ప్రతి సంవత్సరం డిసెంబరు 2 వ ఆదివారం ను తెలుగు బ్లాగుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా రేపు తెలుగు బ్లాగరులందరూ ప్రతీ ప్రధాన నగరాల లోనూ కలుసుకోవడము, బ్లాగుల బాగోగుల గురించి చర్చించుకోవడము చేస్తున్నారట. నాకెందుకో మన తెలుగు బ్లాగరులతో కొత్త స్నేహం మొదలుపెట్టడానికి ఇది మంచి అవకాశంలాగా కనిపిస్తోంది. మనం అందరం కలుసుకోవచ్చన్న ఊహే చాలా ఉత్సాహాన్నిస్తోంది. ఎంత ఎక్కువమందిమి వస్తే అంత బాగుంటుంది రేపటి సాయంత్రం.
మన భాగ్యనగరంలో ఈ సమావేశం జరిగే
స్థలం : కృష్ణ కాంత్ ఉద్యాన వనం, యూసఫ్ గూడా బస్తీ .
సమయం : రేపు అనగా డిసెంబర్ 13 న సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు.
పురోహిత విషయాలు మరియు జ్యోతిష్య విషయాలు చర్చిస్తాను. ఎవరైనా నేను సమస్త జ్యోతిశ్శాస్త్రాన్నీ ఔపోశన పట్టాను అంటే అది అసత్యమే! ఎంత నేర్చినా తరగని సముద్రం జ్యోతిష్యం. నేనూ విద్యార్థినే! నేను నేర్చిన జ్యోతిష్యం మీకూ సాధ్యమైనంత సులభ పద్ధతిలో నేర్పే ప్రయత్నం చేస్తాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తప్పకుండా కలుద్దాం శర్మగారు...వ్యాపార సమావేశాలకి, కుటుంబ సమావేశాలికి హాజరవ్వడమే తెలుసు ఇంతకాలం. ఇప్పుడు పరోక్షంగా తెలిసిన వ్యక్తులను ప్రత్యక్షంగా కలవగలిగే ఈ సమావేశానికి హాజరవ్వాలని చాలా ఉత్సుకతగా ఉంది.
రిప్లయితొలగించండిస్వాగతం రాజన్ గారు. మనం అక్కడ కలుద్దాం.
రిప్లయితొలగించండిBangalore lo ekkada jarugutundi blog dinostavam
రిప్లయితొలగించండిఉమ గారు:నాకు తెలియదండీ. మీరో పని చెయ్యవచ్చు. ఓ సారి తెలుగుబ్లాగు అనే గ్రూపులో అడిగి చూడండి. తెలియవచ్చు.
రిప్లయితొలగించండి