భారతం అంతా కొత్త పుంతలు తొక్కుతున్నది. నాగరికత పేరుతో నవ నాట్యం చేస్తున్నది. ఈ నవీన భారతంలో పురోహితుడిగా నా ఉనికే ప్రశ్నార్థకమవుతున్నది. సనాతన ధర్మం నేడు అధర్మం అవుతున్నది. నిత్య నూతనమై విరాజిల్ల వలసిన భారతీయ ధర్మం ఇలా నేడు విమర్శించ బడుటకు కారణమేమిటి? నేడు నేననుసరించ వలసిన ధర్మమెమిటి? ఏది సత్యం? ఏది నిత్యం? ఎన్నో ప్రశ్నలు.కొన్ని సంశయాలు. కొన్ని సమాధానాలు.
నాకు తెలుసు నా భారతీయ సాంప్రదాయం చాలా గొప్పదని. ఎందరో మహర్షుల త్యాగ ఫలమనీ. నేడే కాదు మరి పది శతాబ్దాలకైనా తలవంచని గట్టి పునాదులు నా భారతీయతలో కలవనీ. కానీ అలా నేడు వినిపిస్తున్న విభిన్న స్వరాలను దాటి నా భారతీయ గానం ఎలుగెత్తి పాడాలంటే కొన్ని సవరణలు జరగాలి. ఏ పురాణం చదివినా మనకు ఓ సత్యం గోచరించక మానదు. అదే "మార్పు" త్రేతాయుగంలో ఉన్నట్లు ద్వాపరయుగంలో లేదు.అప్పుడున్నట్లు ఇప్పుడులేదు. ఈ మార్పు మాత్రం ఎప్పుడూ ఉంది . ఇదే నిత్యంగా గోచరిస్తున్నది. ఆనాటి బహుభార్యత్వాన్ని కాదని ఏకపత్నీ వ్రతాన్ని అవలంబించిన రాముడు మన ఆరాధ్యపురుషుడయ్యాడు. నేటికీ ఆదర్శమయ్యాడు. ఇలా అనాది నుండీ మన సాంప్రదాయాలలో కానీ, ధర్మాలలో కానీ అనేక మార్పులు జరుగుతునే ఉన్నాయి. కానీ ఈ కలియుగ ప్రారంభం నుండీ ఆ మార్పులు స్థంభించాయనే చెప్పాలి. కలిప్రభావం అనుకుంటా. అలా స్థంభించడం వల్ల కొందరు మనవారే మన సాంప్రదాయాన్ని విడనాడి, మనల్నే కించ పరిచే విధంగా దూషణలు ప్రారంభించారు. కొందరు ప్రాచీన సాంప్రదాయం పేరుతో తమమనోభీష్టాలను ప్రజలకు నూరిపోసి ధర్మాలను తమస్వార్థప్రయోజనాలకు వాడుకున్నారు. అంటరానితనం, స్త్రీ దాసీ తత్వం వంటి ఎన్నో అకృత్యాలను మనకు తెలియకుండానే మన ధర్మం అంటూ మన అణువణువునా నింపేశారు. దాని వలన మన భారతీయత ఎన్నో విమర్శలకు తావిచ్చినట్లయింది.
ఈ ఆటు పోటులలో కూడా నేటికీ నేను భారతీయుడినని ధైర్యంగా చెప్పుకుంటున్నామంటే అందుకు మన పునాదులే కారణం కానీ, నేడు మనం చూస్తున్న భారతీయత కాదు. ఒక వైపు అతి వాద భారితీయులు, మరో వైపు కన్న భారతావనినే నీచంగా తెగనాడే తివ్రవాదుల మధ్య సగటు భారతీయుడు తీవ్రమైన మనో వేదనకు గురి అవుతున్న నేటి రోజులలో ఓ పురొహితుడిగా నేను జన్మించాను.
