పురోహిత విషయాలు మరియు జ్యోతిష్య విషయాలు చర్చిస్తాను. ఎవరైనా నేను సమస్త జ్యోతిశ్శాస్త్రాన్నీ ఔపోశన పట్టాను అంటే అది అసత్యమే! ఎంత నేర్చినా తరగని సముద్రం జ్యోతిష్యం. నేనూ విద్యార్థినే! నేను నేర్చిన జ్యోతిష్యం మీకూ సాధ్యమైనంత సులభ పద్ధతిలో నేర్పే ప్రయత్నం చేస్తాను.
14, డిసెంబర్ 2009, సోమవారం
నిన్న భాగ్యనగరంలో ఉండే చాలామంది బ్లాగరులం కలిశాము
నిన్న డిశెంబరు 2వ ఆదివారం బ్లాగరుల దినోత్సవం సందర్భంగా మన భాగ్యనగర వాసులమందరము యూసఫ్ గూడాలో కల క్రిష్ణ కాంత్ పార్క్ లో కలుసుకుని సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఆ వివరాలు మీకోసం.
నేను ముందు అనుకున్నట్టుగా 2.30 కల్లా పార్కు దగ్గరకు వచ్చి వీవెన్ గారుకి ఫోన్ చేశాను. అప్పుడే వచ్చేశారా? ఇంకా ఎవరూ రాలేదేమో మీరు సి.బి. రావు గారికి ఫోన్ చెయ్యండి. నేను కాస్త ఆలస్యంగా వస్తాను అని వీవెన్ గారు చెప్పే సరికి, నేనంటే మొదటిసారి కనుక ఉత్సాహం కొద్దీ టైమంటే టైమ్ కి వచ్చేశాను. మిగతావారు రావద్దూ... కంగారెందుకు అని నన్ను నేను సముదాయించుకుని నాతో వచ్చిన నా చిననాటి స్నెహితుడు వీరు, శ్రీనివాస్ ( ఈ మధ్యే కొత్తగా పరిచయమైనారు ) లతో కబుర్లలో పడ్డాను.
ఈ లోపు రమణ అనే బ్లాగరు వచ్చి తెలుగు బ్లాగర్సా అని అడిగి పరిచయం చేసుకున్నారు. కాస్త పంచకట్టు, వీబూధిరేఖలతో ఉన్న నన్ను చూసి నేనే వీవెన్ గారినేమో అనుకున్నారట. మరికొంత సేపటితరువాత " కూడలి " టీ షర్ట్ వేస్తుకుని ఎవరో కనిపించారు. కాస్త పరీక్షగా చూస్తే ( పాపం మొహం నిండా గాయాలు ) అది చక్రవర్తిగారు. నమస్తే చక్రవర్తిగారు. అని పలకరించాను. నమస్తే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను అన్నారు. నన్ను పరిచయం చేసుకున్నాను. అందరూ లోపలే ఉన్నారు అని చెప్పడంతో లోపలికి వెళ్ళాము.
అక్కడ అప్పటికే పద్మనాభం గారు, కాశ్యప్ గారు, మురళీ ధర్ గారు, శిరీష్ కుమార్ గారు ఉన్నారు. నేనే ముందువచ్చాననుకున్నాను. వాళ్లు నాకంటే ముందు వచ్చి అక్కడ ఉన్నారు. వారు ( ఇ- తెలుగు కార్యవర్గం వారు ) రేపు జరగబోయే పుస్తక ప్రదర్శన వద్ద ఇ-తెలుగు స్టాల్ కు ఏవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలో చర్చించుకుంటున్నారు. నేను వెళ్లి శిరీష్ గారి ప్రక్కన కూర్చున్నాను. వారితో పరిచయం చేసుకుని, మిగతా వారి గురించి తెలుసుకున్నాను. ఈలోపు మరికొంత మంది వచ్చి మాతో చేరారు. మొదట అందరం పరిచయం చేసుకున్నాము.
పరిచయకార్యక్రమం చక్రవర్తి గారితో మొదలైంది.
1.చక్రవర్తి గారు- భవదీయుడు బ్లాగరు.
2.రవి గారు- రవి గారు బ్లాగరు.
