌండ్, నెక్లెస్ రోడ్, పుస్తక ప్రదర్శనా కేంద్రం.
ఎప్పటి నుండి: డిసెంబర్ 17 నుండీ 27 వరకు.
సమయం: మామూలు రోజుల్లో మధ్యహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు
శని ఆది వారాల్లో మధ్యహ్నం 12 గం.ల నుండి రాత్రి 9 గంటల వరకు
అలాగే ఈ నెల 13 వ తేదీన కూడా అంటే రేపే సాయంత్రం 3 గం.ల నుండి , 5 గం.ల వరకు, యూసఫ్ గూడా బస్తీ లో కల కృష్ణకాంత్ ఉద్యానవనం లో కూడా మన తెలుగు బ్లాగరులందరూ కలుస్తున్నారు. నేను వెళ్దామనుకుంటున్నాను. మీరూ వస్తారా?
పురోహిత విషయాలు మరియు జ్యోతిష్య విషయాలు చర్చిస్తాను. ఎవరైనా నేను సమస్త జ్యోతిశ్శాస్త్రాన్నీ ఔపోశన పట్టాను అంటే అది అసత్యమే! ఎంత నేర్చినా తరగని సముద్రం జ్యోతిష్యం. నేనూ విద్యార్థినే! నేను నేర్చిన జ్యోతిష్యం మీకూ సాధ్యమైనంత సులభ పద్ధతిలో నేర్పే ప్రయత్నం చేస్తాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
tappa kumDa vastaanu
రిప్లయితొలగించండిమనమక్కడ కలుస్తామని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ బాగు౦ద౦డీ.
రిప్లయితొలగించండిమా అమ్మ రాసిన రామాయణము గురి౦చి రాసాను .మీకు వీ లైనప్పుడు చూడ౦డి .
http://kamalamadapati.blogspot.com/2009/07/blog-post_13.html
ధన్యవాదాలు. తప్పకుండా వస్తాను మీ బ్లాగుకు . ఈ రోజు మన బ్లాగరుల దినోత్సవం కదా. క్రిష్ణకాంత్ పార్క్ లో మనవారిని కలవడానికి బయలుదేరుతున్నాను. అందుకే ఇప్పుడు చదవడం కుదరటం లెదు. మళ్లీ కలుస్తా. :)
రిప్లయితొలగించండి