ఒక్కప్పుడు హిందూ వ్యవస్థకు తానే మార్గదర్శకుడై వెలుగొందిన బ్రాహ్మణుడు కలియుగ ప్రారంభం నుండీ తానే అహంకార పూరితుడై , స్వార్దపూరితుడై ధర్మాన్ని తప్పుదోవ పట్టించిన బ్రాహ్మడు, నేడు మతం మార్చుకునే హీనస్థితికి కూడా వచ్చాడు. ( నేటికీ ఫలా పేక్ష లేక నిత్య అనుష్ఠాన పరులైన ఎందరో మహా మహులున్నారు ) నేడు అధిక సంఖ్యాకులు నవనాగరిక బాటను పడుతున్న తరుణంలో నేనో బ్రాహ్మడిగా పుట్టాను. నా పూర్వీకులు ఎప్పుడో ఈ బ్రాహ్మణత్వం విడనాడి ఉద్యోగాల వేంట పడ్డారు. మా తండ్రి గారు ఈ పురోహిత వృత్తిని ఇష్టపడి ( ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదని ) మరీ స్వీకరించారు. చిత్రం నేనూ అదే స్వీకరించాను. కానీ చుట్టూ ఉన్న ప్రపంచంతో కలవలేక, ఒంటరిగా మిగలలేక అన్వేషణలో పడ్డాను. ఒక్కో స్థితిలో ఎన్నో అభినందనలు, కృతఙ్ఞతలు. మరో స్థితిలో నా వారే ఈ సాంప్రదాయాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితులు. అయినా విచిత్రం నాకు నా వృత్తిపై కల అమితమైన ప్రేమ. అదే లేక పోతే నేను ఎన్నడో ఈ వృత్తిని విడనాడే వాడినేమో. నేను స్త్రీ నిజమైన స్వాతంత్రానికి చేయూతను. ఆమె పరిపూర్ణ శక్తికి పాద సేవకుడను. నవ భారతంలో సగటు హిందూ వ్యవస్థలో నేను మొదటి మనో ఫలకమును. నా ప్రతి అనుభవం, ప్రతి ఒక స్పందనా ఓ సగటు భారతీయునిది. ఓ పామరుడిగా నన్ను నేను ప్రశ్నించుకునే ప్రతి ప్రశ్నా ఓ భారతీయ హృదయముది.
సనాతనం పేరుతో కొందరు చెప్పె కుత్సితవాదాన్ని జీర్ణించుకోలేక, ఇటు కన్నతల్లికి ద్రోహంచేసే తీవ్రవాదుల విమర్శలను వినలేక నన్న నేను ప్రశ్నించుకునే ప్రతి అక్షరం ఓ మేలుకొలుపుకు నాంది అవుతుంది. అదే ఈ బ్లాగులో వ్యక్తమవుతుంది.
nice thought processes
రిప్లయితొలగించండిఈ కాలం లో సనాతనత్వాని కి ప్రాదాన్యతనిచ్చి , ఆచరిస్తున్న , దానికి జీవమిస్తున్న మీకు అభినందనలు .
రిప్లయితొలగించండిచాలా చక్కగా సగటు భారతీయుడి హృదయాన్ని ప్రతిబింబించారు. మీ ఆశావహ దృక్పధం ఆకర్షణీయంగా ఉంది. నెనర్లు!