3.వేంకట రమణ గారు- తపన బ్లాగరు.
4.రవి చంద్ర గారు- అంతర్వాహిని బ్లాగరు.
5.రాజన్ గారు- నా గోల బ్లాగరు.
6.అజయ్ గారు- కొక్కొరకో బ్లాగరు.
7.శిరీష్ కుమార్ గారు- చదువరి బ్లాగరు.
8.కోడి హళ్లి మురళీ మోహన్ గారు- తురుపుముక్క అనే బ్లాగు, కథాజగత్ అనే వెబ్ సైట్ లను వీరు నడుపుతున్నారు.
9.సత్యన్నారాయణ గారు- ఆంధ్రలేఖ అనే వెబ్ సైట్ ను నడుపుతున్నారు.
10.సి. బి. రావు గారు- దీప్తి ధార బ్లాగరు.
11.పద్మనాభం గారు- తెలుగు గ్రీటింగ్స్ అనే వెబ్ సైట్ ను నడుపుతున్నారు. వీరు ఇ-తెలుగు అధ్యక్షులు.
12.క్రిష్ణ కిషోర్ గారు- నువ్వుసెట్టి బ్రదర్స్ బ్లాగరు.
13.శ్రీనివాసరాజు గారు- -హరివిల్లు అనే వెబ్ సైట్ నడుపుతున్నారు.
14.శ్రీనివాస కుమార్ గారు- జీవితంలో కొత్త కోణం బ్లాగరు.
15.వీవెన్ గారు- వీవెనుడి టెక్కునిక్కులు బ్లాగరు.
16.కాస్యప్ గారు- telugu lo kaburlu చెప్పాలని ఉంది బ్లాగరు.
17.మురళీ ధర్ గారు- మురళీ గానం బ్లాగరు.
18.సుజాత గారు- మనసులో మాట బ్లాగరి.
19.సుజన ( సుజ్జి ) గారు- naalo nenu బ్లాగరి. వీరి స్నేహితురాలిని కూడా తీసుకు వచ్చారు.
20.వీరబాబు గారు- బ్లాగుల గురించి తెలుసుకోవాలని నేను తీసుకువచ్చాను. బ్లాగులు ఇంకాలేవు.
21.శ్రీనివాస్ గారు- చరణ్ వికాస్ కేంద్రం అనే వెబ్ సైట్ ను తెలుగులో రాయడం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చారు.
22.రాజశేఖరుని విజయ్ శర్మ- ఇది నేనే
వచ్చిన వారందరూ ఒకరి తరువాత ఒకరు పరిచయం చేసుకుంటుంటే, మిగతావారు ప్రశ్నలు సంధిస్తుంటే పరిచయకార్యక్రమం సరదాగా ముగిసింది. సత్యనారాయణ గారు ఆంధ్రలేఖ బ్లాగరులకు పోటీలు నిర్వహిస్తోందని, ఉత్తమ రచన అనిపించిన బ్లాగరుకు తగిన బహుమతులు ఉంటాయని తెలిపారు. తరువాతికాలంలో తమకు నచ్చిన వారిని తమ భవిష్యత్ కార్యకలాపాలలో రచయతలుగా వినియోగించుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు. తరువాత ఇ-తెలుగు కార్యకలాపాల గురించి పద్మనాభం గారు క్లుప్తంగా వివరించారు. రేపు భాగ్యనగరంలో జరిగే బుక్ ఫెయిర్ లో పెట్టే ఇ- తెలుగు స్టాలు వద్ద ఉండేందుకు, చూడడానికి వచ్చిన వారికి అంతర్జాలంలో తెలుగు అభివృద్ధి గురించి, బ్లాగుల గురించి వివరించడానికి ఉత్సాహవంతులైన వారు కావలని చెప్పారు. అదిముగిసినతరువాత ఎవరికి వారు ఒకరితో ఒకరు కాసేపు మాట్లాడుకుని, కాఫీలు తాగి 7 గంటలు అవుతోందనగా ఇంటికి బయలుదేరాము.
ఈ తతంగమంతా సరదాగానే గడిచింది. ఇందులో నాతో సహా సగం మంది మొదటి సారి వచ్చినవారే. స్త్రీలు ఎక్కువగా రాకపొవడానికి తోటి బ్లాగరులే కారణం అని తెలిసి కాస్త బాధ అనిపించింది. ఏది ఎమైనా బ్లాగు పరిచయాలు , ముఖ పరిచయాల వరకూ వస్తే అంచనాలు తారుమరయ్యే అవకాశం చాలాఉంది. ఎందుకంటే బ్లాగులో వ్యక్తమయ్యే భావాలే , మనిషి ఎదురుగా ఉన్నప్పుడూ ఉంటాయన్న నమ్మకంలేదు. నిన్న మాత్రం అక్కడికి వచ్చిన వారందరూ చాలా సరదాగానే నలుగురిలో కలిసిపోయారు. సమయం తెలియకుండానే గడిచి పోయింది. :)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సమావేశం గురించి బాగా వ్రాశారు. బ్లాగర్లందరూ పరిచయం కావడం సంతోషాన్నిచ్చింది. అయితే నేను ఆశించిన మేరకు బ్లాగర్లు సమావేశానికి హాజరు కాకపోవడం కాస్త నిరాశను కలిగించింది. హైదరాబాద్ బుక్ ఫెస్టివల్‌లో తెలుగు స్టాల్లో మరికొందరు పరిచయమౌతారని ఎదురుచూస్తున్నాను.
రిప్లయితొలగించండినేనూ అలాగే అనుకుంటున్నాను మురళీ మోహన్ గారు.
రిప్లయితొలగించండిశర్మగారు ఫోటో లో ఆ జంట ని తియ్యాలన్న తపన ని పక్కన పెట్టి , ఆ జంట కూర్చున్న చోటునుంచి తీసి వుంటే మరిన్ని బ్లాగర్ల మొఖాలు కనబడేవేమో?
రిప్లయితొలగించండిఏ జంటని రవి గారు? ఏ జంటో నాకు తెలియడంలేదు. ఇంకో విషయం ఇది నేను తీసిన ఫోటో కాదు. నా స్నేహితుడు వీరబాబు తీసిన పోటో. ఒక్కసారి గమనించండి నా ప్రక్కన ఉన్న స్థలం ఖాళీగా కనిపిస్తుంది. అక్కడే అతను కూర్చున్నది. :)
రిప్లయితొలగించండిఫోటో లోడ్ అవుతుంటే ముందు గా వాళ్ళే కనబడితే అలా సరదాగా రాసా , నాకు తెలుసు అది మీ ఫ్రెండ్ తీసాడని .
రిప్లయితొలగించండిమీరు అడిగారు కాబట్టి మరికొన్ని చిత్రాలను జతపరుస్తున్నాను. ఇవి కూడా నేను తీసినవి కాదు. మిమ్మల్ని నిరాశ పరిస్తే నా తప్పుకాదు.
రిప్లయితొలగించండిఫొటోలు పెట్టినందుకు ధన్యవాదములండి
రిప్లయితొలగించండిచాలా బాగా కళ్ళకు కట్టినట్టు రాశారు.
రిప్లయితొలగించండి"స్త్రీలు ఎక్కువగా రాకపొవడానికి తోటి బ్లాగరులే కారణం అని తెలిసి కాస్త బాధ అనిపించింది."
ఈ వాక్యం అర్థమయ్యీ కానట్టు అనిపిస్తూంది.