రిప్లయితొలగించండివిజయ్ శర్మ గారు, ఎంతో ఉన్నత భావాలతో, సత్ బ్రాహ్మణత్వం తో చేపట్టిన మీ వృత్తిని ఎందుకు ఒదలాలి.బ్రాహ్మణ గౌరవస్థానం ఇంకా భద్రంగానే ఉంది. మరచిపోతున్న మన సంప్రదాయాలను, మనస్పూర్తిగా ఆచరిస్తున్న మీ లాంటి వాళ్ళే కాపాడాలి. యుగధర్మం మారటమన్నది సహజం. కాని కలియుగానికి ఈ లక్షణం కూడా కనుమరుగయ్యింది. విదేశీయులు ఇక్కడికి ఒచ్చి హిందూ ధర్మ శాస్త్రాన్ని అభ్యసిస్తూ, సన్యాసాన్ని కూడా చేపడుతున్న ఈ రోజుల్లో, మన బాధ్యత మనమే మరిచి పోతే ఎలా? అన్నీ తెలిసిన మీ లాంటి వాళ్ళే, ఉత్సాహం తో, శక్తిని కూడగట్టుకొని నాయకత్వం వహించాలి. హిందూ ధర్మ రక్షణ కు పోరాడాలి. మొన్న హైద్రాబాద్ లో బుక్ ఎక్జిబిషన్ లో ఎంతో ఉత్సాహంగా ఈ-స్టాల్ నిర్వహిస్తున్న, మిమ్మల్ని నేను చూసాను. ఆ తరువాత మిమ్మల్ని మీ బ్లాగ్ లో మీరేం చేస్తూ ఉంటారని కూడా అడిగాను. దానికి మీరు పౌరోహిత్యం చేస్తూ ఉంటానని ఇచ్చిన సమాధానం నాకు చాలా ముచ్చటేసింది.పనిలో మీ దీక్ష నేను గమనించాను. మీరు నిరాశ చెందకుండా, ఇదే పట్టుదలతో మీ ఆశయాన్ని సాధించండి. మీకు నా హృదయపూర్వక అభినందనలు.
రిప్లయితొలగించండిమీ హృదయ స్పందనను చాలా బాగా వ్యక్తపరిచారు.
రిప్లయితొలగించండిపనియే ప్రత్యక్ష దైవం! మనం చేసే పనిలో భగవంతుడిని
చూసిననాడు తృప్తి. ఇక అన్ని విమర్శలు గురించీ ఆలోచించకూడదు,
సద్విమర్శలు మాత్రమే స్వీకరించాలి!
ఇవన్నీ మీకు తెలయవని కాదు.........
కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు..
రిప్లయితొలగించండివారికొరకు వస్తారు సూర్యచంద్రులు...
అన్న మాట గుర్తువచ్చింది మీరు వ్రాసింది చదువుతుంటే..
మీలాంటివారికోసమే సూర్యచంద్రులు వస్తున్నారు.. మీ ధర్మమా అని వాటి ఫలితము మేమూ అనుభవిస్తున్నాము..
శాస్త్రం చదవడమంటే మాటలు కాదు. అందుకు చాలా శ్రమ పడాలి. అంతకన్న ఈ రోజుల్లో డాక్టరేట్ చెయ్యడం సులభం. ఎప్పటికైనా మీ గౌరవం మీదే మరొకరికి రమ్మన్నా రాదు. నాలుగు మంచి మాటలు చెపుతూ వుంటారుకదూ..
అందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిజయ గారు: అవునా మీరు అక్కడికి వచ్చారా? ఇంకొక్క విషయమేమంటే నాకు నా వృత్తిలో ఆనందమే మెండు, నిస్పృహ ఎప్పుడో నాకు సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు ఎదురైనప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లి పోతుంది. అసలు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలనేమిటి? భగవంతుని నామస్మరణాతో అన్వేషణ గావిస్తూ ముందుకు నడవడమే నా మార్గం.దొరకక పోయినా నేను నేనే. నా వృత్తి ఉన్నతమైనదే. అందులో సందేహం లేదు. :)
చందమామ గారికి : ఏ రంగంలోనూ సంపూర్ణ తృప్తి దొరకదు. ఇంకా ఏదో లోపం అనిపిస్తూనే ఉంటుంది. నాకు నా రంగం కంటే సంతృప్తి కరమైన రంగం లేదు. :)
ఇక విమర్శలు ఎవరో చేస్తే నేను బాధపడను. ఆలోచిస్తాను. కానీ నాకే అంతుపట్టని, జీర్ణించుకో లేని విషయాలు ఎదురైనప్పుడు ఇదిగో ఇలా చిన్న ఆత్మ విమర్శ చేసుకోవడంలో భాగంగా నలుగురి సమాధానాలలో నాకు కావలసింది వెతుకుతూ ఉంటాను. అది ఎంతో సేపు ఉండదు. భగవంతుడి అనుగ్రహం వల్ల త్వరలోనే ప్రతీ దానికీ ఓ పరిష్కారం లభిస్తుంది.