ఇక్కడ కూడా పురుషులతో కలవాల్సిన అవసరం ఏముంది. నిజానికి, పురుషులకంటే స్త్రీలే శ్రద్ధగా బ్లాగులను అప్‌డేట్ చేస్తున్నారు. సబ్జెక్టులు కూడా చాలా ఎక్కువ కవర్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, బ్లాగర్స్‌లో స్త్రీల సంఖ్యే ఎక్కువనుకుంటా. అలాంటప్పుడు, స్త్రీ బ్లాగరులందరూ ఒక ప్రత్యేక గొడుగు ఏర్పాటు చేసుకోవచ్చు కదా. కాషాయం ధరించిన వాళ్లలో గూడా పరమ వంకర నాయాళ్లున్నారు. పురుష బ్లాగర్లలో వంకరగాళ్లు ఉండరని అనుకుంటే అది అమాయకత్వం మాత్రమే. ఈరోజుల్లో పరమనీతులు చెప్పే వాళ్లని గూడా ఓ కంట కనిపెట్టడం కనీస ధర్మం. ఆత్మీయ పలకరింపులో ఎంత నాటకం దాగుందో అనుభవిస్తే గాని తెలియదు. స్త్రీ బ్లాగర్లను కేవలం తమ సంస్థకు అలంకారప్రాయం కోసం వాడుకునే పురుష బ్లాగర్లతో కలిసి పనిచేసే బదులు స్త్రీ బ్లాగర్లు సొంతంగా ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవడం మంచిది. అప్పుడు మీరే రాజు, మీరే రాణి. కాదూ కూడదని పురుష బ్లాగర్లతో కలిసి ఉంటే మీరు ఇక శాశ్వత బంటుగానే మిగిలిపోతారు.
తొలగించండి@ శిశిర
రిప్లయితొలగించండిమీకు పూర్తిగా అర్ధం కావాలంటే తెలుగు బ్లాగుల చరిత్ర అంతా తెలుసుకోవాలి. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనుకుంటారు మీరు.
i missed it
రిప్లయితొలగించండిబ్లాగులు చదవడం ప్రారంభించి ఇంకా 6 నెలలైనా కాని పసిదాన్ని నేను, తెలియక అడుగుతున్నాను...తెలుగు బ్లాగ్లోకం లో స్త్రీలు పడుతున్న పాట్లేమిటో, వారు రాకపోవడానికి తోటి బ్లాగర్లు ఎల సహాయపడ్డారో వివరించే తెలుగు బ్లాగు చరిత్రని ఎవరైనా విశదీకరించగలరని మనవి.
రిప్లయితొలగించండిmaadi guntur kanuka nenu raalekapoyanu.
రిప్లయితొలగించండిnaku kooda soumya gaariki vachina sandehame vachindi..
teercharuuu...
కొత్త బ్లాగర్లకు,,
రిప్లయితొలగించండిఅంతగా కంగారు పడకండి. గతం గత:.. హాయిగా రాసుకోండి. వీలైతే వచ్చే శనివారం లేదా సోమవారం పుస్తక ప్రదర్శనలో మన స్టాలులో కలుద్దాం.. శర్మగారు మీ రిపోర్టుకు ధన్యవాదాలు. కూడలి కబుర్ల నివేదిక కూడా B&G లో వచ్చిందిగా..కొత్త బ్లాగర్లకు సహాయం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఇధి నా మాట.. నేను అలాగే నేర్చుకున్నాను, కుంటున్నాను..
కెవ్వ్ , అది నా ఫోటో నేనా ! అమ్మో అర్జంటుగా వళ్ళు తగ్గాలి !!!
రిప్లయితొలగించండిశిశిర గారు, సౌమ్య గారు, సంతోష్ గారు : నాకూ సరిగ్గా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు.
రిప్లయితొలగించండిసాధారణంగా ఓ పదిమంది చేరిన చోట ఓ ఇద్దరో ముగ్గురో పేర్లు పెట్టే వారుంటారు కదండీ.. అది సహజం. స్త్రీలు ఇలాంటి వాటికి వెరచేరోజులు ఎప్పుడో పోయాయి. నేడు కాలేజీలలో చదివే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఆ కామెంట్లని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు.
కానీ మన స్త్రీ బ్లాగర్లే ఇంకా వెలుపలికి రావడానికి సంశయిస్తున్నారు. త్వరలోనే వారూ అందరితో కలిసి ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. :)
జాన్ గారు : మరి పుస్తక ప్రదర్శనలో కలుద్దాం. అది జారవిడవకండి :)
జ్యోతి గారు: మీరన్నట్టు కొత్త బ్లాగర్లకు తోడునిలవటానికి మేము సిద్ధం. :)
కశ్యప్ గారు : హ హ హా.. మీరు నన్ను మన్నించాలి. :)
సమావేశం గురించి బాగా వ్రాశారు.
రిప్లయితొలగించండి