మి అభిమానానికి కృతఙ్ఞతలు. కానీ అంతటి వాక్యాలు నాకు తగనివి. నేనేమీ శాస్త్రాలు చదవలేదు. నేను కేవలం ఓ సాధారణ పురోహితుడిని. కాకపోతే చేసే ప్రతిపనీ శ్రద్ధగా చేయాలని ఆశించే వాడిని. అలా చేయడమే నా బలం. నా సంధ్యోపాసనే నాకు శ్రీరామ రక్ష.
రిప్లయితొలగించండిమంచి మాటలు చెప్పడమే కాదు, మీరు చెప్తే వింటాను కూడా :)
మనము నమ్ముకున్న విషయానికి పరీక్ష ఎదురైనప్పుడు ఇలాంటి నిస్ప్రుహ, నిరాశ కలగడం సహజం.
రిప్లయితొలగించండిలేదా, మన నమ్మకం మన ఆర్ధిక స్థితి ని ప్రశ్నించి, మన దగ్గర వాళ్ళో, కుటుంబ సభ్యులో విమర్శించినప్పుడు ఇలాంటి మానసిక స్థితి కి లోను అవుతాము.
కానీ ప్రశ్న కి నిలిచి ధీమంతం గా ఉన్నప్పుడే మన నమ్మకం, విశ్వాసం మనని ధైర్యం గా ముందుకు నడుపుతుంది అనటం లో సందేహం లేదు.
నేను ఈ మధ్య చాగంటి కోటేశ్వర రావు గారి సంపూర్న శ్రీ రామాయణం వినటం జరిగింది. అప్పటి వరకు నాలో రగులుతున్న ఎన్నొ విశ్వాసాలకి, ఆచరణలకి మన సనాతన ధర్మం లో మూలాలు ఉన్నట్లు తెలుసుకున్నాను.
ఏదైన విషయం మనము తెలుసుకునే అవకాశం దొరికే వరకూ ఒక వేదన, జిగ్నాస మనల్ని వెంటాడుతూ ఉంటుంది.
శోధన లో నించే సత్యం పుడుతుంది. అది మనకి మార్గ నిర్దేశనం చేస్తుంది.
ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా, కించపరిచినా, ఎన్ని కఠిన పరీక్షలు ఎదురు అయినా తను నమ్ముకున్న సిధాంతాన్ని త్రికరణ శుద్ధి గా ఆచరించి పది మందిని ఆ దారిలో నడిపించిన మన జాతి పిత మహాత్మా గాంధి కి ఆ స్ఫూర్తి ని ఇచింది మన భగవద్గీతే, మన సనాతన ధర్మమే.
ఇంకో గాంధి ఉన్నాడా? ఇంకొకళ్ళు ఆయనకి సాటి అవుతారా?
మనము నమ్ముకున్న దాన్ని త్రికరణ శుద్ధి గా పాటించే ధైర్యం, మనో నిబ్బరం మన సనాతన ధర్మమే మనకి నేర్పించింది.
అందరం దానిని గౌరవిస్తేనే మనకి గౌరవం దక్కుతుంది.
ఎంత వ్యతిరేకత వచ్చినా మీ నిర్ణయానికి కట్టుబడి , మీ వృత్తిని పాటించడం అది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా నిజంగా అభినందనీయం. అందరూ ఉద్యోగాల వేటలో పడ్డ ఈ తరం లో ధైర్యంగా పౌరోహిత్యం స్వీకరించిన మీకు జోహార్లు.
రిప్లయితొలగించండిమంచి ప్రయత్నం. అభినందనలు.
రిప్లయితొలగించండిరాజశేఖర్ గారు,
రిప్లయితొలగించండిభరతజాతి ధర్మం
మానవ జాతి మర్మం
సకల జీవ సత్యం
సర్వేశ్వరుని స్థానం
అయిన భావం పై మీకున్న అభిప్రాయాలు కలవాడిగా మీ అభిప్రాయాలకు సంతొషిస్తున్నాను
ఇది ప్రపంచీకరన ప్రభావమని బాధ పడాలో
మనల్ని మనమే మరిచే అనాగరికమని అరవాలో
మళ్ళీ మన సంప్రదాయ హ్రుదయం పై కప్పిన ముసుగు తొలుగుతుందని ఆశిద్దాం.
విజయ్ గారూ!
రిప్లయితొలగించండిఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను విశ్లేషిస్తూ సాగుతున్న మీ ఆలోచనా ధోరణి బాగుంది.
మీలాగా వృత్తిని అమితంగా ప్రేమించే వారివల్ల వృత్తికే గౌరవం వస్తుంది.
అసలు భగవంతుని మంగళ స్వరూపాన్ని నిరంతరం సేవించే భాగ్యం పొందిన పూజారులు, మాకందరికీ జీవితంలోని ప్రతి మలుపులోనూ మార్గదర్శనం గావించే పురోహితుల పట్ల మాకెంతో గౌరవం ఉంది. మీకు శుభం కలగాలని కోరుకుంటూ - మందాకిని
మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
రిప్లయితొలగించండిkathasv@gmail.com
jeevani.sv@gmail.com
మీ,
జీవని.
జన్మనా జాయతే శూద్రహః - అంటారు కదా ఆ లెక్కన పుట్టిన ప్రతి ఒక్కరూ శూద్రులే.. కాని వారి వారి మానసిక పరిపక్వతను బట్టి వారు బ్రాహ్మణనులో కాదో నిర్ణయం అవుతుంది.. మీరన్నట్టు మీ వృత్తిని కూడా మీరే ఎంచుకున్నారు మీ నాన్న గారిలా...
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండినేను మీ బ్లాగ్ చూసాను చాల చాల బాగావుంది....
రిప్లయితొలగించండిశర్మ గారు నిత్యాగ్నిహోత్రం చేయక పోయినంత మాత్రాన, రోజూ మూడు సార్లు సంధ్యా వందనం చేయనంత మాత్రాన, ఉద్యోగం చేసుకుంటూ పొట్ట పోసుకున్తున్నంత మాత్రాన మేము బ్రాహ్మణులం కాదు అనకండి దయచేసి. మన అందరి కష్టసుఖాలు మనకు ఉన్నాయి. బ్రహ్మణ్యం అంటే వర్చస్సు. ఆ వర్చస్సు ఆలోచనా సరళిని బట్టి వస్తుంది. అక్రూరులమై, భగవంతుని యందు భక్తీ, భయమూ, విశ్వాసమూ కలిగి ఉంటున్నాము, ఈ పరిస్థితులలో మేము ఏమి చేయాలి అని అడిగిన వారికి అందరికీ సరి అయిన సలహాలు ఇస్తూ వారు సరి అయిన మార్గం లో నడిచే విధం గా దిశా నిర్దేశం చేస్తూ ఉన్నాము మాకు చేతనయినంత వరకు. సంస్కృతమూ, వేదమూ చదువుకొని ప్రతి దినమూ జప, తప, హోమాదులు చేయలేక పోతున్నందుకు చింతిస్తూ ఉన్నాము, చేసినంత వరకూ చేసినదానికి భగవంతుడు దయ చేసి కొంత అయినా పుణ్య ఫలాన్ని అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నాము.
రిప్లయితొలగించండి